వైట్ ఫ్రాక్‌లో అషురెడ్డి హై గ్లామర్ ట్రీట్

గ్లామరస్ ఫోటోషూట్స్‌లో ఎప్పుడూ టాప్ ట్రెండింగ్‌లో ఉండే వారిలో అషూ రెడ్డి ఒకరు.;

Update: 2025-07-24 14:30 GMT

గ్లామరస్ ఫోటోషూట్స్‌లో ఎప్పుడూ టాప్ ట్రెండింగ్‌లో ఉండే వారిలో అషూ రెడ్డి ఒకరు. సోషల్ మీడియా వేదికగా తన స్టన్నింగ్ లుక్స్ తో తరచూ నెటిజన్లను ఆకట్టుకుంటూ వచ్చే ఈ బ్యూటీ, తాజాగా మయామీలో తీసుకున్న ఫోటోషూట్ తో మరోసారి వైరల్ అయింది. ఆఫ్ షోల్డర్ వైట్ ఫ్రాక్, గ్రాసీ గ్రీన్ బెల్ట్ తో అషూ స్టైల్‌కు అభిమానులు ఫిదా అవుతున్నారు.

ఈ లేటెస్ట్ లుక్‌లో అషూ చాలా అందంగా కనిపిస్తోంది. స్పెషల్ గా చెప్పుకోవాల్సింది ఆమె లుక్స్ గురించి. క్యాజువల్ ఫోజులకే కాదు, క్లాసీ డ్రెస్సింగ్‌కి కూడా న్యాయమిచ్చే స్టాన్స్ అషూ సొంతం. నడుము వద్ద బెల్ట్ హైలైట్ గా నిలుస్తూ ఆమెకు అదిరిపోయే లుక్‌ను ఇచ్చింది. ఈ ఫోటోల్లో ఉన్న అటిట్యూడ్, కాన్ఫిడెన్స్ చూసిన వారు "అషూ సో బ్యూటీఫుల్!" అనే విధంగా కామెంట్స్ చేస్తున్నారు.

అషూ రెడ్డి కెరీర్ విషయానికి వస్తే, ఆమె ఓ యాంకర్, యాక్ట్రెస్, సోషల్ మీడియా సెలబ్రిటీగానే కాకుండా, బిగ్ బాస్ తెలుగు 3తో తెలుగు ప్రేక్షకులందరికి బాగా దగ్గరైంది. ఆ షోలో స్పాంటెనియస్ గా ఉండటం వల్లే ఆమెకు ఫాలోయింగ్ పెరిగింది. ఆ తర్వాత కొన్ని చిన్న సినిమాలు, షార్ట్ ఫిలిమ్స్, యూట్యూబ్ షోస్ చేసినా, అసలు గుర్తింపు వచ్చిందంటే మాత్రం ఆమె సోషల్ మీడియా హంగామా వల్లే. ఆమె పిక్స్, డ్యాన్స్ క్లిప్స్ మిలియన్ల వ్యూస్ తెచ్చాయి.

తాజాగా ఆమె ఒక వెబ్‌సిరీస్‌లో కూడా నటించబోతున్నట్టు సమాచారం. ఇదే సమయంలో మయామీ ట్రిప్‌కి వెళ్లిన అషూ, అక్కడి నుంచి స్టైలిష్ ఫొటోలతో అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. “మంచి హృదయం మిమ్మల్ని ఎల్లప్పుడూ అందంగా ఉంచుతుంది.” అనే క్యాప్షన్‌తో పోస్ట్ చేసిన ఈ ఫోటోలు అభిమానుల్లో గ్లామర్ టాక్ మొదలయ్యేలా చేశాయి. ఒకవేళ డైరెక్టర్లు, ఓటీటీ ఫిల్మ్ మేకర్స్ ఆమె లుక్స్ గమనిస్తే, రొమాంటిక్ గ్లామర్ రోల్స్ కోసం ఈ అమ్మడిని కచ్చితంగా అడుగుతారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

Tags:    

Similar News