• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సూపర్‌ స్టార్‌ మూవీ...

సూపర్‌ స్టార్‌ మూవీ చేతులు మారింది..!

| ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన తుది చర్చలు పూర్తి అయ్యాయి, ఒప్పందాలపై కూడా సంతకాలు చేయడం జరిగిందట.

By - Tupaki Desk
Update: 2024-09-25 22:30 GMT

తమిళ్‌ సూపర్‌ స్టార్‌ విజయ్‌ తో ఆర్‌జే బాలాజీ చేయాలనుకున్న ఒక కథ ప్రస్తుతం సూర్య వద్దకు వెళ్లింది. విజయ్ ను దృష్టిలో పెట్టుకుని రాసిన ఆ కథ లో చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసి సినిమాను తమిళ్ స్టార్‌ హీరో సూర్య తో చేసేందుకు దర్శకుడు బాలాజీ రెడీ అవుతున్నాడు. గతంలో నయనతార తో బాలాజీ రూపొందించిన 'అమ్మోరు తల్లి' సినిమా కు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. అందుకే సూర్య తో సినిమా చేసే అవకాశం ను బాలాజీ దక్కించుకున్నాడు అనే టాక్ వినిపిస్తోంది. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన తుది చర్చలు పూర్తి అయ్యాయి, ఒప్పందాలపై కూడా సంతకాలు చేయడం జరిగిందట.


బాలాజీ వంటి కొత్త దర్శకుడు, చిన్న దర్శకుడితో సూర్య సినిమాను చేయబోతుండటం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలతో పోల్చితే ఈ సినిమా కి పెద్దగా హైప్ లేదు. కానీ విడుదల సమయంలో కచ్చితంగా ఈ సినిమా భారీ ఎత్తున అంచనాలను మోసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కంగువా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సూర్య ఆ సినిమా హిట్‌ అయితే పాన్‌ ఇండియా స్థాయిలో స్టార్‌ హీరోగా మరింత స్థాయికి చేరే అవకాశాలు ఉన్నాయి. అయినా బాలాజీ వంటి చిన్న దర్శకుడితో సూర్య సినిమాను చేసేందుకు కమిట్‌ అవ్వడం గొప్ప విషయం అనే అభిప్రాయంను తమిళ మీడియా వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.

సూర్య కంగువా తర్వాత చేయబోతున్న సినిమాకు కార్తీక్‌ సుబ్బరాజ్ దర్శకత్వం వహించబోతున్నాడు. ఆ తర్వాత వెట్రిమారన్‌ దర్శకత్వంలోనూ సినిమాను చేసే అవకాశాలు ఉన్నాయి. కనుక బాలాజీ దర్శకత్వంలో చేయబోతున్న సినిమా షూటింగ్‌ ప్రారంభం అవ్వడానికి ఇంకా చాలా సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. ఆ మధ్య వెట్రిమారన్‌ తో సూర్య చేయబోతున్న సినిమా క్యాన్సిల్‌ అయిందనే వార్తలు వచ్చాయి. కానీ చిత్ర యూనిట్‌ సభ్యులు వెట్రిమారన్‌ ప్రస్తుతం విడుదల పార్ట్‌ 2 తో బిజీగా ఉన్నారు. కనుక వాడివాసిల్ సినిమాకు కాస్త సమయం పట్టే అవకాశాలు ఉన్నట్లు చెప్పుకొచ్చారు.

బాలాజీ దర్శకత్వంలో సూర్య చేయబోతున్న సినిమాకు ఆస్కార్‌ అవార్డ్‌ గ్రహీత ఏఆర్‌ రెహమాన్ సంగీతాన్ని అందించబోతున్నట్లుగా తెలుస్తోంది. మీడియం రేంజ్ బడ్జెట్‌ తో కాకుండా భారీ బడ్జెట్‌ తో ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ వారు నిర్మించబోతున్నారు. సూర్య కెరీర్‌ లో ఈ సినిమా 45వ సినిమాగా రూపొందబోతుంది. త్వరలో హీరోయిన్స్ గా ఈ సినిమాలో ఎవరు నటించబోతున్నారు అనే విషయమై క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. విజయ్ వంటి సూపర్‌ స్టార్‌ తో అనుకున్న ఈ సినిమా ఆయన బిజీగా ఉండటంతో పాటు, రాజకీయాల్లో అడుగు పెట్టబోతున్న నేపథ్యంలో సూర్య వద్దకు వచ్చింది. మరి ఫలితం ఎలా ఉంటుందో చూడాలంటే కొన్నాళ్లు వెయిట్‌ చేయాల్సిందే.

Tags:    
  • Kollywood 
  • Tollywood 
  • Filmindustry 
  • Vijaythalapthy 
  • RjBalaji 
  • Suriya 
  • AmmoruThalli 
  • Nayanthara 
  • KarthikSubbaraj 
  • Vetrimaaran 

Similar News

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

స్టార్ హీరో బిగ్ మిస్టేక్.. అందుకే ర‌చ‌యిత‌లు అల‌క‌బూనారా?

2026-11-06 03:57 GMT

సౌత్ సినిమాలో చ‌రిత్ర సృష్టించిన‌ టాప్ -4 సౌండ్ ఇంజినీర్లు

2026-11-06 03:56 GMT

'రాప్తాడు ఘటన'కు సినిమాలను నిందించడం సరికాదు!

2026-11-06 03:55 GMT

నేను అంత అందంగా లేను.. ఈ స్వ‌చ్ఛ‌తే సీత పాత్ర‌కు ఔచిత్యం!

2026-11-06 03:53 GMT

మేనల్లుడి ఎంగేజ్‌మెంట్‌కు పవన్ ఎందుకు రాలేదు?

2026-11-06 03:49 GMT

Bigg Boss Telugu 10: టాప్ వోటింగుతో దూసుకుపోతున్న ముఖేష్!

2026-11-06 03:47 GMT

Vijay Sethupathi: ఎంత గొప్పవారు మీరు..!

2026-11-06 01:49 GMT

బెబో స్పూర్తితో సైజ్ జీరోకి మారిన 'అర్జున్ రెడ్డి' బ్యూటీ

2026-11-06 01:46 GMT

తమిళ సినిమాలకు తెలుగులో తగ్గుతున్న క్రేజ్..!

2026-11-06 01:45 GMT

భార్య 10PM అల‌వాటుకు అగ్ర హీరోలో కంగారు!

2026-11-06 01:44 GMT

మరి ఇంతలా అవసరమా విజయ్, త్రిష..!

2026-11-06 01:43 GMT

Copyright @2026

Powered by Blink CMS