వణికించే చలిలో అషు పాప గ్లామర్ హీట్

తెలుగమ్మాయి ఆషు రెడ్డి.. అదేనండీ అషు రెడ్డి.. ఈ మధ్యనే తన ఇంగ్లీష్ పేరులో ఒక లెటర్ చేర్చుకుంది ఈ బ్యూటీ

Update: 2024-05-10 06:03 GMT

తెలుగమ్మాయి ఆషు రెడ్డి.. అదేనండీ అషు రెడ్డి.. ఈ మధ్యనే తన ఇంగ్లీష్ పేరులో ఒక లెటర్ చేర్చుకుంది ఈ బ్యూటీ. టిక్ టాక్, డబ్ స్మాష్ వీడియోలతో మంచి పేరు సంపాదించుకున్న ఆషు.. జూనియర్ సమంతగా పేరు తెచ్చుకుంది. అందాలన్నీ ఆరబోస్తూ సందడి చేసింది. అలా వచ్చిన క్రేజ్ తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఛల్ మోహన రంగ సినిమాలో యాక్ట్ చేసి మెప్పించింది. ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్-3 లోకి అడుగు పెట్టింది.

షోలో ఆట తీరుతో పాటు అందాలను చూపిస్తూ కుర్రకారు మతులు పోగొట్టింది. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక రామ్ గోపాల్ వర్మతో కలిసి ఇంటర్వ్యూ చేసి తెగ వైరల్ అయింది. ఆ తర్వాత మరోసారి బిగ్ బాస్ ఓటీటీ నాన్ స్టాప్ షోకు వెళ్లింది. అప్పుడు కూడా ఓ రేంజ్ లో సందడి చేసింది. అలా అటు కెరీర్ లో బిజీగా ఉంటూనే.. మరోవైపు సోషల్ మీడియాలో కూడా యమా యాక్టివ్ గా ఉంటోంది ఆషు రెడ్డి.

ఎప్పటికప్పుడు తన గ్లామరస్ పిక్స్ ను నెట్టింట పోస్ట్ చేస్తుంటోంది. పర్సనల్ తోపాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలు అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటోంది. గ్లామర్ గేట్లు ఎత్తేసి తన అందాలతో యువతను ఆకర్షిస్తోంది. ఇటీవల అల్ట్రా మోడ్రన్ డ్రెస్ లో ఆషు రెడ్డి అందరినీ ఫిదా చేసింది. తాజాగా కొత్త పిక్స్ షేర్ చేసింది ఈ అమ్మడు. ప్రస్తుతం స్విట్జర్లాండ్ లో సమ్మర్ వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది.

అక్కడి బ్యూటిఫుల్ ప్లేసెస్ లో ఫోటో షూట్స్ చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. రీసెంట్ గా స్విస్ లో గడ్డ కట్టే చలిలో చీరకట్టులో తళుక్కుమంది. చలి ఇరగదీస్తోందంటూనే ఇంగ్లీష్ గ్రీన్ కలర్ శారీలో హోయలు ఒలకించింది. అందంగా పోజులిచ్చింది ఆషు రెడ్డి. ప్రస్తుతం ఈ అమ్మడు లేటెస్ట్ పిక్స్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అందాలను తట్టుకోవడం కష్టమేనని కామెంట్లు పెడుతున్నారు. స్వెటర్ వేసుకోవచ్చుగా అని ఫన్నీగా ఆటపట్టిస్తున్నారు.

ప్రస్తుతం ఆషు.. వరుస సినిమాల్లో నటిస్తోంది. 'పద్మవ్యూహంలో చక్రధారి' మూవీలో పద్మ రోల్ పోషిస్తోంది. ఆ సినిమాతో పాటు చాందినీ చౌదరి 'యేవమ్' చిత్రంలో కూడా నటిస్తోంది. ఈ లేడీ ఓరియెంటెడ్ సినిమాలో హారిక పాత్రలో కనిపించనుంది ఆషు. 'నా బాడీ సూపర్ డీలక్స్' అంటూ రీసెంట్ గా మేకర్స్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి ఈ ఆషు కొత్త చిత్రాలతో ఎలా ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.

Tags:    

Similar News