• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మహేష్ మేనల్లుడి మూవీ...

మహేష్ మేనల్లుడి మూవీ ట్రైలర్.. ఇంట్రెస్టింగ్ గా..

| ఈ భూమి మీద ఎక్క‌డా లేని విధంగా సుద‌ర్శ‌న చ‌క్రంతో వాసుదేవుడి విగ్ర‌హం అంటూ సాయి కుమార్ చెప్పే డైలాగ్‌ తో ట్రైల‌ర్ పవర్ ఫుల్ గా స్టార్ట్ అయింది.

By - Tupaki Desk
Update: 2024-11-12 10:23 GMT

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ దేవకీ నందన వాసుదేవ. గుణ 369 ఫేమ్ అర్జున్ జంధ్యాల ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్న ఆ సినిమాలో మానస వారణాసి హీరోయిన్ గా నటిస్తున్నారు. హనుమాన్ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కథ అందిస్తున్నారు. దీంతో సినిమాపై మంచి ఆసక్తి నెలకొంది.

ఇప్పటికే రిలీజ్ అవ్వాల్సిన మూవీని పలు కారణాల వల్ల వాయిదా వేసిన మేకర్స్.. నవంబర్ 22వ తేదీన రిలీజ్ చేస్తున్నట్లు రీసెంట్ గా అనౌన్స్ చేశారు. అదే సమయంలో ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ ఇచ్చిన జోష్ తో తాజాగా ట్రైలర్ ను విడుదల చేశారు. సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేశారు.

ఈ భూమి మీద ఎక్క‌డా లేని విధంగా సుద‌ర్శ‌న చ‌క్రంతో వాసుదేవుడి విగ్ర‌హం అంటూ సాయి కుమార్ చెప్పే డైలాగ్‌ తో ట్రైల‌ర్ పవర్ ఫుల్ గా స్టార్ట్ అయింది. కృష్ణ కృష్ణ హరే.. అంటూ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వస్తుండగా హీరో అశోక్ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత జాతకంలో ఏదో ఇబ్బంది ఉందని, జాగ్రత్తగా ఉండమని తల్లి చెబుతుంది. యాక్షన్ సీక్వెన్స్ లో అదరగొడుతూ హీరో కనిపించారు.

ఆ తర్వాత హీరోయిన్ మానసను పరిచయం చేశారు మేకర్స్. హీరోతో ఆమె లవ్ ట్రాక్ ను చూపించారు. విలన్ కు తన మేనల్లుడు (హీరో) వల్ల ప్రాణ హాని ఉందని చెప్పిన సీన్ తో ట్రైలర్ మలుపు తిరిగింది. హీరో, అతడి తల్లి పోరాడుతూ కనిపించారు. ట్రైలర్ చివర్లో వాసుదేవుడి అవతారాన్ని చూపించారు మేకర్స్. అయితే ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ ఉందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

కొందరు మహేష్ బాబు సూపర్ హిట్ మూవీ మురారి టచ్ ఉన్నట్లు అనిపిస్తుందని అంటున్నారు. ఏదేమైనా అశోక్ గల్లా మాస్ అండ్ రగ్డ్ లుక్ లో కనిపిస్తూ ఆకట్టుకుంటున్నారు. తన యాక్టింగ్ తో మెప్పిస్తున్నారు. విలన్ పాత్రలో కనిపించిన నటుడు కూడా పవర్ ఫుల్ గా ఉన్నారు. భీమ్స్‌ సిసిరోలియో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వేరే లెవెల్ లో ఉంది. హీరోయిన్ మానస క్యూట్ లుక్స్ తో మైమరపిస్తున్నారు.

నల్లపనేని యామిని సమర్పణలో లలితాంబిక ప్రొడక్షన్స్ బ్యానర్ పై సోమినేని బాలకృష్ణ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రసాద్‌ మూరెళ్ళ, రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రాఫర్లుగా వర్క్ చేస్తున్నారు. తమ్మిరాజు ఎడిటింగ్ బాధ్యతలు పర్యవేక్షిస్తున్నారు. 'హీరో' మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన గల్లా అశోక్.. దేవకీ నందన వాసుదేవపై మంచి హోప్స్ పెట్టుకున్నారు. మరి ఎలాంటి హిట్ అందుకుంటారో వేచి చూడాలి.

Full View
Tags:    
  • Devakinandanavasudevatrailer 
  • Ashokgalla 
  • Manasavaranasi 
  • Arjunjandyala 
  • Bheemsceciroleo 
  • Maheshbabu 
  • Devakinandanavasudeva 

Similar News

ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్లందరు కలిసి ఒక సినిమా కోసం వర్క్ చేస్తే ఎలా ఉంటుంది?

2026-11-04 16:30 GMT

ప్లాప్స్ లో సీనియ‌ర్లు టాప్ చైర్ కోసం యువ ద‌ర్శ‌కులు!

2026-11-04 15:30 GMT

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

Copyright @2026

Powered by Blink CMS