ఆర్యన్ రాజేష్ ఎంట్రీ ఉంటే ఆ రేంజ్ లో!
ఆర్యన్ రాజేష్ టాలీవుడ్ కి విలన్ గా కంబ్యాక్ అవుతున్నాడని కొంత కాలంగా ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే.;
ఆర్యన్ రాజేష్ టాలీవుడ్ కి విలన్ గా కంబ్యాక్ అవుతున్నాడని కొంత కాలంగా ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. కానీ ఇంత వరకూ అది జరగలేదు. `స్పై `సినిమా తర్వాత రాజేష్ మళ్లీ తెరపై కనిపించలేదు. ఇంకా ముందుకెళ్తే `వినయ విధేనయ రామ`లో నటించాడు. 2015 లో అల్లరి నరేష్ హీరోగా నటించిన `బందిపోటు`లోనూ నటించాడు. ఇంకా ముందుకెళ్తే రాజేష్ హీరోగా నటించిన సినిమాలొస్తాయి. కానీ రాజేష్ హీరోగానూ సక్సెస్ అవ్వలేదు. ఆ తర్వాత నటించిన చిత్రాలు కూడా అతడికి ఎలాంటి గుర్తింపును తీసుకురాలేదు.
`ధృవ` లో అరవింద్ స్వామి లాంటి రోల్:
ఈ క్రమంలో టాలీవుడ్ లో విలన్ల కొరత గుర్తించి ఆ రకంగా ఎంట్రీ ఇస్తున్నాడనే ప్రచారం జరిగింది. తాజాగా ఇది నిజమేనని నరేష్ కన్పమ్ చేసాడు. ఓ సినిమా ద్వారా విలన్ గా ఎంట్రీ ఇవ్వాలి. కానీ ఆ ఛాన్స్ తానే వదులుకున్నట్లు తెలిపాడు. రాజేష్ ఎలాంటి విలన్ అవ్వాలనుకున్నాడు? అన్నది తెలియదు గానీ తమ్ముడు నరేష్ మాత్రం తానో సీరియస్ విలన్ అవ్వాలనుకున్నాడు? అన్నది వాస్తవం.` ధృవ` సినిమాలో అరవింద్ స్వామి లాంటి పాత్రలో నటిస్తే చూడాలని ఉందని తెలిపాడు నరేష్. రెగ్యులర్ విలన్ పాత్రలతో ఎలాంటి గుర్తింపు ఉండదని..వాటికి ఎంతో లైఫ్ కూడా ఉండదన్నాడు.
ఇతర భాషల విలన్లతో పోటీ:
ఈ క్రమంలో విలన్ గా అవకాశాలు వస్తున్నా? ఆ పాత్రలు బలంగా లేకపోవడంతో నటించడం లేదన్నాడు. సరైన రోల్ కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపాడు. అలాంటి పాత్ర వచ్చినప్పుడు తప్పకుండా రీఎంట్రీ ఇస్తాడని తెలిపాడు. మరి రాజేష్ లో అరవింద్ స్వామి లాంటి విలన్ ని ఏ డైరెక్టర్ చూస్తాడో చూడాలి. కానీ ఇదంత ఈజీ కాదు. విలన్ పాత్రలంటే నేటికి పర భాషా నటులపై దర్శక, నిర్మాతలు ఆధార పడుతున్నారు. హిందీ నటులకు బధులుగా తమిళ, మలయాళ, కన్నడ నటుల్ని తీసుకుంటున్నారు. పాన్ ఇండియా సినిమా అయితే ఆ రేంజ్ నటుల్ని ఎంపిక చేస్తున్నారు.
తీవ్రమైన పోటీ నడుమ:
ఇంకొంత మంది అయితే దేశాలే దాటిపోతున్నారు. టైర్ 2 హీరోలతో సినిమాలు చేస్తున్న దర్శకులు కూడా యూనిక్ గా ఉండే విలన్ల కోసం చూస్తున్నారు. ఈ క్రమంలో వారు కూడా ఎక్కడా రాజీ పడటం లేదు. కొత్త కొత్త నటులతో ప్రయోగాలు చేస్తున్నారు. మరికొంత మంది దర్శకులు సైడ్ ఆర్టిస్టుల గత సినిమాల పెర్పార్మెన్స్ చూసి మెయిన్ విలన్ గా తీసుకుంటున్నారు. విలన్ల పరంగా ఇంత కాంపిటీషన్ ఉంది. అవన్నీ దాటుకుని ఆర్యన్ రాజేష్ విలన్ అవకాశాలు అందుకోవాలి.