రోలెక్స్ దారిలో కట్టప్ప?
అలాంటి పాత్రతో ఇప్పుడు రైటర్ విజయేంద్రప్రసాద్, డైరెక్టర్ రాజమౌళి ఓ సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నారట.;
ఎలాంటి డైరెక్టర్ కు అయినా ప్రతీ సారీ కొత్త కథలు తీసుకురావాలంటే కష్టమే. అందుకే కథ ఎలా ఉన్నా దాన్ని ఆడియన్స్ కు కనెక్ట్ చేసే విధానం బావుండాలని అంటారు. అయితే ప్రతీసారీ కొత్త కథలు తీసుకురావడం కష్టమైన నేపథ్యంలో కొందరు డైరెక్టర్లు తాము ఆల్రెడీ చెప్పిన కథలోని ఓ పాత్రను తీసుకుని ఆ పాత్ర పై ఓ ప్రత్యేక సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
రోలెక్స్ క్యారెక్టర్ పై స్పెషల్ మూవీ
ఇప్పటికే లోకేష్ కనగరాజ్ కమల్ హాసన్ తో చేసిన విక్రమ్ సినిమాలోని రోలెక్స్ పాత్రపై ఓ స్పెషల్ మూవీని తీయనున్నట్టు అనౌన్స్ చేయగా, ఇప్పుడదే దారిలో మరో సినిమా రాబోతున్నట్టు తెలుస్తోంది. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి ఫ్రాంచైజ్ సినిమాలు దేశం మొత్తంలో ఎంత పాపులరయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
తెలుగు సినిమా స్థాయిని పెంచిన బాహుబలి
ఇంకా చెప్పాలంటే తెలుగు సినిమా స్థాయి విపరీతంగా పెరగడానికి మెయిన్ రీజన్ బాహుబలి. ఆ సినిమాలో రాజమౌళి మరియు అతని తండ్రి క్రియేట్ చేసిన మాహిష్మతి సామ్రాజ్యం ఎలాంటి రికార్డులు క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పే పన్లేదు. ఈ సినిమా తర్వాత టాలీవుడ్ ను బాహుబలికి ముందు, బాహుబలి తర్వాత అనేలా ఈ మూవీ ఇంపాక్ట్ చూపించింది.
బాహుబలి2పై ఆసక్తిని పెంచిన కట్టప్ప పాత్ర
బాహుబలి మూవీలో ప్రభాస్, రానా, అనుష్క, రమ్యకృష్ణ పాత్రలతో పాటూ సమాన ఆదరణ లభించిన పాత్ర కట్టప్పది. ఇంకా చెప్పాలంటే బాహుబలి సెకండ్ పార్ట్ పై క్యూరియాసిటీ పెంచడంలో కీలక పాత్ర వహించింది ఆ పాత్రే. అలాంటి పాత్రతో ఇప్పుడు రైటర్ విజయేంద్రప్రసాద్, డైరెక్టర్ రాజమౌళి ఓ సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నారట. మాహిష్మతి కింగ్‌డమ్ లో కట్టప్ప ఎందుకలా నమ్మిన బంటుగా ఉండాల్సి వచ్చింది? అసలు అతను ఎవరు? అతని ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? అనే వాటి నేపథ్యంలో సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. మరి ఈ సినిమాకు రాజమౌళినే దర్శకత్వం వహిస్తారో లేక మరెవరికైనా ఆ బాధ్యతలు అప్పగిస్తారో చూడాలి. ఏదేమైనా ఈ వార్త నిజమైతే మాత్రం ఈ మూవీపై అనౌన్స్‌మెంట్ తోనే భారీ హైప్ రావడం ఖాయం.