పాపం రా ఫ్యాన్స్.. కొట్టొద్దురా: ప్రభాస్
దర్శకధీరుడు రాజమౌళి, రెబల్ స్టార్ ప్రభాస్, టాలీవుడ్ హల్క్ రానా కాంబినేషన్ లో రూపొందిన బాహుబలి సిరీస్ చిత్రాలు.. ఇప్పుడు ఒకే పార్టుగా రీ రిలీజ్ కానున్న విషయం తెలిసిందే.;
దర్శకధీరుడు రాజమౌళి, రెబల్ స్టార్ ప్రభాస్, టాలీవుడ్ హల్క్ రానా కాంబినేషన్ లో రూపొందిన బాహుబలి సిరీస్ చిత్రాలు.. ఇప్పుడు ఒకే పార్టుగా రీ రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. బాహుబలి ది ఎపిక్ టైటిల్ తో అక్టోబర్ 31వ తేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ ను నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా రాజమౌళి, ప్రభాస్, జక్కన్న చిట్ చాట్ వీడియోను తాజాగా షేర్ చేయగా.. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అందులో ఇంట్రెస్టింగ్ విషయాలు ముగ్గురూ కూడా పంచుకున్నారు. ముందుకు రానా తనకు సినిమాకు సంబంధించి రెండు సంఘటనలు క్లియర్ గా గుర్తున్నాయని తెలిపారు. "స్టోరీని మ్యాప్ లా డ్రా చేసి చెప్పారు. అప్పుడే అది నా కింగ్ డమ్ అని ఫిక్స్ అయిపోయా. ఆ రోజుతో నా బ్రెయిన్ వాష్. నా రాజ్యం అని ఫిక్స్ అయ్యా. కిరీటంపై చేయి పట్టి మాట్లాడుతున్న సీన్ షూట్ చేసినప్పుడు.. అది సర్ ముగింపు అని చెప్పా. అది ఎమోషనల్ మూమెంట్" అని తెలిపారు.
అప్పుడు ప్రభాస్ రెస్పాండ్ అవుతూ మొదటి మూడు రోజులు చాలా టెన్షన్ పడ్డానని తెలిపారు. "ఎందుకంటే పార్ట్ -2 కోర్టు రూమ్ తో షూట్ స్టార్ట్ చేశారు. ఓవైపు డ్రెస్.. ఎయిర్ రింగ్స్ తో టెన్షన్. లెఫ్ట్ అంటున్నారు.. రైట్ అంటున్నారు.. ఏ సినిమాకు అయినా మొదటి రెండు రోజులు టైమ్ పడుతుంది. మూడో రోజు హెడ్ కట్ చేసే సీన్ షూట్ చేశారు. వెంటనే డార్లింగ్.. క్యారెక్టర్ లోకి ఎంట్రీ ఇచ్చా అని చెప్పా. కోర్టు రూమ్ లోకి నేను, దేవసేన ఎంట్రీ ఇచ్చిన ఫస్ట్ సీన్ తీశారు" అని డార్లింగ్ చెప్పారు.
ఆ తర్వాత నాదే కింగ్ డమ్ అనేలోపు.. సినిమాలో భాగంగా తనను బయటకు పంపేశారని ప్రభాస్ నవ్వుతూ అన్నారు. ఆ తర్వాత రాజ్యం బహిష్కరణ.. మళ్ళీ మూడేళ్ల తర్వాత అక్కడ షూట్ చేశారు జక్కన్న అని తెలిపారు. అయితే ఫస్ట్ సీన్ కోర్టు సీన్ అని, కానీ ముందు కర్నూలులో షూట్ చేసిన విషయాన్ని గుర్తుచేశారు జక్కన్న. కానీ అక్కడ చిత్రీకరించిన వాటిలో ఒక్క సీన్ కూడా యూజ్ చేయలేదని చెప్పారు. అన్నీ ఎడిటింగ్ లో డిలీట్ చేశామని పేర్కొన్నారు.
అదే సమయంలో కర్నూలులో షూటింగ్ జరిగిన టైమ్ లోని ఫన్నీ ఇన్సిడెంట్ ను షేర్ చేసుకున్నారు ప్రభాస్. "జనాలు వచ్చేస్తున్నారు.. అయినా జక్కన్న సీన్ కావాలంటారు. ఫుల్ రెయిన్ పడుతుంది. మొత్తం బురద. నిల్చోబెట్టి హాయ్ చెప్పించారు. చివర్లో అక్కడి నుంచి గుర్రాలపై కిందకు వచ్చాం. కార్ల దగ్గరకు వచ్చాక చాలా జనాలు ఉన్నారు. అప్పుడు రాజమౌళి ఒకరి కారు ఆపి.. మేం వస్తామని చెప్పారు. ఆ తర్వాత అంతా ఆ కారులో వచ్చాం" అని తెలిపారు.
అయితే "కారు ఎక్కాక ముగ్గురు ఉన్నాం. పోలీస్ ఇన్స్పెక్టర్ పాటు కార్తికేయ.. లాఠీలతో ప్రజలను క్లియర్ చేస్తున్నారు. ప్రభాస్ ఏమో కొట్టద్దురా.. కొట్టద్దురా.. పాపం రా ఫ్యాన్స్ అని అన్నాడు. రానా చేయి పట్టుకుని చెప్పాడు. ఏదేమైనా మేకింగ్ వీడియో కోసం అక్కడ షూట్ చేశాం. అయితే అక్కడ షూట్ చేసిన ఒక్క సీన్ సినిమాలో ఉండేది. ఎడిటింగ్ లో ఉన్న జంప్ షాట్ ను కూడా ఫైనల్ కట్ లో తీశాం" అని రాజమౌళి తెలిపారు.