• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి.....

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి.. రంగంలోకి స్టార్ హీరో

| విభిన్న కథలతో మూవీస్ చేస్తూ తనదైన శైలిలో నటుడిగా ఇమేజ్ బిల్డ్ చేసుకుంటున్న యాక్టర్ విశ్వక్ సేన్.

By - Tupaki Desk
Update: 2024-05-26 11:07 GMT

విభిన్న కథలతో మూవీస్ చేస్తూ తనదైన శైలిలో నటుడిగా ఇమేజ్ బిల్డ్ చేసుకుంటున్న యాక్టర్ విశ్వక్ సేన్. అతను నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ మే 31న థియేటర్స్ లోకి వస్తోంది. కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించాయి. విశ్వక్ సేన్ కెరియర్ లో గోదావరి బ్యాక్ డ్రాప్ లో చేస్తోన్న సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి.


అంతకు ముందు అశోకవనంలో అర్జున కళ్యాణం అనే సినిమా చేశాడు. అయితే ఆ సినిమాలో తెలంగాణ యువకుడిగా నటించాడు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీలో మాత్రం పక్కా గోదావరి యువకుడిగా, మాస్ లీడర్ గా విశ్వక్ సేన్ కనిపించబోతున్నాడు. శనివారం రిలీజ్ అయిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ ట్రైలర్ కి ఫుల్ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. కచ్చితంగా విశ్వక్ సేన్ కెరియర్ లో బెస్ట్ మూవీ అవుతుందని చిత్ర యూనిట్ భావిస్తోంది.

ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ ని స్ట్రాంగ్ గా చేస్తున్నారు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీరిలీజ్ ఈవెంట్ మే 28న జరగనుంది. ఈ ఈవెంట్ కి నందమూరి నటసింహం బాలకృష్ణ చీఫ్ గెస్ట్ గా హాజరుకాబోతున్నారు. ఈ విషయాన్ని విశ్వక్ సేన్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ గా పరోక్షంగా కన్ఫర్మ్ చేశారు. ప్రస్తుతం బాలకృష్ణ సితార ఎంటర్టైన్మెంట్స్ లో బాబీ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ స్టేజ్ లో ఉంది.

అలాగే విశ్వక్ షేన్ అంటే బాలయ్యకి ప్రత్యేకమైన అభిమానం ఉంది. ఈ కారణంగానే ప్రీరిలీజ్ ఈవెంట్ కి ఇన్వైట్ చేయగానే బాలకృష్ణ వస్తానని మాట ఇచ్చారంట. బాలకృష్ణ ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ లో పాల్గొంటే నందమూరి అభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉంది. విశ్వక్ సేన్ ని తారక్ అభిమానులకి విపరీతంగా ఫాలో అవుతారు. అతని సినిమాలని సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తూ ఉంటారు.

బాలయ్య బాబు ఇప్పుడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీరిలీజ్ కి రానున్న నేపథ్యంలో నందమూరి ఫ్యాన్స్ ఈ సినిమాని చూడటానికి ఆసక్తి చూపించే అవకాశం ఉంటుంది. ట్రైలర్ తో మూవీ పైన మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఇప్పుడు బాలకృష్ణ ఇమేజ్ ఈ సినిమా ప్రమోషన్స్ కి తోడైతే భారీ ఓపెనింగ్స్ రావడానికి అవకాశం ఉంటుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రంలో విశ్వక్ సేన్ కి జోడీగా నేహా శెట్టి నటిస్తోంది, అంజలి కీలక పాత్రలో కనిపించబోతోంది. సినిమాలో యువన్ శంకర్ రాజా మ్యూజిక్ తో వచ్చిన రెండు సాంగ్స్ కి ఇప్పటికే అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

Tags:    
  • Balakrishna 
  • Gangsofgodavari 
  • Krishnachaitanya 
  • Sithara 
  • Nagavamsi 
  • NBK109 
  • Tollywood 
  • Viswaksen 

Similar News

కాజల్ అగర్వాల్ అభిమానులు హార్ట్!

2026-11-06 19:30 GMT

మోడ్రన్ అవుట్‌ఫిట్‌లో సారా అర్జున్ ఫ్యాషన్ ట్రీట్!

2026-11-06 18:30 GMT

చాక్లెట్ బాయ్ ట్యాగ్ చెరిపేసి.. క్రూరమైన విలన్‌గా!

2026-11-06 17:30 GMT

శ్ర‌ద్ధాక‌పూర్ కొత్త‌ లుక్: న‌ట్టింట ల‌క్ష్మీ దేవి ప్ర‌త్య‌క్ష‌మైన‌ట్టు

2026-11-06 16:30 GMT

టైసన్ నాయుడు ఫస్ట్ సింగిల్.. క్యాచీ ఫోక్ బీట్ తో 'మదరాసి రబ్బరు బొమ్మ'

2026-11-06 16:03 GMT

సగం షెడ్యూల్‌కే గుడ్‌బై.. న్యాయపోరాటాలు!

2026-11-06 15:30 GMT

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

Copyright @2026

Powered by Blink CMS