పుష్ప ఇమేజ్ ను చెరిపేయడమే అట్లీ టార్గెట్టా?
పుష్ప రెండు భాగాల సాలిడ్ హిట్స్ తో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్టార్ డమ్ దేశవ్యాప్తంగా ఎవరూ ఊహించని స్థాయికి చేరుకుంది.
పుష్ప రెండు భాగాల సాలిడ్ హిట్స్ తో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్టార్ డమ్ దేశవ్యాప్తంగా ఎవరూ ఊహించని స్థాయికి చేరుకుంది. నార్త్ నుంచి సౌత్ వరకు థియేటర్లలోకి వెళ్లిన ప్రతి ఒక్కరి మైండ్ లో బన్నీ అనగానే వెంటనే పుష్ప రాజ్ క్యారెక్టర్ గుర్తుకొచ్చేంతలా ఆ మాస్ ఇమేజ్ బలంగా నాటుకుపోయింది. గత కొన్నేళ్లుగా ఒకే ఊర మాస్ గెటప్ లో, అదే రస్టిక్ బాడీ లాంగ్వేజ్ తో బన్నీ ఆ పాత్రలో పూర్తిగా జీవించేశాడు.
ఇప్పుడు అట్లీ దర్శకత్వంలో రాబోతున్న తన తదుపరి భారీ ప్రాజెక్ట్ రాకా విషయంలో డైరెక్టర్ కు అసలైన సవాల్ ఎదురుకాబోతోంది. సినిమా స్కేల్, బడ్జెట్ లాంటి విషయాల కంటే కూడా.. పాన్ ఇండియా ఆడియన్స్ బ్రెయిన్ లో స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిపోయిన ఆ పుష్ప రాజ్ ముద్రను పూర్తిగా చెరిపేయడమే అట్లీ ముందున్న మేజర్ టాస్క్. ఆడియన్స్ కు ఆ పాత మాస్ మ్యానరిజమ్స్ గుర్తురాకుండా చూస్తూ, బన్నీకి సరికొత్త స్క్రీన్ ఐడెంటిటీ క్రియేట్ చేయడం నిజంగా కత్తిమీద సామే.
సుకుమార్ సృష్టించిన ఎర్రచందనం స్మగ్లింగ్ ప్రపంచానికి, అట్లీ ప్రెజెంట్ చేయబోతున్న రాకా విశ్వానికి అసలు ఎలాంటి సంబంధం లేదు. ఇదొక మెగా బడ్జెట్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఫాంటసీ డ్రామా. ప్రాచీన పురాణాలకు ఫ్యూచరిస్టిక్ ఎలిమెంట్స్ ను ముడిపెడుతూ ఈ కథను సిద్ధం చేశారు. ఒక డివైన్ వారియర్ గా అల్లు అర్జున్ ఇందులో కనిపించబోతున్నాడు.
ఆ గ్లోబల్ మాస్ ఇమేజ్ ను బ్రేక్ చేయడానికి అట్లీ పక్కా ప్లానింగ్ తోనే అడుగులు వేస్తున్నాడు. ఈ డివైన్ పాత్ర కోసం అల్లు అర్జున్ శారీరకంగా భారీ మేకోవర్ అవుతున్నాడు. ప్రోస్థెటిక్ మేకప్ తో పాటు బట్టతల, నెరిసిన జుట్టు లాంటి ఎన్నో భిన్నమైన గెటప్స్ లో ప్రయోగాలు చేస్తున్నట్లు సమాచారం. పుష్ప ఛాయలు ఎక్కడా ఏమాత్రం కనిపించకుండా ముందుగా ఫిజికల్ అప్పీరెన్స్ తోనే ప్రేక్షకులకు ఒక ఫ్రెష్ ఫీలింగ్ ఇవ్వాలని చిత్ర యూనిట్ బలంగా డిసైడ్ అయింది.
సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ ఈ చిత్రాన్ని ఏమాత్రం రాజీ పడకుండా అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. బాలీవుడ్ స్టార్స్ దీపికా పదుకొనె, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్న లాంటి క్రేజీ కాస్టింగ్ ఈ ఫాంటసీ ప్రపంచంలో భాగమయ్యారు. దాదాపు తొమ్మిది భాషల్లో 2027 డిసెంబర్ టార్గెట్ గా ఈ మెగా ప్రాజెక్ట్ ను రూపొందిస్తున్నారు. విజువల్స్ పరంగా ఒక అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చేలా సెట్స్ లో పనులు జరుగుతున్నాయి.
ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేసిన పుష్ప రాజ్ మ్యానరిజమ్స్ ను ఆడియన్స్ అంత సులువుగా వదిలిపెట్టరు. స్క్రీన్ మీద బన్నీ కనిపించగానే ఆటోమేటిక్ గా ఆ రస్టిక్ యాటిట్యూడ్ ను ఎక్స్ పెక్ట్ చేస్తారు. ఆ అంచనాలను పక్కదారి పట్టించి, ఈ కొత్త కాస్మిక్ వారియర్ అవతార్ కు జనాలను కనెక్ట్ చేయగలిగితే అట్లీ వంద శాతం సక్సెస్ అయినట్లే. మరి ఈ కాంబినేషన్ ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.