సారా అర్జున్ ఫేవరెట్ తెలుగు హీరో ఎవరో తెలుసా?

అలాంటి ఈ ముద్దుగుమ్మ తాజాగా తెలుగులో గుణశేఖర్ దర్శకత్వంలో వస్తున్న యుఫోరియా అనే సినిమాలో నటిస్తోంది.;

Update: 2026-01-17 09:45 GMT

ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ మొదలుపెట్టి.. పదుల సంఖ్యలో సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించిన సారా అర్జున్.. దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియిన్ సెల్వన్ సినిమాలో ఐశ్వర్యరాయ్ చిన్నప్పటి పాత్రలో నటించి.. నటిగా అందరి దృష్టిని ఆకట్టుకుంది. అలాంటి ఈమె తొలిసారి బాలీవుడ్ లో రణవీర్ సింగ్ హీరోగా ఆదిత్యాధర్ దర్శకత్వంలో వచ్చిన ధురంధర్ సినిమాలో హీరోయిన్ గా నటించి, ఓవర్ నైట్ లోనే భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. ముఖ్యంగా ప్రభాస్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోల క్రేజ్ ను కూడా వెనక్కి నెట్టింది అని చెప్పవచ్చు.

అలాంటి ఈ ముద్దుగుమ్మ తాజాగా తెలుగులో గుణశేఖర్ దర్శకత్వంలో వస్తున్న యుఫోరియా అనే సినిమాలో నటిస్తోంది. ఈ మేరకు ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను తాజాగా విడుదల చేశారు. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో పాల్గొన్న సారా అర్జున్ తనకు ఇష్టమైన తెలుగు స్టార్ హీరో ఎవరో చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో భాగంగా యాంకర్ మాట్లాడుతూ.. తెలుగులో మీ ఫేవరెట్ హీరో ఎవరు ? అని అడగగా.. చాలామంది ఉన్నారు అని చెప్పుకొచ్చింది సారా అర్జున్.

అయితే ఒక్కరి పేరు మాత్రమే చెప్పాలని యాంకర్ అడగగా.. రౌడీ హీరో విజయ్ దేవరకొండ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పి రౌడీ హీరో అభిమానులను ఆశ్చర్యపరిచింది ఈ లేటెస్ట్ సెన్సేషనల్ యంగ్ హీరోయిన్ సారా అర్జున్. మొత్తానికి అయితే విజయ్ దేవరకొండ అంటే ఇష్టమని చెప్పడంతో వీరిద్దరి కాంబోలో సినిమా వస్తే చూడాలని ఉంది అని అప్పుడే అభిమానులు కూడా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా సారా అర్జున్ చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

ఇకపోతే సారా అర్జున్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ యుఫోరియా సినిమా విషయానికి వస్తే.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో నాజర్, గౌతమ్ మీనన్, ఆదర్శ్ బాలకృష్ణ, భూమిక చావ్లా తదితరులు కీలకపాత్రలు పోషించారు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో సమాజంలో యువత డ్రగ్స్ వల్ల ఎదుర్కొంటున్న సమస్యలు, క్రైమ్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించినట్లు డైరెక్టర్ చెప్పుకొచ్చారు. తాజాగా విడుదల చేసిన ట్రైలర్లో ఇలాంటి ఎలిమెంట్స్ ను ఎక్కువగా చూపించారు. అమ్మాయిలపై రేప్ అటెంప్ట్, మైనర్ క్రైమ్, పోక్సో ఇలా కరెంటు టాపిక్స్ ను తీసుకొని ఈ సినిమాను తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తే స్పష్టం అవుతుంది. ముఖ్యంగా ఈ ఒక్క ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసిందని చెప్పవచ్చు.

ఈ చిత్రాన్ని గుణ హ్యాండ్ మేడ్ ఫిలిమ్స్ బ్యానర్ పై నీలిమ గుణ నిర్మిస్తున్నారు. కాలభైరవ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇకపోతే సమంతతో శాకుంతలం లాంటి పాన్ ఇండియా డిజాస్టర్ తర్వాత గుణశేఖర్ నుంచి వస్తున్న ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.

Tags:    

Similar News