బాలయ్య స్ట్రెంత్.. ఇప్పుడు అదే పెద్ద టెన్షన్!

కానీ ఇప్పుడు బాలయ్య స్ట్రెంత్.. ఆయన కొత్త సినిమాకు టెన్షన్‌ గా మారుతోంది. భారీ యాక్షన్‌ తో తెరకెక్కనున్న NBK112 విషయంలో అసలు సవాల్ ఇదేనని టాక్ వినిపిస్తోంది.

Update: 2026-09-11 01:56 GMT

బాలయ్య సినిమాలో ఫైట్ అంటే.. ఫ్యాన్స్‌ కు పండగే. ఆయన ఒక్కసారి రంగంలోకి దిగితే యాక్షన్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా ఫైట్ సీన్లలో డూప్ కంటే తానే చేయడానికి ఎక్కువగా ఇష్టపడతారు. కానీ ఇప్పుడు బాలయ్య స్ట్రెంత్.. ఆయన కొత్త సినిమాకు టెన్షన్‌ గా మారుతోంది. భారీ యాక్షన్‌ తో తెరకెక్కనున్న NBK112 విషయంలో అసలు సవాల్ ఇదేనని టాక్ వినిపిస్తోంది.

బాలకృష్ణతో కొరటాల శివ చేస్తున్న ఆ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఈసారి బాలయ్యను ఇప్పటివరకు చూడని రేంజ్ లో చూపించాలని కొరటాల ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే కథలో యాక్షన్ ఎపిసోడ్స్‌ కు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చినట్లు సమాచారం. సాధారణంగా కొరటాల సినిమాల్లో కథ, హీరో క్యారెక్టర్, ఒక స్ట్రాంగ్ పాయింట్ చుట్టూ స్టోరీ ఉంటుంది. కానీ NBK112లో మాత్రం యాక్షన్‌ దే ఎక్కువ హవా ఉండనుందని సమాచారం.

ఇప్పటికే కొరటాల సిద్ధం చేసిన కథలోని యాక్షన్ ఎలిమెంట్స్ బాలయ్యకు కూడా బాగా నచ్చాయట. అంటే సినిమా మొదలైతే ఫ్యాన్స్‌ కు కావాల్సిన మాస్ ట్రీట్ గ్యారెంటీ అన్నమాట. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. భారీ యాక్షన్ సీన్లు అంటే హీరోకు కూడా అంతే రేంజ్ లో ఫిజికల్ స్ట్రెయిన్ ఉంటుంది. అందుకే ఇలాంటి సీన్స్ లో సాధారణంగా బాడీ డబుల్స్‌ యూత్ చేస్తారు. కానీ బాలయ్య మాత్రం తన యాక్షన్‌ ను తానే చేయడానికి ఇష్టపడతారు.

డూప్‌ తో చేయించడం ఆయనకు పెద్దగా నచ్చదు. ఫైట్‌ లో హీరో కనిపిస్తే వచ్చే ఆ ఇంపాక్ట్ వేరే లెవల్‌ లో ఉంటుందని ఆయన నమ్ముతారు. అయితే ఇటీవల బాలయ్యకు గాయం కావడం, ఆపరేషన్ జరగడంతో పరిస్థితి మారింది. ప్రస్తుతం ఆయన రెస్ట్ తీసుకుంటున్నారు. ఎక్కువ ఫిజికల్ స్ట్రెయిన్ తీసుకోవద్దని డాక్టర్లు సజెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు కొరటాల ముందున్న ప్రశ్న ఒక్కటే.. యాక్షన్‌ ను ఎలా డిజైన్ చేయాలి? అన్నదే..

ఎందుకంటే యాక్షన్ తగ్గిస్తే బాలయ్య సినిమా అనే ఫీల్ తగ్గే ఛాన్స్ ఉంది. భారీగా చేస్తే హీరోపై ప్రెజర్ పెరిగే అవకాశం ఉంది. మరోవైపు డూప్‌ ను యూజ్ చేయడం కూడా బాలయ్యకు అంతగా ఇష్టం లేదు. దీంతో ఆ మూడు విషయాల మధ్య బ్యాలెన్స్ చేయాల్సిన బాధ్యత కొరటాలపై పడింది. ప్రస్తుతం NBK112 ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. డిసెంబర్‌ లో షూటింగ్ మొదలు పెట్టాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అప్పటికి బాలయ్య పూర్తిగా కోలుకుని షూటింగ్‌ కు సిద్ధం కావాల్సి ఉంటుంది.

అంతేకాదు.. యాక్షన్ సీన్ల విషయంలో చాలా జాగ్రత్తగా ప్లాన్ చేయాల్సి ఉంటుంది. అలా బాలయ్యకు యాక్షన్ స్ట్రెంత్.. అదే ఇప్పుడు NBK112కి పెద్ద ఛాలెంజ్. ఫ్యాన్స్ కోరుకునే మాస్ యాక్షన్‌ ను తగ్గించకుండా.. బాలయ్యపై ఎక్కువ భారం పడకుండా కొరటాల ఎలాంటి ప్లాన్ వేస్తారనేది ఆసక్తికరంగా మారింది. బాలయ్య స్ట్రెంత్ ఏ మాత్రం తగ్గకూడదు.. అదే సమయంలో రిస్క్ ఉండకూడదు. ఆ రెండింటినీ కొరటాల ఎలా బ్యాలెన్స్ చేస్తారో చూడాలి.

Tags:    

Similar News