బైక్‌ ను ఢీ కొట్టిన హీరోయిన్‌ కారు

Update: 2018-12-13 07:06 GMT
హీరోయిన్‌ గా పెద్దగా అవకాశాలు రాకున్నా కూడా ఈమద్య కాలంలో జరీన్‌ ఖాన్‌ పదే పదే మీడియాలో ఉంటూనే ఉంది. ఇటీవలే ఈమె తన మాజీ మేనేజర్‌ అంజలిపై ఆరోపణలు చేస్తూ మీడియా ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. తన మేనేజర్‌ తన పేరు వాడుకుని డబ్బులు వసూళ్లు చేసిందని ఆరోపించిన విషయం తెల్సిందే. జరీన్‌ ఖాన్‌ ఆరోపణలు ఇంకా మీడియాలో చర్చ జరుగుతున్న సమయంలోనే ఆమె కారు ఒక బైక్‌ ను ఢీ కొట్టడంతో మళ్లీ చర్చనీయాంశం అయ్యింది.

జరీన్‌ ఖాన్‌ తాజాగా గోవాలో ఒక కార్యక్రమంలో పాల్గొంది. అందుకోసం గోవాలో కారులో ప్రయాణించింది. ఆ సమయంలోనే కారు ప్రమాదంకు గురైంది. బైక్‌ పై వెళ్తున్న వ్యక్తిని జరీన్‌ ఖాన్‌ ప్రయాణిస్తున్న కారు ఢీ కొట్టింది. దాంతో అతడు ఒక్కసారిగా డివైడర్‌ కు బలంగా తలగడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. హాస్పిటల్‌ లో చికిత్స పొందుతు అతడు మృతి చెందాడు.

యాక్సిడెంట్‌ కేసు నమోదు చేసిన పోలీసులు కారు డ్రైవర్‌ ను అరెస్ట్‌ చేశారు. ఈ యాక్సిడెంట్‌ లో జరీన్‌ ఖాన్‌ కు కూడా స్వల్ప గాయాలు అయినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె బాగానే ఉందని - చిన్న చిన్న గాయాలు తప్ప పెద్దగా ఏమీ కాలేదని ఆమె తరపున ప్రకటన వచ్చింది.
Tags:    

Similar News