బాల‌య్యతో గీతా క్రేజీ డీల్‌?

నంద‌మూరి బాల‌కృష్ణ‌, బోయ‌పాటి శ్రీ‌నుల కాంబినేష‌న్‌కున్న ప్ర‌త్యేక‌తే వేరు. వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో రూపొందిన సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద బ్లాక్ బ‌స్ట‌ర్లుగా నిలిచి క‌లెక్ష‌న్‌ల వ‌ర్షం కురిపించాయి.;

Update: 2025-12-17 18:30 GMT

నంద‌మూరి బాల‌కృష్ణ‌, బోయ‌పాటి శ్రీ‌నుల కాంబినేష‌న్‌కున్న ప్ర‌త్యేక‌తే వేరు. వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో రూపొందిన సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద బ్లాక్ బ‌స్ట‌ర్లుగా నిలిచి క‌లెక్ష‌న్‌ల వ‌ర్షం కురిపించాయి. బాల‌య్య కెరీర్‌లో అత్య‌ధిక వ‌సూళ్ల‌ని రాబ‌ట్టిన సినిమాలుగా నిలిచాయి. సింహా, లెజెండ్‌, అఖండ వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో వ‌చ్చిన‌ హ్యాట్రిక్ హిట్‌లివి. తాజాగా వీరి కాంబినేష‌న్‌లో `అఖండ‌`కు సీక్వెల్‌గా రూపొందిన మూవీ `అఖండ 2`.

డిసెంబ‌ర్ 12న విడుద‌లైన ఈ మూవీ డివైడ్ టాక్‌ని సొంతం చేసుకుని ప్ర‌స్తుతం బ్రేక్ ఈవెన్ కోసం నానా క‌ష్టాలు ప‌డుతోంది. ఇదిలా ఉంటే `అఖండ 2` థియేట‌ర్లలో ఉండ‌గానే బోయ‌పాటి, బాల‌య్య‌ల కాంబినేష‌న్‌లో మ‌రో సినిమాకు రంగం సిద్ధ‌మ‌వుతోంద‌నే వార్త టాలీవుడ్‌లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇప్ప‌టికే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన చర్చ‌లు మొద‌ల‌య్యాయని ఇన్ సైడ్ టాక్‌.

అయితే ఈ భారీ క్రేజీ ప్రాజెక్ట్‌ని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ సెట్స్ పైకి తీసుకెళ్ల‌బోతోంద‌ట‌. `స‌రైనోడు` త‌రువాత బోయ‌పాటి శ్రీ‌ను మ‌రో సారి అల్లు అర్జున్‌తో సినిమా చేయాల‌నుకున్నాడు. బ‌న్నీకి కొన్ని క‌థ‌లు వినిపంచారు. అవి పెద్ద‌గా న‌చ్చ‌లేదు. బ‌న్నీతో కాక‌పోతే చిరుతో భారీ యాక్ష‌న్ ప్రాజెక్ట్ చేయాల‌ని ప్లాన్ చేశారు. కానీ ఎందుకో అదీ వ‌ర్క‌వుట్ కాలేదు. ఆ త‌రువాత సూర్య‌- బోయ‌పాటి కాంబినేష‌న్‌లో సినిమా అనుకున్నారు. స్టోరీ ఫైన‌ల్ అయింది ఇక త్వ‌ర‌లోనే సినిమా స్టార్ట్ అనే వార్త‌లు కూడా వినిపించాయి.

కానీ అది కూడా కార్య‌రూపం దాల్చ‌లేదు. ఇక బాల‌య్య ఆహా కోసం `అన్ స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకె` చేశాడు. అప్ప‌టి నుంచే బాల‌య్య‌-బోయ‌పాటి క‌ల‌యిక‌లో గీతా ఆర్ట్స్‌లో ఓ భారీ పోలిటిక‌ల్ యాక్ష‌న్ డ్రామా చేయాల‌ని అనుకున్నారు కానీ అది కూడా మెటీరియ‌లైజ్ కాలేదు. అలా చాలా కాలంగా పెడింగ్‌లో ఉన్న బాల‌య్య - గీతా ఆర్ట్స్ కాంబినేష‌న్ ఇప్పుడు ప‌ట్టాలెక్క‌బోతోంద‌నే వార్త ప్ర‌స్తుతం ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

అభిమానుల్లోనూ ఈ ప్రాజెక్ట్ పై అత్యంత ఆస‌క్తి ఏర్పింది. అన్నీ అనుకున్న‌ట్టుగా సెట్ట‌యితే మాత్రం ఈ ప్రాజెక్ట్ క్రేజీ ప్రాజెక్ట్‌గా మారే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఇక చ‌ర్చ‌ల ద‌శ‌లో ఉన్న ఈ మూవీ అనుకున్న‌ట్టుగా సెట్ట‌యితే మాత్రం 2027లో సెట్స్ పైకి వెళ్లే అవ‌కాశం ఉంద‌ని, హై ఓల్టేజ్ యాక్ష‌న్ డ్రామాగా ఈ సినిమా ఉండే అవ‌కాశం ఉంద‌ని టాలీవుడ్ వ‌ర్గాల్లో వినిపిస్తోంది. ఇదే నిజ‌మైతే బాల‌య్య ఫ్యాన్స్‌కు ఇది డ‌బుల్ బొనాంజా కావ‌డం ఖాయం.

Tags:    

Similar News