వివాదాస్పద సినిమాకు సెన్సార్ క్లియర్‌, డేట్‌ ఫిక్స్‌!

అంజలి శివ రామన్‌ ప్రధాన పాత్రలో నటించిన 'బ్యాడ్‌ గర్ల్‌' సినిమా విడుదలకు సిద్ధం అయింది. వెట్రి మారన్‌ నిర్మాణ భాగస్వామిగా ఉండటంతో సినిమాపై ముందు నుంచి ఒక స్థాయి వరకు అంచనాలు ఉన్నాయి.;

Update: 2025-07-09 10:24 GMT

అంజలి శివ రామన్‌ ప్రధాన పాత్రలో నటించిన 'బ్యాడ్‌ గర్ల్‌' సినిమా విడుదలకు సిద్ధం అయింది. వెట్రి మారన్‌ నిర్మాణ భాగస్వామిగా ఉండటంతో సినిమాపై ముందు నుంచి ఒక స్థాయి వరకు అంచనాలు ఉన్నాయి. వెట్రిమారన్‌ హ్యాండ్‌ ఉంది కనుక మ్యాటర్‌ ఉండి ఉంటుంది అని చాలా మంది అనుకున్నారు. అయితే కొందరు ప్రేక్షకులు మాత్రం దర్శకుడు పెద్దగా తెలిసిన వాడు కాదు, పైగా లేడీ ఓరియంటెడ్ మూవీ, అంజలి శివ రామన్‌ కూడా పెద్దగా నోటెడ్‌ హీరోయిన్‌ కాదు, కనుక బ్యాడ్‌ గర్ల్‌ సినిమా గురించి పెద్దగా పట్టించుకోలేదు. సినిమాలో మ్యాటర్‌ ఉంటుందా అని చాలా మంది అనుమానం వ్యక్తం చేశారు. ఎప్పుడైతే టీజర్‌ వచ్చిందో అప్పటి నుంచి సినిమా గురించి చర్చ మొదలైంది.

పైగా ఈ సినిమాను రోటర్‌ డామ్‌ ఇంటర్నేషనల్ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో టీజర్‌ ప్రీమియర్‌ చేయడం జరిగింది. దాంతో ప్రముఖంగా ఈ సినిమా గురించి మీడియాలో కథనాలు వచ్చాయి. పైగా ఈ టీజర్‌ చూస్తే సినిమాలో బ్రహ్మణ సమాజం గురించి తప్పుగా చూపించారా అనే అనుమానం కలుగుతుంది. హీరోయిన్‌ జీవితం చుట్టూ తిరిగే కథతో ఈ సినిమాను రూపొందించడం జరిగింది. సాధారణంగానే బ్రహ్మణులపై సినిమా అంటే వివాదాలు తప్పవు. గతంలో బ్రహ్మణ సమాజంను తక్కువ చేస్తున్నారు అంటూ కొన్ని సినిమాలపై ఆందోళనలు నడిచాయి. మరోసారి బ్రహ్మణులకు ఆగ్రహం తెప్పించే విధంగా ఈ సినిమా ఉండటంతో వివాదాస్పదం అవుతోంది.

బ్యాడ్‌ గర్ల్‌ సినిమాకు మొన్నటి వరకు కొద్దిమందికే తెలుసు.. కానీ ఇప్పుడు తమిళ్‌ ప్రేక్షకుల అందరికీ ఈ సినిమా గురించి తెలిసింది, అంతే కాకుండా తెలుగు ప్రేక్షకుల్లోనూ ఈ సినిమా గురించి చర్చ మొదలైంది. అక్కడే కాకుండా ఇక్కడ కూడా సినిమాను విడుదల చేసినా ఆశ్చర్యం లేదు. అయితే సినిమాపై బ్రహ్మణ సంఘాలు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో సెన్సార్‌ కార్యక్రమాలపై ఆసక్తి నెలకొంది. సెన్సార్‌ బోర్డ్‌ ఈ సినిమాకు క్లియరెన్స్‌ ఇచ్చేనా అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. తాజాగా ఈ సినిమాకు సెన్సార్ క్లియరెన్స్‌ రావడంతో పాటు, సెప్టెంబర్‌ 5న సినిమాను విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా సమాచారం అందుతోంది.

సెన్సార్‌ బోర్డ్‌ ఈ సినిమాకు యూ/ఎ సర్టిఫికెట్‌ను జారీ చేయడం జరిగింది. శివ కార్తికేయన్‌ నటిస్తున్న మదరాసి సినిమా అదే రోజు అంటే సెప్టెంబర్‌ 5న విడుదల కాబోతుంది. మురుగదాస్ దర్శకత్వంలో రూపొందిన ఆ సినిమాపై పెద్దగా అంచనాలు లేవు. దాంతో మదరాసి సినిమా విడుదల రోజే బ్యాడ్‌ గర్ల్‌ సినిమాను విడుదల చేసే విధంగా ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకటి రెండు వారాల్లో అన్ని విషయాల గురించి క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరో వైపు బ్రహ్మణ సంఘాలు చేస్తున్న ఆందోళనల కారణంగా సినిమాకు రోజు రోజుకు పబ్లిసిటీ పెరుగుతూనే ఉంది. సోషల్‌ మీడియాలోనూ సినిమా గురించి పాజిటివ్‌గా లేదా నెగిటివ్‌గా చర్చ జరుగుతోంది. దాంతో బ్యాడ్‌ గర్ల్‌ సినిమాకు ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది.

Full View
Tags:    

Similar News