లేలేత అందాలతో మాయ చేస్తున్న ఆషికా రంగనాథ్!
ఇలా ఒకవైపు తన సినిమా షూటింగ్ లతో బిజీగా ఉన్న ఈమె.. మరొకవైపు గ్లామర్ వలకబోస్తూ నెటిజన్స్ ను ఆకట్టుకునేలా ఫోటోలకు ఫోజులిస్తూ సోషల్ మీడియాలో మంట రాజేస్తోంది.
అవకాశం తలుపు తట్టాలే కానీ నిరూపించుకోవడం ఎంత పని.. అని తమను తాము ప్రూవ్ చేసుకుంటున్న వారిలో ఆషికా రంగనాథ్ కూడా ఒకరు. తొలిసారి కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన అమిగోస్ అనే చిత్రం ద్వారా ఇషికా పాత్రతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఆషికా రంగనాథ్ మొదటి సినిమాతోనే తన లేలేత అందాలతో అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఇక తర్వాత నాగార్జున, రాజ్ తరుణ్, అల్లరి నరేష్ కాంబినేషన్లో విజయ్ బిన్నీ దర్శకత్వం వహించిన నా సామిరంగా సినిమాలో వరమహాలక్ష్మి అలియాస్ వరాలు పాత్రతో ఊహించని పాపులారిటీ దక్కించుకుంది. 2024 సంక్రాంతికి వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది.
అలా రెండు తెలుగు చిత్రాలతో ఊహించని క్రేజ్ దక్కించుకున్న ఆషికా రంగనాథ్ ఈ ఏడాది భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే సినిమాలో నటించింది. ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించ లేకపోయింది. మాస్ మహారాజా రవితేజ హీరోగా, డింపుల్ హయతి, ఆషికా రంగనాథ్ ప్రధాన పాత్రలో కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ఎన్నో అంచనాల మధ్య సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న రవితేజ ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు కానీ ఇది ఆకట్టుకోలేకపోయింది. కానీ ఈ సినిమాలో ఆషికా రంగనాథ్ స్క్రీన్ ప్రెజెంట్స్ కి అభిమాను,లు ప్రేక్షకులు ముగ్ధులయ్యారు. ఆమె గ్లామర్ డోస్ కి హీటెక్కిపోయారు.
ఇక ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి.. వశిష్ట మల్లిడి దర్శకత్వంలో నటిస్తున్న సోషియో ఫాంటసీ మూవీ విశ్వంభర సినిమాలో ఒక కీలకపాత్ర పోషిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. అలాగే కార్తీ సర్దార్ సీక్వెల్ గా రాబోతున్న సర్దార్ 2 సినిమాలో కూడా ఈమె నటించింది. ఈ చిత్రం కూడా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉండడం గమనార్హం. త్వరలోనే ఈ రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇలా ఒకవైపు తన సినిమా షూటింగ్ లతో బిజీగా ఉన్న ఈమె.. మరొకవైపు గ్లామర్ వలకబోస్తూ నెటిజన్స్ ను ఆకట్టుకునేలా ఫోటోలకు ఫోజులిస్తూ సోషల్ మీడియాలో మంట రాజేస్తోంది.
ఇంస్టాగ్రామ్ వేదికగా తాజాగా కొన్ని ఫోటోలను షేర్ చేసింది ఆషికా రంగనాథ్. అందులో రా సిల్క్ తో డిజైన్ చేసిన పింక్ కలర్ వన్ మినిట్ శారీని ధరించింది. ఇక పైన హాఫ్ షోల్డర్ లెంగ్తీ హెవీ ఎంబ్రాయిడరీ తో డిజైన్ చేసిన బ్లౌజ్ ను ధరించింది. కొంగును పైకి వేయకుండా చేతిలో పట్టుకొని ఆ ఔట్ ఫిట్ కి సరికొత్త స్టైల్ ను తీసుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ. చీరను తలిపించేలా ట్రెండీ అవుట్ ఫిట్ లో ఉన్న ఈ కొత్త డ్రెస్ ఈమె అందాన్ని రెట్టింపు చేసింది.
మెడను సింపుల్ చౌకర్తో ఫుల్ ఫిల్ చేసింది ఆషికా రంగనాథ్.. అబరన్ టైం లెస్ జువెలరీ కి చెందిన దుస్తులు, ఆభరణాలు ధరించి అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఇక ఈ లుక్ ని ఖుషి జగదీష్ స్టైల్ చేయగా.. పరమేశ్ హెయిర్ స్టైలింగ్.. శివ గౌడ మేకప్ చేశారు. ఓవరాల్ గా లేటెస్ట్ అవుట్ ఫిట్ తో లేలేత అందాలతో మాయ చేస్తూ అభిమానులను బాగా ఆకట్టుకుంటోంది.