'గ్లామర్ పాత్రలకు సై' అంటున్న యంగ్ హీరోయిన్
మెంటల్ మదిలో సినిమాతో తెలుగుతెరకు పరిచయమయ్యింది హీరోయిన్ నివేద పేతురాజ్. చూడటానికి సంప్రదాయ బద్దంగా పక్కింటి అమ్మాయిలా కనిపించే నివేద.. ఇప్పటివరకు చేసిన పాత్రలన్నీ అలాంటివే. కెరీర్ ప్రారంభంలో గ్లామర్ పాత్రలకు నో చెప్పిన నివేద.. సాయిధరమ్ తేజ్ తో 'చిత్రలహరి`, శ్రీవిష్ణుతో `బ్రోచేవారెవరురా` సినిమాలతో హిట్స్ అందుకొని నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కిన `అల వైకుంఠపురములో' సినిమాలో కాస్త గ్లామర్ ఒలకబోసే రోల్ చేసింది అమ్మడు. కెరీర్ ఆరంభంలో సాంప్రదాయబద్ధమైన పాత్రలు చేసిన నివేద.. ప్రస్తుతం గ్లామరస్ పాత్రలకు ఓటేస్తోంది.
దీని గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో నివేద మళ్లాడుతూ.. `నాకు మొదటి నుండి గ్లామర్ విషయంలో పెద్దగా పట్టింపులు లేవు. గ్లామరస్ పాత్రలలో నటించాలా నటించకూడదా అనే నిబంధనలు ఏమి పెట్టుకో లేదు. కథకు అవసరమైతే గ్లామరస్ గా కనిపించడానికి నేను ఎప్పుడూ సిద్దమే. రీసెంట్ గా `అల వైకుంఠపురములో..` సినిమాలో కాస్త గ్లామరస్‌గా చూపించారు త్రివిక్రమ్ గారు. కథకు అది అవసరం కాబట్టి అలా నటించా. తమిళంలో చాలా సినిమాలు చేశా, తెలుగులో కూడా చేస్తూనే ఉన్నా కానీ గ్లామరస్‌గా కనిపించే అవసరం ఇంత వరకు రాలేదు' అంటూ సెలవిచ్చింది. ప్రస్తుతం అమ్మడు రామ్ హీరోగా నటిస్తున్న 'రెడ్' సినిమాలో నటిస్తుంది.