బుల్లెట్స్‌కి బలుపు ఉండాలి: బాలయ్య ‘దాదా’ గ్లింప్స్
నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో గతంలో వచ్చిన వీరసింహారెడ్డి బాక్సాఫీస్ వద్ద మాస్ ప్రేక్షకులను మంచి కిక్ ఇచ్చింది.
నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో గతంలో వచ్చిన వీరసింహారెడ్డి బాక్సాఫీస్ వద్ద మాస్ ప్రేక్షకులను మంచి కిక్ ఇచ్చింది. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ పై మరో క్రేజీ అప్డేట్ ఇచ్చారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించి దాదా అనే టైటిల్‌ను ఖరారు చేస్తూ మేకర్స్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 24న థియేటర్లలోకి రానుంది.
ముంబై బ్యాక్‌డ్రాప్‌ను తలపించేలా గేట్‌వే ఆఫ్ ఇండియా విజువల్స్, వర్షం నడుమ హిందీ వాయిస్‌ఓవర్‌తో గ్లింప్స్ మొదలవుతుంది. ఈ నగరంలో అతడి పేరు ఎత్తడానికే ఎంతో ధైర్యం కావాలంటూ పాత్ర స్వభావాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఆ తర్వాత షేర్ ఆగయా అంటూ నందమూరి బాలకృష్ణ స్క్రీన్‌పైకి ఎంట్రీ ఇచ్చే విజువల్స్ కనిపిస్తాయి. లెదర్ జాకెట్, సన్ గ్లాసెస్ ధరించి సిగరెట్ కాలుస్తూ ఎప్పటిలాగే తనదైన మాస్ స్వాగ్‌తో బాలయ్య దర్శనమిచ్చారు.
పోలీస్ స్టేషన్ సెటప్‌లో చుట్టుముట్టిన పోలీసుల మధ్య దర్జాగా కూర్చుని ఉన్న సీన్ హైలెట్ అయ్యింది. ఆ సీన్ తో హీరో క్యారెక్టర్‌లోని డామినేషన్‌ను చూపించారు. అగ్గిపెట్టుందా అంటూ విసిరే డైలాగ్‌తో మొదలై, బాలయ్య మార్క్ ఫైట్ సీక్వెన్స్‌లతో సాగుతుంది. గొడ్డలి పట్టుకుని రక్తసిక్తమైన చేతులతో ప్రత్యర్థులను వేటాడే యాక్షన్ బ్లాక్స్ రెగ్యులర్ గోపీచంద్ మలినేని స్టైల్ లో డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.
చివర్లో టేబుల్‌పై కూర్చుని చెప్పే 'అరేయ్.. నాకు గురిపెట్టడానికి ఒంట్లో పొగరు, వేలికి ట్రిగ్గర్ ఉంటే సరిపోదు.. బుల్లెట్స్‌కి బలుపు ఉండాలి, గన్స్‌కి గట్సుండాలి' అనే పవర్ఫుల్ డైలాగ్ బాలకృష్ణ ఫ్యాన్స్‌ను ఆకట్టుకునేలా ఉంది. ఆ తర్వాత బ్యాక్‌గ్రౌండ్ కోరస్‌తో దాదా టైటిల్‌ను రివీల్ చేశారు. చేతిలో సుత్తి పట్టుకుని మాస్ లుక్‌లో విలన్లను కొట్టే విజువల్స్ కిక్ ఇచ్చేలా ఉన్నాయి.
ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే, థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాలయ్య టెంపో లోనే ఉంది. గోపీచంద్ మలినేని గత సినిమాల మాదిరిగానే పూర్తిస్థాయి కమర్షియల్ హంగులతోనే ఈ స్క్రిప్ట్‌ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇక దాదా టైటిల్ గ్లింప్స్ చూస్తే నందమూరి బాలకృష్ణ నుంచి ఫ్యాన్స్ ఆశించే మాస్ ఎలిమెంట్స్‌తో కూడిన ఒక రెగ్యులర్ కమర్షియల్ ప్యాకేజీలా కనిపిస్తోంది. మాస్ ను టార్గెట్ చేస్తూ పక్కా మాస్ లైనప్‌లోనే ప్రాజెక్ట్‌ను డిజైన్ చేశారు. క్రిస్మస్ కానుకగా రాబోతున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏ మేరకు ప్రభావం చూపుతుందో చూడాలి.