బాహుబలి యానిమేషన్ ప్రాజెక్టుపై కాపీ ఆరోపణలు.. రియాక్ట్ అయిన డైరెక్టర్
టీజర్ లోని విజువల్స్, స్టైలిష్ యాక్షన్ అన్నీ ఆడియన్స్ ను ఆకట్టుకున్నాయి. కానీ అందులోని ఓ యాక్షన్ సీన్ ఆడియన్స్ ను స్టన్ అయ్యేలా చేసింది.;
సోషల్ మీడియా విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ఏ విషయమైనా సరే క్షణాల్లో నెట్టింట వైరల్ అయిపోతుంది. ఏదైనా టీజర్ లేదా ట్రైలర్ రిలీజవడం ఆలస్యం, వెంటనే దాన్ని పలు ట్రైలర్లు, టీజర్లతో కంపేర్ చేసి కాపీ అనడమో, ట్రోల్ చేయడమో ఇంకా కాదంటే వారికి నచ్చింది ఏదొకటి కామెంట్స్ చేయడమో చేస్తుంటారు నెటిజన్లు. ఇప్పడు బాహుబలి సినిమా కూడా అలానే వివాదంలో చిక్కుకుంది.
బాహుబలి: ది ఎటర్నల్ వార్ పేరుతో ఓ యానిమేషన్ ప్రాజెక్టు ప్రస్తుతం తెరకెక్కుతుండగా రీసెంట్ గా దానికి సంబంధించిన టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. అయితే ఈ ప్రాజెక్టును పూర్తి స్థాయి హాలీవుడ్ స్టైల్ లో యానిమేషన్ లో రూపొందిస్తుండగా, దానికి ఇషాన్ శుక్లా దర్శకత్వం వహిస్తున్నారు. రీసెంట్ గా రిలీజైన టీజర్ కు కూడా ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్సే వచ్చింది.
కుంగ్ ఫు పాండాను కాపీ చేశారని కామెంట్స్
టీజర్ లోని విజువల్స్, స్టైలిష్ యాక్షన్ అన్నీ ఆడియన్స్ ను ఆకట్టుకున్నాయి. కానీ అందులోని ఓ యాక్షన్ సీన్ ఆడియన్స్ ను స్టన్ అయ్యేలా చేసింది. టీజర్ లో ఓ మిడ్ ఎయిర్ యాక్షన్ సీన్, కుంగ్ ఫు పాండాను గుర్తు చేసిందని, దాన్ని కాపీ చేశారని అందరూ కామెంట్స్ చేయడం మొదలుపెట్టడంతో, ట్రోలింగ్ ఎక్కువైపోయింది. దీంతో ఆఖరికి ఈ విషయంపై ఇషాన్ రెస్పాండ్ అయి క్లారిటీ ఇచ్చారు.
తానసలు కుంగ్ ఫు పాండా సినిమాను చూడనేలేదని, దాన్ని చూసి తన టీం ఏమీ కాపీ చేయలేదని, రెండు సీన్స్ గాల్లో ఉండే యాక్షన్ సీన్స్ అవడం వల్ల అలాంటి పోలిక వచ్చిందని, ఆ సీన్ దేని నుంచీ ఇన్‌స్పైర్ అయి తీసింది కాదని, మనం కావాలని చూస్తే అన్నీ ఒకేలా కనిపిస్తాయని చెప్పారు. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు అటు నిర్మాణ సంస్థ నుంచి కానీ ఇటు రాజమౌళి నుంచి కానీ ఎలాంటి రెస్పాన్స్ లేదు. మరి ఆఖరికి ఈ ట్రోలింగ్ కు ఎలా ఎండ్ కార్డ్ పడుతుందో చూడాలి.