• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బాలయ్య 1 రవితేజ 5.. మరి ఈ...

బాలయ్య 1 రవితేజ 5.. మరి ఈ సారి విన్నర్ ఎవరో..

| స్టార్ హీరోల మధ్య బాక్సాఫీస్ వార్ ఉంటేనే ఆడియెన్స్ తో పాటు ఫ్యాన్స్ లో కిక్ ఉంటుంది

By - Tupaki Desk
Update: 2023-08-01 13:30 GMT

పోటీ ఉంటేనే సత్తా అవతలి వ్యక్తి ఖలేజా ఏంటో తెలుస్తుంది. చిత్ర పరిశ్రమలోనూ అంతే. స్టార్ హీరోల మధ్య బాక్సాఫీస్ వార్ ఉంటేనే ఆడియెన్స్ తో పాటు ఫ్యాన్స్ లో కిక్ ఉంటుంది. బాక్సాఫీస్ షేక్ అవుతుంది. ప్రతి సీజన్ లోనూ ఇలాంటి వార్ జరుగుతూనే ఉంటుంది. అయితే త్వరలోనే దసరా సీజన్ రాబోతుంది. ఈ సీజన్ లో బాలయ్య వర్సెస్ రవితేజ పోరుకు సిద్ధమవుతున్నారు. బాలయ్య 'భ‌గ‌వంత్ కేస‌రి'గా రానుండగా.. ర‌వితేజ 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'గా సందడి చేయనున్నారు. అయితే వీరిద్దరు ఇప్పుడే కాదు గతంలోనూ పలుసార్లు తమ చిత్రాలతో తలపడ్డారు. మరి ఆ చిత్రాలేంటి, అప్పుడు ఎవరు పైచేయి సాధించారో తెలుసుకుందాం..

'ప‌ల‌నాటి బ్ర‌హ్మ‌నాయుడు'గా నందమూరి బాల‌కృష్ణ జూన్ 13, 2003లో బాక్సాఫీస్ ముందుకు రాగా.. ఆరు రోజుల గ్యాప్ లో 'ఒక రాజు ఒక రాణి' అంటూ జూన్ 19 ఆడియెన్స్ ముందుకు వచ్చారు రవితేజ. అయితే ఈ రెండు చిత్రాలు ఆకట్టుకోలేకపోయాయి. 2005లో అక్టోబ‌ర్ 5న బాలయ్య 'అల్ల‌రి పిడుగు'తో ముందుకు రాగా.. ర‌వితేజ 'భ‌గీర‌థ' అక్టోబ‌ర్ 13న అభిమానులను పలకరించింది. ఇందులో భగీరథ పర్వాలేదనిపించగా... అల్లరి పిడుగు నిరాశ పరిచింది.

2008లో సంక్రాంతికి 'ఒక్క‌మ‌గాడు'గా(జనవరి 11) బాలయ్య సందడి చేయగా.. జ‌న‌వ‌రి 12న ర‌వితేజ 'కృష్ణ'గా వచ్చారు. రవితేజ కృష్ణ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. 2009లో మే1న బాల‌కృష్ణ 'మిత్రుడు' మూవీతో పలకరించగా.. వారం గ్యాప్‌లో వచ్చిన 'కిక్'.. రవితేజ మరో భారీ హిట్ ను అందించింది. మిత్రుడు ఫ్లాప్ అయింది.

బాల‌కృష్ణ 'ప‌ర‌మ‌వీరచ‌క్ర' 2011 సంక్రాంతికి రాగా జ‌న‌వ‌రి 12న రవితేజ మిరపకాయ్ వచ్చింది. మళ్లీ రవితజే 'మిరపకాయ్' సూపర్ హిట్ గా నిలిచింది. 2012లో 'ద‌రువు' అంటూ మే 25న బాక్సాఫీస్ ముందు సందడి చేయగా.. వారం గ్యాప్‌తో జూన్ 1న వచ్చిన బాలయ్య 'అధినాయ‌కుడు' బోల్తా కొట్టింది.

2012 ఆగ‌స్ట్ 15న ర‌వితేజ 'దేవుడు చేసిన మ‌నుషులు' అట్టర్ ఫ్లావ్ అవ్వగా.. రెండు వారాల గ్యాప్‌లో వచ్చిన బాల‌కృష్ణ 'శ్రీమ‌న్నారాయ‌ణ' ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. 2023లో బాల‌కృష్ణ 'వీర సింహా రెడ్డి' బ్లాక్ బస్టర్ హిట్ అవ్వగా.. ఆ మరుసటి రోజే వచ్చిన 'వాల్తేరు వీర‌య్య'లో బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యాన్ని సొంతం చేసుకుంది.

ఇప్పుడు ఈ సారి దసరా సీజన్ లో బాలయ్య అక్టోబ‌ర్ 19న 'భ‌గ‌వంత్ కేస‌రి'గా రానున్నారు. ఆ తర్వాతి రోజే అక్టోబ‌ర్ 20న ర‌వితేజ 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'గా పోటీకి సిద్ధమవుతున్నారు. మరి ఈ బాక్సాఫీస్ పోరులో ఎవరు గెలుస్తారో చూడాలి..

Tags:    
  • Balakrishna 
  • Raviteja 
  • Bhagavanthkesari 
  • Tigernageshwararao 
  • Tollywoodfilms 
  • Anilravipudi 

Similar News

హీరోగా అల్లు అరవింద్.. హీరోయిన్‌గా జయసుధ.. సినిమా పేరు ఏంటంటే!

2026-11-04 09:15 GMT

సినిమాను బలిపశువును చేయొద్దు.. సందీప్ వంగా

2026-11-04 09:12 GMT

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

అవకాశాలు అందుకుని విమర్శలా.. ఎస్కేఎన్ ఘాటైన కౌంటర్!

2026-11-04 08:12 GMT

బెల్లంకొండ శ్రీనివాస్.. మళ్లీ ఆ బలాన్నే నమ్ముకున్నారా!

2026-11-04 08:03 GMT

రెండో పెళ్లి కూడా విఫలం..నాలుగేళ్లకే భర్తకు విడాకులు!

2026-11-04 08:02 GMT

అజిత్‌తో జతకట్టనున్న శ్రీలీల.. పూజా వేడుకలో లుక్ వైరల్!

2026-11-04 08:01 GMT

హీరోయిన్ల విషయంలో అదే వివక్ష.. కోట్లు కుమ్మరించే ధైర్యం చేయండి!

2026-11-04 08:01 GMT

ధర్మన్ శ్రీలీల.. ఈ కాంబినేషన్ వెనుక ప్లాన్ ఏంటి!

2026-11-04 07:05 GMT

భార‌తీయ న‌టులంతా జ‌క్క‌న్న ప్రేమ్ లో అది ఎందులో అంటే?

2026-11-04 07:05 GMT

Copyright @2026

Powered by Blink CMS