మరో రికార్డ్‌కి 'బాహుబలి' రెడీ...!

తెలుగు సినిమా స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకు వెళ్లిన బాహుబలి వచ్చి పదేళ్లు అవుతున్నా ఇప్పటికీ మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం.;

Update: 2025-12-24 05:42 GMT

తెలుగు సినిమా స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకు వెళ్లిన బాహుబలి వచ్చి పదేళ్లు అవుతున్నా ఇప్పటికీ మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి రెండు పార్ట్‌లు సంచలన విజయాలను నమోదు చేసిన విషయం తెల్సిందే. ముఖ్యంగా బాహుబలి 2 సినిమా ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఇప్పటికీ ఆ సినిమా రికార్డ్‌లను మరే సినిమా బ్రేక్ చేయలేక పోతుంది. చాలా రికార్డ్‌లు పదిలంగా ఉన్నాయి. బాహుబలి కి ఉన్న క్రేజ్ ను రాజమౌళి అండ్‌ టీం ఎప్పటికప్పుడు ఉపయోగించుకుంటూనే ఉన్నారు. బాహుబలి పేరుతో ఎన్నో బ్రాండ్ ను జనాల్లోకి తీసుకు వచ్చారు. తాజాగా మరోసారి బాహుబలినే స్వయంగా జక్కన్న రంగంలోకి దించిన విషయం తెల్సిందే. బాహుబలి రెండు పార్ట్‌లను కలిపి ఒకే పార్ట్‌ బాహుబలి ది ఎపిక్‌ గా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చిన విషయం తెల్సిందే. ఇందుకోసం చాలా కృషి చేసిన జక్కన్న మంచి ఫలితాన్ని సొంతం చేసుకున్నాడు.

బాహుబలి : ది ఎపిక్ రీ రిలీజ్‌...

బాహుబలి : ది ఎపిక్ మూవీ థియేట్రికల్‌ రిలీజ్‌ లో భారీ వసూళ్లు రాబట్టింది. ఇప్పటి వరకు ఏ ఇండియన్‌ సినిమా రీ రిలీజ్‌ లో సాధించని వసూళ్లను ఈ సినిమా సాధించింది అంటూ వార్తలు వస్తున్నాయి. సినిమాను చాలా క్రియేటివ్‌గా ఎడిట్‌ చేసి, అవసరం లేని సీన్స్, పాటలను తొలగించి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. ప్రభాస్ ఫ్యాన్స్ కి మరోసారి బ్యూటీఫుల్‌ ట్రీట్‌ ఇచ్చిన రాజమౌళి ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. బాహుబలి ది ఎపిక్‌ ను ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ ద్వారా స్ట్రీమింగ్‌ మొదలు పెట్టారు. సాధారణంగానే బాహుబలికి ఉన్న క్రేజ్ నేపథ్యంలో మంచి స్పందన వస్తుంది. అలాంటిది ది ఎపిక్ అంటూ రెండు పార్ట్‌లను కలపడం వల్ల సినిమా స్థాయి మరింత పెరిగింది. క్రేజ్‌ మరింతగా పెరగడం వల్ల సినిమా ను చూసేందుకు ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సినిమా ను ఓటీటీలో మరోసారి చూసేందుకు ప్రేక్షకులు రెడీ అవుతున్నారు.

ప్రభాస్‌ హీరోగా అనుష్క హీరోయిన్‌గా...

అక్టోబర్‌ 31న థియేట్రికల్‌ రిలీజ్ అయిన బాహుబలి : ది ఎపిక్‌ ను నాలుగు వారాల్లో ఓటీటీ స్ట్రీమింగ్‌ చేస్తారని అంతా భావించారు. కానీ ఓటీటీ స్ట్రీమింగ్‌ కు ఆలస్యం అయింది. దాంతో ప్రేక్షకులు ముఖ్యంగా బాహుబలిని అమితంగా ఇష్టపడే వారు, ప్రభాస్ ఫ్యాన్స్‌, రాజమౌళి ఫ్యాన్స్‌, అనుష్క ఫ్యాన్స్ ఇలా అన్ని వర్గాల వారు ఓటీటీ స్ట్రీమింగ్‌ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఫైనల్‌గా సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ మొదలు కావడంతో అభిమానులు పెద్ద ఎత్తున స్ట్రీమింగ్ చేయడం మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. సాధారనంగా ఇలాంటి పాత సినిమాలు, రీ రిలీజ్ సినిమాలో ఓటీటీ లో ట్రెండ్‌ కావడం మనం అరుదుగా చూస్తూ ఉంటాం. కానీ ఈ సినిమాకు ఉన్న క్రేజ్‌, బజ్‌ నేపథ్యంలో తప్పకుండా వీకెండ్‌ వరకు ట్రెండ్‌లో నిలిచే అవకాశాలు ఉన్నాయి. ఇండియన్‌ కంటెంట్‌ లో, నాన్‌ ఇంగ్లీష్ కంటెంట్‌లో ఈ సినిమా నెం.1 గా నిలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి...

ప్రభాస్ ను పాన్ ఇండియా స్టార్‌గా చేసిన బాహుబలి సినిమాను ప్రేక్షకులు ఎన్ని సార్లు అయినా చూసేందుకు రెడీ అన్నట్టుగా ఉంటారు. ముఖ్యంగా సెకండ్‌ పార్ట్‌లో వచ్చే ఎమోషనల్‌ సీన్స్‌కి ప్రేక్షకులు ఎప్పుడూ ఫిదా అవుతూనే ఉంటారు. ఇప్పుడు రెండు పార్ట్‌లను ఒకే సారి చూసే అవకాశం రావడం అది కూడా 3 గంటల 48 నిమిషాల నిడివితో రావడంతో అంతా కూడా హ్యాపీ ఫీల్‌ అవుతున్నారు. ఇప్పటికే థియేటర్‌లో బాహుబలి ది ఎపిక్ ను చూసిన వారు కూడా ఓటీటీలో స్ట్రీమింగ్‌ చేయడం కోసం ఎదురు చూస్తున్నారు. అర్థరాత్రి నుంచి స్ట్రీమింగ్‌ ప్రారంభం కావడంతో చాలా మంది ఈ క్రిస్మస్ కి బాహుబలి తో టైం పాస్ అంటూ చర్చించుకుంటున్నారు. బాహుబలి రెండు పార్ట్‌లను విడి విడిగా చాలా సార్లు చూసిన వారు సైతం ఎపిక్‌ ను మళ్లీ మళ్లీ చూడాలి అనిపించే విధంగా జక్కన్న ఎడిట్‌ చేయడం జరిగింది. అంత టైం ఉన్నా ఎక్కడా బోర్‌ అనిపించదు. అందుకే బాహుబలి ది ఎపిక్‌ ఓటీటీలో మంచి విజయాన్ని సొంతం చేసుకోబోతుంది.

Tags:    

Similar News