'అవ‌తార్-3' క‌లెక్ష‌న్ల టార్గెట్ ఎంతంటే?

ఊపిరి తీసుకోనివ్వ‌ని ప్ర‌కృతి అందాల‌కు నెల‌వు - పండోరా. వింత‌లు విశేషాలు విడ్డూరాల‌తో క‌ట్టిప‌డేసే ఒక అద్భుత ప్ర‌పంచం అది.;

Update: 2025-08-01 06:46 GMT

ఊపిరి తీసుకోనివ్వ‌ని ప్ర‌కృతి అందాల‌కు నెల‌వు - పండోరా. వింత‌లు విశేషాలు విడ్డూరాల‌తో క‌ట్టిప‌డేసే ఒక అద్భుత ప్ర‌పంచం అది. అవ‌తార్ లు నివ‌శించే చోటు ఇది. అలాంటి ఒక నిశ్శ‌బ్ధ‌ గ్ర‌హాన్ని ధ్వంశం చేసేందుకు వెళ్లే విష‌పూరిత‌మైన‌ మాన‌వాళి. ప్ర‌పంచానికి దూరంగా నివ‌శించే ప్ర‌కృతి జీవుల‌ను, వృక్ష‌జాతిని, అవ‌తార్ ల సంత‌తిని నాశ‌నం చేసి, ఖ‌రీదైన‌ యురేనియం గ‌నుల్ని త‌వ్వుకోవాల‌ని ఆశ‌ప‌డే మాన‌వాళికి అది సాధ్య‌మైందా లేదా? అన్న‌దే అవ‌తార్ సినిమా. జేమ్స్ కామెరూన్ తెర‌కెక్కించిన అవ‌తార్ 1, అవ‌తార్ 2 సంచ‌ల‌న విజ‌యాల్ని సాధించాయి. ప్ర‌పంచ‌వ్యాప్తంగా సుమారు 5 బిలియ‌న్ డాల‌ర్ల‌ను ఈ రెండు సినిమాలు కొల్ల‌గొట్టాయి. ఇప్పుడు ఈ ఫ్రాంఛైజీ నుంచి అవ‌తార్- 3 (ఫైర్ అండ్ యాష్)రిలీజ్ కి వ‌స్తోంది అన‌గానే స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంది. అవ‌తార్ ఫ్రాంఛైజీ అభిమానుల‌కు ఇది ఒక క‌ల లాంటిది.

ట్రేడ్ లో స‌ర్వ‌త్రా ఉత్కంఠ‌:

అవ‌తార్ ఫ్రాంఛైజీలో మూడో భాగం (ఫైర్ అండ్ యాష్) మొద‌టి రెండు భాగాల కంటే సుదీర్ఘ నిడివితో ఉంటుంద‌ని కామెరూన్ ప్ర‌క‌టించారు. మొద‌టి రెండు భాగాల కంటే ఎగ్జ‌యిట్ చేసే చాలా అంశాలు మూడో భాగంలో చూస్తారు. మునుప‌టి కంటే భారీ యాక్ష‌న్ తో ర‌క్తి క‌ట్టిస్తుందని ద‌ర్శ‌కుడు అన్నారు. దీంతో ప్ర‌జ‌ల్లో ఒక‌టే ఉత్కంఠ నెల‌కొంది. 19 డిసెంబ‌ర్ 2025 అవ‌తార్ 3 విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఇంత‌లోనే ట్రేడ్ లో గ‌ణాంకాల‌పై శ్ర‌ద్ధ పెరిగింది. ర‌క‌ర‌కా ఊహాగానాలు సాగుతున్నాయి.

ఆ రెండూ క‌లిపి 5 బిలియ‌న్ డాల‌ర్లు:

అవ‌తార్ ఫ్రాంఛైజీ చిత్రాలు భార‌త‌దేశం నుంచి 100 కోట్లు, అంత‌కుమించిన‌ వ‌సూళ్ల‌ను సాధిస్తున్నాయి. అయితే అవ‌తార్- 3 ఏ స్థాయిలో వ‌సూళ్ల‌ను సాధించ‌గ‌ల‌దు? అంటూ అభిమానులు ఎవ‌రికి వారు అంచ‌నాలు వేస్తున్నారు. `అవ‌తార్-1`(2009) క‌లెక్షన్లు - 13,500 కోట్లు (2.9 బిలియ‌న్ డాల‌ర్లు- అప్ప‌టి డాల‌ర్ విలువ‌కు ఈ వ‌సూళ్లు). 2022లో వ‌చ్చిన `అవ‌తార్ -2` లైఫ్ టైమ్ లో దాదాపు 12,500 కోట్లు (2.3 బిలియ‌న్ డాల‌ర్లు) వసూలు చేసింది. ఇప్పుడు 'అవ‌తార్ -3' క‌లెక్ష‌న్ల అంచ‌నా నేటి డాల‌ర్ విలువ‌తో 26,000 కోట్లు (సుమారు 3 బిలియ‌న్ డాల‌ర్లు- ఇప్ప‌టి డాల‌ర్ విలువ‌కు) అధిగ‌మించ‌గ‌ల‌ద‌ని కామెరూన్ బృందం భావిస్తోంద‌ట‌.

పార్ట్ 3, పార్ట్ 3 ట్రీట్ మ‌రో లెవ‌ల్‌:

ఈ ఫ్రాంఛైజీలో ఇంకా వ‌రుస చిత్రాలు తెర‌కెక్కుతున్నాయి. అవతార్-4 చిత్రం 2029 డిసెంబర్ 21న విడుల‌వుతుంది. అవతార్ 5 చిత్రం 19 డిసెంబర్ 2031న వస్తుంది. అయితే పార్ట్ 3 సుదీర్ఘ నిడివితో వ‌స్తోంద‌ని కామెరూన్ ప్ర‌క‌టించ‌గా, పార్ట్ 4, పార్ట్ 5 కూడా అంత‌కుమించి విజువ‌ల్ ట్రీట్ గా ప్లాన్ చేయాల్సి ఉంటుంది.

Tags:    

Similar News