బాలయ్య మూవీ కోసం కొరటాల పెద్ద ప్లానింగ్!
బాలకృష్ణ, కొరటాల శివ కాంబో మూవీ ఇప్పటికే ప్రారంభం అయింది. బాలకృష్ణ ఎమ్మెల్యేగా బిజీ బిజీగా ఉంటున్నప్పటికీ వరుస సినిమాలకు కావాల్సినన్ని డేట్లు ఇస్తూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నాడు.
బ్యాక్ టు బ్యాక్ నాలుగు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్‌ను అందించి అందరి దృష్టిని ఆకర్షించిన దర్శకుడు కొరటాల శివ ఆచార్య, దేవర సినిమాలతో నిరాశ పరిచిన విషయం తెల్సిందే. ముఖ్యంగా దేవర సినిమా తర్వాత కొరటాల శివకు చాలా డ్యామేజీ జరిగిందని విశ్లేషకులు అంటున్నారు. దేవర పార్ట్ 2 చేయాల్సి ఉన్నా కూడా ఎన్టీఆర్ బిజీగా ఉండటం, పైగా దేవర 1 నిరాశ పరచడం వల్ల కొరటాల శివ మరో సినిమాను చేయాల్సి వస్తుంది. అసలు కొరటాల శివ మళ్లీ మెగా ఫోన్ పట్టుకునే అవకాశం దక్కించుకుంటాడా అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. కానీ దర్శకుడు కొరటాల శివకు అనూహ్యంగా నందమూరి బాలకృష్ణను డైరెక్ట్ చేసే అవకాశం దక్కింది. బాలకృష్ణ ప్రస్తుతం ఉన్న ఫామ్ నేపథ్యంలో కొరటాల శివకు డేట్లు ఇవ్వడం అంటే కచ్చితంగా పెద్ద విషయం అని నందమూరి అభిమానులు, ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
కొరటాల శివ కొత్త సినిమా...
బాలకృష్ణ, కొరటాల శివ కాంబో మూవీ ఇప్పటికే ప్రారంభం అయింది. బాలకృష్ణ ఎమ్మెల్యేగా బిజీ బిజీగా ఉంటున్నప్పటికీ వరుస సినిమాలకు కావాల్సినన్ని డేట్లు ఇస్తూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నాడు. కొరటాల శివ సినిమా కోసం బాలకృష్ణ ఆగస్టు నెల పూర్తిగా కేటాయించాడని తెలుస్తోంది. టాకీ పార్ట్‌తో పాటు మెజార్టీ షూటింగ్ పూర్తి చేసే విధంగా దర్శకుడు శివ ప్లాన్ చేశాడట. ఇక ఆచార్య, దేవర సినిమాల ఫలితం నేపథ్యంలో కొరటాల శివ ఆచితూచి వ్యవహరిస్తున్నట్లుగా ఆయన సన్నిహితులు చెబుతున్నారు. బాలకృష్ణతో సినిమా అంటే దర్శకుడికి పూర్తి స్వేచ్చ ఉంటుందనే టాక్ ఉంది. కనుక దర్శకుడు కొరటాల శివ ఆ స్వేచ్చను ఉపయోగించుకుని కచ్చితంగా తన గత చిత్రాల ఫలితాలను పునరావృతం చేస్తాడని ఆయన సన్నిహితులు, ఇండస్ట్రీ వర్గాల వారు నమ్మకంగా చెబుతున్నారు.
బాలకృష్ణ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్..
కొరటాల కెరీర్ ఆరంభంలో చేసిన సినిమాలను చూస్తే హీరో పాత్ర విభిన్నంగా ఉంటుంది. మరీ మాస్ కాకుండా, క్లాస్ కాకుండా మోడరేట్ తరహాలో ఉంటుంది. బాలకృష్ణను సైతం అదే తరహా పాత్రలో చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది. కావాల్సిన సీన్స్‌లో హీరోయిజం ఎలివేట్ చేస్తూ బాలకృష్ణ అభిమానులకు ఫుల్ మీల్స్ వంటి మూవీ ఇవ్వాలనే పట్టుదలతో కొరటాల శివ దాదాపు నాలుగు నెలల పాటు స్క్రిప్ట్ వర్క్ చేసినట్లుగా యూనిట్ సభ్యులు చెబుతున్నారు. బాలకృష్ణతో చేస్తున్న ఈ సినిమాతో హిట్ కొట్టి మళ్లీ టాలీవుడ్ దృష్టిని తన వైపుకు తిప్పుకునేందుకు దర్శకుడు కొరటాల శివ పెద్ద ప్లానింగ్ వేశాడు అని అంటున్నారు. బాలకృష్ణతో చేస్తున్న ఈ సినిమా హిట్ అయితే ఎన్టీఆర్ సైతం పిలిచి మరీ దేవర పార్ట్ 2 సినిమాను చేద్దామని అడిగే అవకాశాలు లేకపోలేదు అనేది కొందరి అభిప్రాయం.
బాలకృష్ణ, కొరటాల మూవీ రిలీజ్ డేట్..
బాలకృష్ణను ప్రతి సినిమాలోనూ విభిన్నంగా చూడాలి, పవర్ ఫుల్ లుక్‌లో, విభిన్నమైన గెటప్స్‌లో చూడాలని అభిమానులు కోరుకుంటూ ఉంటారు. అందుకు తగ్గట్లుగానే ఈ సినిమాలో ఆయన లుక్ ఉంటుంది అని కొరటాల శివ టీమ్ మెంబర్స్ చెబుతున్నారు. మాస్ అవతార్‌లో కనిపిస్తూనే బాలయ్య పాత్ర చాలా సెటిల్డ్‌గా ఉంటుందని అంటున్నారు. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు, మాస్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమా నడుస్తుందని అంటున్నారు. ఆకట్టుకునే కథ, కథనంతో బాలకృష్ణ ఫ్యాన్స్‌ను మాత్రమే కాకుండా అన్ని వర్గాల వారిని మెప్పించే విధంగా కొరటాల శివ ఈ సినిమాను రూపొందించబోతున్నాడని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. అన్ని అనుకున్నట్లుగా జరిగితే వచ్చే ఏడాది సమ్మర్ వరకు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. బాలకృష్ణ ప్రస్తుతం ఉన్న జోష్ నేపథ్యంలో మినిమం హిట్ కొట్టిన భారీ వసూళ్లు నమోదు కావడం ఖాయం అని బాక్సాఫీస్ వర్గాల వారు అంటున్నారు. కొరటాల శివ భవిష్యత్తు బాలయ్య మూవీపైనే ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.