• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  డార్లింగ్.. ముందు ఆ...

డార్లింగ్.. ముందు ఆ హీరోను అనుకున్నారా?

| అల్లరి నరేష్ ని డార్లింగ్ మూవీలో హీరో క్యారెక్టర్ కోసం అశ్విన్ రామ్ ట్రై చేసాడంట. అతనికి స్టోరీలైన్ నచ్చి ఒకే చెప్పిన సెకండ్ హాఫ్ లో కొన్ని మార్పులు చేయాలని సూచించారంట.

By - Tupaki Desk
Update: 2024-07-22 03:00 GMT

ప్రియదర్శి, నభా నటేష్ కాంబినేషన్ లో అశ్విన్ రామ్ దర్శకత్వంలో తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చిన డార్లింగ్ మూవీ డివైడ్ టాక్ సొంతం చేసుకుంది. సినిమాలో కథ బాగున్న నేరేషన్ మాత్రం ప్రేక్షకులకి కనెక్ట్ కాలేదనే మాట వినిపించింది. మరీ ముఖ్యంగా క్యాస్టింగ్ సెలక్షన్ రాంగ్ అనే ప్రచారం నడుస్తోంది. హీరోయిన్ క్యారెక్టర్ లో పెర్ఫార్మెన్స్ కి అద్భుతమైన స్కోప్ ఉంది. అయితే నభా నటేష్ మాత్రం ప్రేక్షకులని మెప్పించలేకపోయిందని అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

డైరెక్టర్ అశ్విన్ రామ్ ఇప్పటికే తమిళంలో రెండు సినిమాలు చేశాడు. తెలుగులో అతనికిదే మొదటి సినిమా. మూవీ ట్రైలర్, ప్రమోషనల్ కంటెంట్ తో పాజిటివ్ బజ్ క్రియేట్ చేసింది. అలాగే ఈ సినిమాకి పోటీగా పెద్ద సినిమాలేవీ కూడా లేకపోవడంతో టాక్ బాగుంటే సక్సెస్ అందుకునే ఛాన్స్ ఉందని అందరూ భావించారు. కానీ ఓవరాల్ గా అందరిని డిజప్పాయింట్ చేసిందనే మాట వినిపిస్తోంది. నిజానికి ఈ సినిమాలో లీడ్ రోల్ కోసం అశ్విన్ రామ్ ముందుగా ప్రియదర్శిని అనుకోలేదంట.

అల్లరి నరేష్ ని డార్లింగ్ మూవీలో హీరో క్యారెక్టర్ కోసం అశ్విన్ రామ్ ట్రై చేసాడంట. అతనికి స్టోరీలైన్ నచ్చి ఒకే చెప్పిన సెకండ్ హాఫ్ లో కొన్ని మార్పులు చేయాలని సూచించారంట. అయితే దానికి అశ్విన్ రామ్ ఇంటరెస్ట్ చూపించలేదంట. ఇది ఆరేళ్ళ క్రితం మాట. అప్పటికి నరేష్ వరుస ఫెయిల్యూర్స్ తో ఉన్నారు. ఈ కారణంగా మళ్ళీ రిస్క్ చేయడానికి ఇష్టపడలేదు. దీంతో అశ్విన్ రామ్ ప్రియదర్శికి కథ చెప్పి ఒకే చేయించుకున్నాడంట.

బలగం సినిమా హిట్ తర్వాత ప్రియదర్శితో సినిమాలు చేయడానికి నిర్మాతలు ముందుకొచ్చారు. దీంతో బడ్జెట్ కి ప్రాబ్లెమ్ లేకుండా పోయింది. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లడం చాలా వేగంగా మూవీ కంప్లీట్ చేయడం జరిగిపోయింది. ప్రియదర్శి ఈ మూవీ కథని చాలా వరకు పైకి లేపే ప్రయత్నం చేసినా ప్రేక్షకులు ఎక్స్ పెక్ట్ చేసే మ్యాజిక్ మిస్ అవ్వడంతో ఏమీ చేయలేకపోయారనే మాట విశ్లేషకుల నుంచి వినిపిస్తోంది.

దీంతో ఓవరాల్ గా డివైడ్ టాక్ ని డార్లింగ్ మూవీ సొంతం చేసుకుంది. వీకెండ్ తర్వాత ఈ సినిమా కలెక్షన్స్ బట్టి మూవీ రిజల్ట్ ఏంటనేది క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. డార్లింగ్ మూవీ ఫ్లాప్ అయిన ప్రియదర్శి ఇమేజ్ కి వచ్చే నష్టం ఏమీ లేదని చెప్పొచ్చు. నెక్స్ట్ నాని ప్రొడక్షన్ లో హీరోగా మరో సినిమా త్వరలో స్టార్ట్ అయిపోతుంది. అయితే హీరోయిన్ నభా నటేష్ కి మాత్రం లక్ కలిసిరాలేదనే మాట వినిపిస్తోంది.

Tags:    
  • Darlingmovie 
  • Ashwinram 
  • Nabhanatesh 
  • Priyadarshi 
  • Allarinaredh 
  • Tollywood 
  • Comedyentertainer 

Similar News

పాన్ ఇండియా సినిమాలకు.. ప్రస్తుత కాలం పనికిరాదా?

2026-11-03 19:30 GMT

ఆ అలవాటే 50 ఏళ్లలో కూడా వచ్చింది..జయసుధ కామెంట్స్ వైరల్

2026-11-03 18:30 GMT

Bigg Boss Telugu 10: ఈ వారం ఎలిమినేట్ అవ్వబోయేది వర్షిణినా?

2026-11-03 18:23 GMT

Bigg Boss Telugu 10: ముకేశ్ హీరో అవుతాడా, లేక జీరో అవుతాడా?

2026-11-03 18:23 GMT

వారణాసి: RRR కంటే 40 రోజులు తక్కువ!

2026-11-03 18:18 GMT

పాన్ ఇండియాను దాటి పాన్ వరల్డ్‌కు.. అన్ని భాషల స్టార్ట్స్ తో కలిసి రాజమౌళి సినిమా!

2026-11-03 18:16 GMT

రామాయ‌ణ (X) కింగ్: ప్రీరిలీజ్ బిజినెస్‌లో ఎవ‌రు ది బెస్ట్?

2026-11-03 18:10 GMT

న్యూజిలాండ్లో వెకేషన్ మోడ్‌లో నవదీప్‌ గ్యాంగ్ సందడి!

2026-11-03 18:09 GMT

నవంబర్.. హిట్ కొట్టినా లాంగ్ రన్ కష్టమేనా..

2026-11-03 18:09 GMT

మహేష్.. అసలు 'గేమ్' ప్లాన్ ఏంటీ?

2026-11-03 18:07 GMT

పాకెట్ రాకెట్స్ టీజర్.. డబ్బు చుట్టూ ఓ కొత్త ఆట!

2026-11-03 18:01 GMT

రాధికా ఆప్టే.. అప్పుడో మాట.. ఇప్పుడో మాట

2026-11-03 18:01 GMT

Copyright @2026

Powered by Blink CMS