• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  లవ్ మీ.. ఆ కథతో సంబంధం...

లవ్ మీ.. ఆ కథతో సంబంధం లేదు!

| అశిష్, వైష్ణవి చైతన్య జంటగా నటించిన హారర్ లవ్ థ్రిల్లర్ "లవ్ మీ" చిత్రం మే 25న గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధమవుతోంది

By - Tupaki Desk
Update: 2024-05-22 07:57 GMT

అశిష్, వైష్ణవి చైతన్య జంటగా నటించిన హారర్ లవ్ థ్రిల్లర్ "లవ్ మీ" చిత్రం మే 25న గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధమవుతోంది. అశిష్ అలాగే చిత్ర బృందం పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటుండగా, మరోవైపు ఇంకా పెండింగ్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో అశిష్ మాట్లాడుతూ "లవ్ మీ" చిత్రంలో హారర్, థ్రిల్లింగ్ మూమెంట్స్ తో కూడిన పక్కా ప్రేమ కథ అని పేర్కొన్నారు.

అయితే ఒక ఇంటర్వ్యూలో అశిష్‌కి ఇండస్ట్రీలో వినిపిస్తున్న రూమర్స్ పై ప్రశ్నలు ఏసురయ్యాయి. "లవ్ మీ" మరియు సందీప్ కిశాన్ ఫాంటసీ థ్రిల్లర్ "ఊరు పేరు భైరవకొణ" మధ్య అనేక పోలికలు ఉన్నాయంటూ రూమర్స్ వినిపిస్తున్నాయని, దీని కారణంగానే "లవ్ మీ" టీమ్ కొన్ని సన్నివేశాలను మళ్లీ చిత్రీకరించాల్సి వచ్చిందనే అపోహలు ఉన్నట్లు ఇంటర్వ్యూయర్ అన్నారు. దీనిపై అశిష్ వెంటనే స్పందించి తన వివరణ ఇచ్చారు.

ఈ రూమర్స్ నిజం కాదని, "లవ్ మీ" చిత్రం "ఊరు పేరు భైరవకొణ"కు ఏమాత్రం సంబంధం లేదని అంటూ పూర్తిగా భిన్నమన స్టోరీ అని స్పష్టం చేశారు. అలాగే, ఈ సినిమాలోని కొన్ని ఎలిమెంట్స్ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తాయని తెలిపారు. ఈ చిత్రాన్ని హర్షిత్ రెడ్డి, హన్షితా రెడ్డి, నాగ మల్లిడి నిర్మించారు. లెజెండరీ సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ ఈ ప్రాజెక్టుకు సినిమాటోగ్రాఫర్ గా, ఎమ్ ఎమ్ కీరవాణి సంగీత దర్శకునిగా పని చేశారు.

"లవ్ మీ" సినిమా విడుదలకు ముందు అశిష్, వైష్ణవి చైతన్య, మరియు చిత్ర బృందం ప్రమోషన్లలో బిజీబిజీగా ఉన్నారు. సినిమా విడుదలకు ముందు ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగించింది. కానీ రీ షూట్స్ వంటి అంశాలు చివరి నిమిషం వరకు టెన్షన్ పెడుతున్నాయి. ఇక "లవ్ మీ" చిత్రం హారర్, థ్రిల్లర్ మూమెంట్స్ తో ప్రేమకథను సరికొత్తగా ఆవిష్కరిస్తుందని అశిష్ తెలిపారు.

ఈ చిత్రంలోని ప్రత్యేకతలను హైలైట్ చేయడం కోసం, అశిష్ సినిమా పట్ల ఉన్న అపోహలను తేలిగ్గా తీసిపారేశారు. "లవ్ మీ" చిత్రం ప్రేక్షకులను తప్పక అలరిస్తుందని, తమ సినిమా ఎక్కడా రాజీపడకుండా రూపొందించామని, అందులోని ప్రతి సన్నివేశం ప్రేక్షకులను సరికొత్త అనుభూతిని ఇస్తుందని చెప్పారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో సినిమాపై ఆసక్తి పెరుగుతుండడంతో, "లవ్ మీ" చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మొత్తంగా, "లవ్ మీ" సినిమా ప్రేమ, హారర్, మరియు థ్రిల్లర్ ఎలిమెంట్లతో ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉందని చెప్పవచ్చు. ఈ సినిమా విడుదల తర్వాత అశిష్ అలాగే చిత్రబృందం ప్రేక్షకుల నుంచి ఎలాంటి కామెంట్స్ పొందుతారో చూడాలి.

Tags:    
  • LoveMe 
  • Ashishreddy 
  • Vaishnavichaitanya 
  • Dilraju 
  • Lovememovie 
  • Lovemestory 
  • Tollywood 

Similar News

కాజల్ అగర్వాల్ అభిమానులు హార్ట్!

2026-11-06 19:30 GMT

మోడ్రన్ అవుట్‌ఫిట్‌లో సారా అర్జున్ ఫ్యాషన్ ట్రీట్!

2026-11-06 18:30 GMT

చాక్లెట్ బాయ్ ట్యాగ్ చెరిపేసి.. క్రూరమైన విలన్‌గా!

2026-11-06 17:30 GMT

శ్ర‌ద్ధాక‌పూర్ కొత్త‌ లుక్: న‌ట్టింట ల‌క్ష్మీ దేవి ప్ర‌త్య‌క్ష‌మైన‌ట్టు

2026-11-06 16:30 GMT

టైసన్ నాయుడు ఫస్ట్ సింగిల్.. క్యాచీ ఫోక్ బీట్ తో 'మదరాసి రబ్బరు బొమ్మ'

2026-11-06 16:03 GMT

సగం షెడ్యూల్‌కే గుడ్‌బై.. న్యాయపోరాటాలు!

2026-11-06 15:30 GMT

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

Copyright @2026

Powered by Blink CMS