సినిమాలకు గుడ్ బై చెప్పే ఆలోచనలో యంగ్ హీరోయిన్.. అదే కారణమా..??

Update: 2021-06-25 02:30 GMT
సినిమా ఇండస్ట్రీ అంటేనే హిట్స్ ప్లాప్స్ అనే రెండు పదాలపై రన్ అవుతున్న విషయం తెలిసిందే. ఎవరి కెరీర్ ఎప్పుడు ఎలా ఉంటుందో.. ఎప్పుడు ఏ స్థితికి పడిపోతుందో ఎవరు చెప్పలేరు. కానీ ఇండస్ట్రీలో మాత్రం టాలెంట్ ఉంటేనే నెగ్గుకు రాగలుగుతాం అనేది మాత్రం ఖచ్చితంగా అర్ధమవుతుంది. ఇండస్ట్రీ అన్నాక ఎంతోమంది వస్తుంటారు పోతుంటారు. కానీ సెటిల్ అయ్యేవారు మాత్రం కొందరే ఉంటారు. అందరికి సక్సెస్ రావాలంటే కష్టం. ఎందుకంటే సంవత్సరంలో తెరకెక్కే సినిమాల్లో హిట్స్ కేవలం 30% ఉండటం గమనార్హం. అంటే దీన్ని బట్టే అర్ధం చేసుకోవచ్చు. ఎంతమంది సక్సెస్ అవుతున్నారో.. ఎంతమంది ప్లాప్స్ ఫేస్ చేస్తున్నారో.

అయితే అప్పుడప్పుడు ఇండస్ట్రీలో మంచి ఫ్యూచర్ ఉంటుందని అనుకున్న హీరోయిన్స్ ఒక్కసారిగా కనిపించకుండా పోతారు. అలాంటి హీరోయిన్స్ లో సీనియర్ సౌత్ హీరోయిన్ రాధా కూతురు కార్తీక ఒకరు. తెలుగులో జోష్ సినిమాతో కెరీర్ ప్రారంభించిన కార్తీక.. ఆ సినిమా ప్లాప్ అవ్వడంతో తమిళంలో అడుగుపెట్టింది. తమిళంలో కేవీ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన కో(రంగం) సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. ఒక్కసారిగా కో సినిమాతో కార్తీక వరుస ఆఫర్స్ తో బిజీ అయిపోయింది. కానీ ఆ తర్వాతే పెద్ద చిక్కు వచ్చిపడింది. వరుస ప్లాప్స్ పడేసరికి మలయాళం - కన్నడ భాషల్లో కూడా ప్రయత్నం చేసింది.

ఆ ఇండస్ట్రీలలో కూడా అమ్మడికి అదృష్టం కలిసిరాలేదు. కార్తీక చివరిగా 'వాడీల్' అనే సినిమా చేసింది. రెండు మూడేళ్లుగా కార్తీకకు హిట్స్ ప్లాప్స్ విషయం పక్కనపెడితే అసలు అవకాశాలు రావడమే గగనం అయిపోయిందట. ఎలాగో అవకాశాలు లేవు కదా.. అని అమ్మడు తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంటున్నట్లు ఇండస్ట్రీ వర్గాలలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అదేంటంటే.. సినిమాలకు ఇక గుడ్ బై చెప్పేసి తాను నిర్వహిస్తున్న హోటల్ బిజినెస్ చూసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. మరి సినిమాలకు గుడ్ బై చెప్పడానికి కార్తీక వయసేం పెద్దగా లేదు. కానీ ఆమె పర్సనల్ నిర్ణయం నిర్ణయం కాబట్టి ఎవరు ఏమి అనడానికి లేదు. సో ఒకవేళ నిజమైతే మాత్రం అవకాశాలు లేనప్పుడు కరెక్ట్ నిర్ణయమే అంటున్నాయి సినీవర్గాలు.
Tags:    

Similar News