• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అఖండ 2 కోసం విదేశీ...

అఖండ 2 కోసం విదేశీ విలన్.. బోయపాటి న్యూ ప్లాన్

| బాలయ్య, బోయపాటి కాంబినేషన్ అంటే నందమూరి ఫ్యాన్స్ కూడా ముందే బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అని ఫిక్స్ అయిపోతారు.

By - Tupaki Desk
Update: 2024-09-12 11:30 GMT

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో సింహ, లెజెండ్, అఖండ సినిమాలు ఏ స్థాయిలో హిట్టయ్యాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ మూడు ఒకదానిని మించి మరొకటి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకొని నిర్మాతలకి భారీ లాభాలు తెచ్చిపెట్టాయి. బాలయ్యతో చేసిన ఈ సినిమాలే బోయపాటిని స్టార్ డైరెక్టర్ గా నిలబెట్టాయి. బాలయ్య, బోయపాటి కాంబినేషన్ అంటే నందమూరి ఫ్యాన్స్ కూడా ముందే బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అని ఫిక్స్ అయిపోతారు.

అంతగా వారి కాంబినేషన్ పై అభిమానులకి నమ్మకం ఏర్పడింది. ఇదిలా ఉంటే ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో అఖండ సీక్వెల్ త్వరలో ప్రారంభం కాబోతోంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రీప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. అఖండ 2 టైటిల్ తో ఈ చిత్రాన్ని బోయపాటి తెరకెక్కించబోతున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో విలన్ కోసం బోయపాటి శ్రీను వేట మొదలెట్టారంట. ఓ కొత్త విలన్ ని పరిచయం చేయాలని అనుకుంటున్నారంట.

అందుకే కోసం అఖండ 2 టీమ్ ఆడిషన్ కాల్ ఇచ్చింది. అఖండ 2లో విలన్ పాత్ర కోసం చైనీస్ లేదంటే ఈశాన్య రాష్ట్రాలకి చెందిన వ్యక్తి కోసం చూస్తున్నామని ఆడిషన్ కాల్ లో పేర్కొన్నారు. అందరికి తెలిసి, అద్భుతమైన యాక్టింగ్ నైపుణ్యం ఉన్న వ్యక్తి ఈ క్యారెక్టర్ కోసం కావాలని తెలిపారు. వయస్సు 50-55 ఏళ్ళ మధ్యలో ఉండాలని ఆడిషన్ కాల్ లో మెన్షన్ చేశారు. దీనిని ఆడిషన్ ఫై ఇండియా ఇన్ స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేశారు.

అలాగే అఖండ సినిమాలో 16 నుంచి 18 ఏళ్ళ వయస్సున్న ఇండియన్ గర్ల్ అఖండ 2 సినిమాలో మంచి ప్రాధాన్యత ఉన్న పాత్ర కోసం కావాలని మరో ఆడిషన్ కాల్ కూడా ఇచ్చారు. ఇండియాలో అన్ని చోట్ల నుంచి ఈ పాత్ర కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని తెలిపారు. భాషా పరిమితి లేదని అందులో స్పష్టం చేశారు. దీనిని కూడా ఆడిషన్ ఫై ఇన్ స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేశారు. వీటిని చూసిన తర్వాత అఖండ 2 సినిమా కోసం బోయపాటి ఏదో పెద్ద కసరత్తే చేస్తున్నాడనే మాట వినిపిస్తోంది.

చైనీస్ ఫేస్ ఉన్న విలన్ అంటే కచ్చితంగా బియాండ్ ది బౌండరీలో అఖండ 2 కథాంశం ఉంటుంది అని నందమూరి అభిమానులు భావిస్తున్నారు. ఈ అఖండ 2 కథని పాన్ ఇండియా రేంజ్ లో బోయపాటి సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. అఖండ సినిమాతో సెన్సేషన్ హిట్ కొట్టిన బోయపాటి, బాలయ్య అఖండ 2తో ఎలాంటి అద్భుతాలు చేస్తారో వేచి చూడాలి.

Tags:    
  • Chinesevillain 
  • Nandamuribalakrishna 
  • Akhanda2 
  • Boyapatisrinu 
  • Balakrishna 
  • Tollywood 
  • Akhanda2villain 

Similar News

కిరణ్ అబ్బవరం.. ఈ జనరేషన్‌తో కొత్త భయం!

2026-11-04 04:56 GMT

కిరణ్ అబ్బవరం.. నిర్మాతకు కనిపించిన మరో యాంగిల్!

2026-11-04 04:34 GMT

బుడ్డోడు ప్రజ్వల్.. మొన్న AK 47.. ఇప్పుడు సమ్మర్ హాలీడేస్

2026-11-04 04:20 GMT

తరుణ్ భాస్కర్.. హిట్ ఇచ్చిన షాక్ అలాంటిది!

2026-11-04 04:20 GMT

రెబల్ లుక్ లో హుమా ఖురేషి.. కుర్రాళ్లు ఏమైపోవాలి?

2026-11-04 04:19 GMT

షారూక్ కోసం కరణ్ జోహార్.. ఎంత ప్రేమంటే..

2026-11-04 04:02 GMT

కింగ్ 100 గ్లింప్స్‌.. నాగ్‌కు టబుతోనే అసలు పోటీ!

2026-11-04 04:01 GMT

విజయేంద్ర ప్రసాద్.. ఏం చేస్తున్నారు?

2026-11-04 01:30 GMT

ఆప‌రేష‌న్ సింధూర్‌పై పాన్ ఇండియ‌న్ సినిమా.. యువ‌హీరో జాక్‌పాట్!

2026-11-04 00:30 GMT

డిసెంబర్‌లో తెలుగు సినిమాలకు హాలీవుడ్ టెన్షన్!

2026-11-03 23:30 GMT

హాలీవుడ్‌లో ఆర్నాల్డ్- కోలీవుడ్‌లో మ్యాడీ ఇద్ద‌రిదీ ఒకటే బాట‌!

2026-11-03 22:30 GMT

పాన్ ఇండియా సినిమాలకు.. ప్రస్తుత కాలం పనికిరాదా?

2026-11-03 19:30 GMT

Copyright @2026

Powered by Blink CMS