అంద‌మైన ఆషీకా రంగ‌నాధ్ అంత బోల్డ్ గానా?

ద‌క్షిణాది హీరోయిన్లు అంటే బోల్డ్ పాత్ర‌ల‌కు అంత ఈజీగా క‌న్విన్స్ అవ్వ‌రు. వీలైంన‌త‌ వ‌ర‌కూ ఆ త‌ర‌హా పాత్ర‌ల‌కు దూరంగా ఉండ‌టానికే ప్ర‌య‌త్నిస్తారు.;

Update: 2026-01-10 07:30 GMT

ద‌క్షిణాది హీరోయిన్లు అంటే బోల్డ్ పాత్ర‌ల‌కు అంత ఈజీగా క‌న్విన్స్ అవ్వ‌రు. వీలైంన‌త‌ వ‌ర‌కూ ఆ త‌ర‌హా పాత్ర‌ల‌కు దూరంగా ఉండ‌టానికే ప్ర‌య‌త్నిస్తారు. ద‌ర్శ‌కుడు త‌ప్ప‌దని ప‌ట్టుబ‌డితే త‌ప్ప అంగీక‌రించారు. అదీ ప‌రిమితుల‌కు లోబ‌డే ప‌ని చేస్తామంటారు. అతిగా డిమాండ్ చేస్తే ప్రాజెక్ట్ ను వ‌దుల‌కోవ‌డానికి వెనుకాడ‌రు. ప్ర‌త్యేకించి క‌న్న‌డ భామ‌ల్ని క‌న్విన్స్ చేయ‌డం అంత‌క‌న్నా సుల‌భం కాదు. కానీ ఓ న‌టి ఏరి కోరి మ‌రి బోల్డ్ పాత్ర‌ను ఎంచుకుంది. ప‌ద్ద‌తిగా చీర క‌ట్టుకుని తెలుగు ఆడ‌ప‌డుచులా క‌నిపించే పాత్ర కావాలా? చిట్టిపొట్టి దుస్తుల్లో కుర్రాళ్ల‌ను క‌వ్వించే రోల్ కావాలా? అంటే చీర పాత్ర‌లో ఏమంటుంది? రోటీనిటీ త‌ప్ప కుర‌చ దుస్తుల్లో అయితే వంద‌శాతం న్యాయం చేస్తానంటూ ముందుకొచ్చిందో న‌టి.

ఇంత‌కీ ఎవ‌రా చిచ్చ‌ర పిడుగు అనుకుంటున్నారా? ఆమె ఎవ‌రో కాదు బ్యూటీఫుల్ క‌న్న‌డ బ్యూటీ ఆషీకా రంగ‌నాధ్. నాగార్జున హీరోగా న‌టించిన `నా సామిరంగ‌`లో జోడీగా మెప్పించిన అమ్మ‌డికి ఆ త‌ర్వాత హిట్ ప‌డ‌ని సంగ‌తి తెలిసిందే. చేసిన సినిమాలేవి క‌లిసి రాలేదు. ఈ క్ర‌మంలో మాస్ రాజా ర‌వితేజ హీరోగా కిషోర్ తిరుమ‌ల తెర‌కెక్కించిన `భ‌ర్త మ‌హాశ‌యుల‌కు విజ్ఞ‌ప్తి` లో ఛాన్స్ అందుకుంది. ఇందులో ఇద్ద‌రు హీరోయిన్లు ఉండ‌గా? ఓ హీరోయిన్గా ఆషీకా రంగ‌నాధ్ ఎంపికైంది. మ‌రో హీరోయిన్ గా డింపుల్ హ‌య‌తిని తీసుకున్నారు.

ఈ క‌థ చెప్ప‌డానికి వెళ్లిన‌ప్పుడు ద‌ర్శ‌కుడు హీరో ప్రియురాలి పాత్ర బోల్డ్ గా ఉంటుంది? మ‌రో పాత్ర అదే హీరోకు భార్య‌గా న‌టించాలి. రెండిటిలో ఏ పాత్ర తీసుకుంటారు? మీ ఇష్టంపైనే ఆధార‌ప‌డి ఉంద‌ని ఛాన్స్ ఆషీకా చేతుల్లోనే పెట్టాడు. అందుకు ఆషీకా రంగ‌న్నాద్ గ‌త సినిమాల్లో చీర క‌ట్టుకుని ప‌ద్ద‌తిగా భార్యామ‌ణి పాత్ర‌లు పోషించాన‌ని చెప్పి ఆ బోల్డ్ రోల్ లో న‌టిస్తాన‌ని ఓపెన్ గా చెప్పేసింది. సినిమాలో మాన‌స శెట్టి అనే పాత్ర‌లో క‌నిపించ‌నుంది. స్పెయిన్ లో ఉన్న ఓ పెద్ద స్పిరిట్ కంపెనీ ఎండీ త‌ను. స్ట్రాంగ్ బోల్డ్ గ‌ర్ల్ గా ఉంటుందా రోల్.

ఈ త‌రం మోడ్ర‌న్ గాళ్ల్ గా క‌నిపిస్తానంది. కెరీర్ లోనే ఇంత బోల్డ్ పాత్ర ఇప్ప‌టి వ‌ర‌కూ పోషించ‌లేద‌ని తెలిపింది. ఈ సినిమా త‌న త‌ర్వాత కొత్త ఇమేజ్ ఏర్ప‌డుతుంద‌ని ఆషీకా ధీమా వ్య‌క్తం చేసింది. మ‌రో అమ్మాయికి భ‌ర్త‌గా ఉన్న వ్య‌క్తి జీవితంలోకి తానెళ్లిన త‌ర్వాత జ‌రిగిన ప‌రిణామాలు ఏంటి? అన్న‌ది ఓ పాయింట్ గా హైలైట్ అవుతుంద‌ని తెలిపింది. కిషోర్ తిరుమ‌ల క్లాసిక్ డైరెక్ట‌ర్ అయినా? సీన్ డిమాండ్ చేసిందంటే రాజీ ప‌డే ద‌ర్శ‌కుడు కాదు. బోల్డ్ స‌న్నివేశాన్ని ర‌క్తిక‌ట్టించ‌డంలోనూ అంతే స‌మ‌ర్దుడు. మ‌రి క‌న్న‌డ బ్యూటీని ఏ రేంజ్ లో ఆవిష్క‌రిస్తున్నాడో చూడాలి.

Tags:    

Similar News