ఎట్ట‌కేల‌కు ఎల్ల‌మ్మ అప్డేట్ వ‌చ్చేసింది

సంక్రాంతి సంద‌ర్భంగా త‌న రెండో సినిమాకు సంబంధించిన గ్లింప్స్ ను జ‌న‌వ‌రి 15వ తేదీ సాయంత్రం 4.05 గంట‌ల‌కు రిలీజ్ చేయ‌నున్న‌ట్టు చెప్పారు.;

Update: 2026-01-13 13:49 GMT

జ‌బ‌ర్ద‌స్త్ కామెడీ షో ద్వారా ఎంతో మంచి పేరు తెచ్చుకున్న వేణు ఎల్దండి, ఆ త‌ర్వాత ప‌లు సినిమాల్లో క‌మెడియ‌న్ గా న‌టించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఓ వైపు క‌మెడియ‌న్ గా సినిమాలు చేస్తూనే చాలా సైలెంట్ గా డైరెక్ట‌ర్ గా మారి బ‌ల‌గం అనే సినిమాను తెర‌కెక్కించిన వేణు ఆ సినిమా రిలీజ‌య్యాక చాలా పాపుల‌ర్ అయ్యారు. ఒక్క మాట‌లో చెప్పాలంటే బ‌ల‌గం వేణు కెరీర్ కు ట‌ర్నింగ్ పాయింట్ లాంటిది.

బ‌ల‌గంతో సూప‌ర్ హిట్ అందుకున్న వేణు

సినిమాలో కంటెంట్ బావుండి, రిలీజ్ కు ఇబ్బంది ప‌డే చిన్న సినిమాల‌ను రిలీజ్ చేయ‌డ‌మే కాకుండా ఆ రిలీజ్ ను దగ్గ‌రుండి పుష్ చేసే దిల్ రాజు బ‌ల‌గం సినిమాను ఆడియ‌న్స్ లోకి తీసుకెళ్లి దాన్ని బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిపారు. ఆడియ‌న్స్ ప‌ల్స్ తెలిసిన వేణు లో మ్యాట‌ర్ ఉంద‌ని గ‌మ‌నించిన దిల్ రాజు, త‌న బ్యాన‌ర్ లోనే వేణు రెండో సినిమాను తీసేలా అగ్రిమెంట్ చేసుకున్నారు.

ఎంతోమంది వ‌ద్ద‌కు వెళ్లిన క‌థ‌

అగ్రిమెంట్ జ‌రిగి చాలా కాల‌మ‌వుతున్న‌ప్ప‌టికీ వేణు డైరెక్ట‌ర్ గా రెండో సినిమా ఇప్ప‌టి వ‌ర‌కు మొద‌లవలేదు. మొద‌ట్లో నాని వ‌ద్ద‌కు వెళ్లిన ఈ క‌థ‌, త‌ర్వాత శ‌ర్వానంద్, నితిన్ వ‌ద్ద‌కు వెళ్లింది. నితిన్ తో ఆల్మోస్ట్ సినిమా ఓకే అని అనుకున్న త‌ర్వాత ఇప్పుడ‌త‌న్ని కూడా కాద‌ని మ్యూజిక్ డైరెక్ట‌ర్ దేవీ శ్రీ ప్ర‌సాద్ తో ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తున్న‌ట్టు తెలుస్తోంది.

సంక్రాంతి రోజున గ్లింప్స్

అయితే తాజాగా ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ను అందించారు డైరెక్ట‌ర్ వేణు. సంక్రాంతి సంద‌ర్భంగా త‌న రెండో సినిమాకు సంబంధించిన గ్లింప్స్ ను జ‌న‌వ‌రి 15వ తేదీ సాయంత్రం 4.05 గంట‌ల‌కు రిలీజ్ చేయ‌నున్న‌ట్టు చెప్పారు. త‌న రెండో సినిమా ఎస్వీసీ బ్యాన‌ర్ లో దిల్ రాజు నిర్మాణంలోనే ఉంటుంద‌ని కూడా వేణు ఈ సంద‌ర్భంగా క్లారిటీ ఇచ్చారు. ఏదేమైనా బ‌ల‌గం రిలీజైన చాలా కాలానికి వేణు రెండో సినిమా గురించి అప్డేట్ వ‌స్తుంద‌ని తెలిసి అంద‌రూ హ‌మ్మ‌య్యా అంటూ ఊపిరి పీల్చుకుంటున్నారు. మ‌రి ఈ సినిమాకు దేవీ శ్రీ ప్ర‌సాద్ కేవ‌లం హీరోగానే వ్య‌వ‌హ‌రిస్తారా లేదా మ్యూజిక్ డైరెక్ట‌ర్ గా కూడా బాధ్య‌త‌లు తీసుకుంటారా అనేది తెలియాల్సి ఉంది.


Tags:    

Similar News