ఆ హీరో హస్బెండ్ మెటీరియల్.. అలాంటి వ్యక్తే భర్తగా రావాలనుకుంటున్నా
శాండిల్‌వుడ్ నుంచి టాలీవుడ్ కు వచ్చి ఇక్కడ స్టార్ హీరోయిన్ గా ఎదగాలని ప్రయత్నాలు చేస్తున్నారు ఆషికా రంగనాథ్.;
శాండిల్‌వుడ్ నుంచి టాలీవుడ్ కు వచ్చి ఇక్కడ స్టార్ హీరోయిన్ గా ఎదగాలని ప్రయత్నాలు చేస్తున్నారు ఆషికా రంగనాథ్. అమిగోస్ మూవీతో హీరోయిన్ గా టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన ఆషికా మొదటి సినిమాతోనే యాక్టింగ్ పరంగా, అందం పరంగా అందరినీ మెప్పించారు. ఆ తర్వాత నాగార్జున హీరోగా వచ్చిన నా సామిరంగ అనే సినిమాలో నటించి తన నటనతో అందరూ ఫిదా అయ్యేలా చేశారు ఆషికా.
విశ్వంభరలో చిరూ తో కలిసి..
నా సామిరంగ తర్వాత కన్నడతో పాటూ కోలీవుడ్ సినిమాలపై ఫోకస్ చేసి స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఆషికాకు ప్రస్తుతం ఆ రెండు భాషల్లోనే కాకుండా తెలుగులో కూడా మంచి అవకాశాలే వస్తున్నాయి. చిరంజీవి హీరోగా వస్తోన్న విశ్వంభరలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు ఆషికా. అయితే విశ్వంభర కంటే ముందే అమ్మడు నటించిన మరో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుది.
జనవరి 13న భర్త మహాశయులకు విజ్ఞప్తి
అదే భర్త మహాశయులకు విజ్ఞప్తి. మాస్ మహారాజా రవితేజ హీరోగా వస్తోన్న ఈ సినిమాలో ఆషికా హీరోయిన్ గా నటిస్తున్నారు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఆషికాతో పాటూ డింపుల్ హయాతి కూడా హీరోయిన్ గా నటిస్తుండగా, సంక్రాంతి కానుకగా ఈ సినిమా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్ ఈ మూవీ ప్రమోషన్స్ ను మరింత వేగవంతం చేయగా, ఆషికా ప్రమోషన్స్ లో యాక్టివ్ గా పాల్గొంటున్నారు.
భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ అనేది భర్త లైఫ్ లోకి మరో అమ్మాయి వస్తే ఏం జరుగుతుందనే కాన్సెప్ట్, ఇప్పుడు రిలేషన్స్, పెళ్లి దానికి ఉన్న కన్ఫ్యూజన్స్ నేపథ్యంలో తెరకెక్కిందని, వీటన్నింటితో పాటూ సినిమాలో మంచి హ్యూమర్ కూడా ఉంటుందని టీజర్ చూస్తే క్లారిటీ వచ్చింది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటున్న ఆషికా తనకు కాబోయే భర్త ఎలా ఉండాలి? అతనిలో ఎలాంటి లక్షణాలుండాలనే దానిపై మాట్లాడారు.
ఆయనెప్పుడూ తన భార్య గురించే మాట్లాడతారు అందరిలానే తనక్కూడా తనకు కాబోయే భర్తలో ఫలానా క్వాలిటీస్ ఉండాలని ఉంటుందని, తాను నటిని కాబట్టి, యాక్టింగ్ పై తనకున్న ప్యాషన్ ను గుర్తించి తన కెరీర్ ను ఎంకరేజ్ చేసేలా ఉండాలని, తన విషయంలో కేర్ తీసుకోవడంతో పాటూ ప్రేమగా ఉండాలని, తనకు ఓసీడీ ఉందని, ఆ విషయంలో అసలు కాంప్రమైజ్ అవలేనని చెప్పారు. తాను ఇప్పటివరకు వర్క్ చేసిన హీరోల్లో కళ్యాణ్ రామ్ పర్ఫెక్ట్ హజ్బెండ్ మెటీరియల్ అని, అతను మాట్లాడే మాటల్లో తన భార్య గురించే ఎక్కువగా మాట్లాడతారని, అందుకే ఆయనలో ఉన్న క్వాలిటీస్ తన హస్బెండ్ లో కూడా ఉండాలని కోరుకుంటున్నట్టు ఆషికా చెప్పుకొచ్చారు.