హీరోయిన్ ని యంగ్ హీరో లైట్ తీసుకుంటున్నాడా?

Update: 2022-08-07 00:30 GMT
హీరో-హీరోయిన్ల మ‌ధ్య గాసిప్పులు స‌హ‌జ‌మే. బాలీవుడ్ లో ఇది చాలా రెగ్యుల‌ర్ న్యూస్. టాలీవుడ్..కోలీవుడ్ లో  మాత్రం ఇలాంటివి ఓ సంచ‌ల‌నంగా క‌నిపిస్తాయి. ఆ రెండు భాష‌ల మ‌ధ్య సంస్కృతి వ్య‌త్యాస‌మే అందుకు కార‌ణం. కొన్నాళ్ల‌గా టాలీవుడ్ లో ఓ జంట తీరు బాలీవుడ్ తీరుని త‌ల‌పిస్తుంది. ఇద్ద‌రి మ‌ధ్య బాండింగ్ మ‌రింత స్ట్రాంగ్  అవుతుంది.

ఆన్ ది స్క్రీన్  కి..ఆఫ్ ది స్క్రీన్ కి మ‌ధ్య తేడా పెద్ద‌గా క‌నిపించ‌డం లేదు. స్నేహం పేరుతో మొదలైన ఆలింగ‌నం నుంచి ముద్దుల వ‌ర‌కూ అంతా ఓపెన్. ఇదంతా కేవ‌లం స్నేహం పేరిట మాత్రం అంతా ఓపెన్ గానే జ‌రుగుతుంది. మీడియాలో వార్త‌లొచ్చినా వాటిని పట్టించుకున్న‌ది లేదు. చివ‌రికి  ఇద్ద‌రి గురించి ఓ స‌ద‌ర్భంలో  అలాంటి వార్త‌లొస్తున్నాయ్..ఏమంటావ్ వోయ్ అంటూ సెటైర్లు సైతం ప‌డ్డాయి.

అయితే అలాంటి ఓ స‌న్నివేశ‌మే ఇప్పుడు ఆ జంట మ‌ధ్య దూరం పెంచుతున్న‌ట్లు క‌నిపిస్తుంద‌ని తాజాగా  గుస గుస వినిపిస్తుంది. ఇటీవ‌లే ఆ యంగ్ హీరో..ఆ హీరోయిన్ న‌టించిన సినిమా వేడుక‌కు గెస్ట్ గా వెళ్లాడు.  ఆ వేడుక‌లో  సినిమాలో న‌టించిన న‌టులంతా భాగ‌మ‌య్యారు. అంద‌ర్నీ ఆ హీరో ఎంతో ఆప్యాయంగా ప‌ల‌క‌రించాడు.

అంతే ఆప్యాయంగా ఆలింగ‌నం చేసుకున్నాడు. ఈ క్ర‌మంలోనే ఆ హీరోయిన్ క్యూ లో ఉండ‌గా హీరో ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్నాడ‌ని చూసి ముందుగా రెండు చేతులు చాచి..చిలిపి గా న‌వ్వుతూ  రెడీగా ఉంది. రా..రా చెలికాడా? అంటూ వెళ్ల‌తో  సిగ్నెల్ పాస్ చేసింది. ఆ  హీరో పై ఎంతో ప్రేమ చూపించింది. ఇద్ద‌రు ఎంతో ఆప్యాయంగా హ‌త్తుకున్నారు.
Read more!

ఆ స‌మ‌యంలో  ఆ హీరోయిన్ హ‌గ్ లో ఏదో తెలియ‌ని వైబ్రేష‌న్ క‌నిపించింది. కానీ హీరోగారు మాత్రం చాలా క్యాజువ‌ల్ గానే హ‌త్తుకుని వ‌చ్చేసాడు. ఆ స‌మ‌యంలో హీరోయిన్ వ్య‌క్తిగ‌తంగా మాట్లాడుతుంద‌ని ఆశ‌ప‌డింది. కానీ హీరో మాత్రం ఒక్క ముక్క కూడా మాట్లాడ‌లేదు. హ‌గ్ ఇచ్చి వెంట‌నే అక్క‌డ నుంచి వెనుదిరిగాడు.

ఈ నేప‌థ్యంలో ఇద్ద‌రి మ‌ధ్య దూరం పెగుతుందా? అన్న సందేహం తెర‌పైకి వ‌స్తుంది. ఇటీవ‌లే ఆ హీరో ఓ ఫేమ‌స్ సెల‌బ్రిటీ టాక్ షోలో ఆ హీరోయిన్ గురించి మాట్లాడ‌టం కూడా జ‌రిగింది. ఎంతో ఓపెన్ గా ఆ హీరోయిన్ పై త‌న అభిప్రాయాన్ని సైతం వెల్ల‌డించాడు. మ‌రి వీట‌న్నింటి న‌డుమ పుకార్ల‌కు పుల్ స్టాప్ పెట్టాల‌ని హీరోగారు హీరోయిన్ తో ఉన్న ర్యాపోని త‌గ్గిస్తున్నాడా?  లేక ఇంకేమైనా కార‌ణాలు న్నాయా? అన్న‌ది తెలియాల్సి ఉంది.

ప్ర‌స్తుతం ఆ హీరో న‌టించిన సినిమా ఒక‌టి రిలీజ్ కి రెడీ అవుతోంది. మ‌రో రెండు సినిమాలు లైన్ లో ఉన్నాయి. ఇక హీరోయిన్ రేంజ్ అయితే అంత‌కంత‌కు పెరిగిపో తుంది. ప్ర‌స్తుతం బాలీవుడ్ లో బిజీ అయ్యే ప్ర‌య‌త్నాలు చేస్తుంది. ఇప్ప‌టికే మూడు నాలుగు  ప్రాజెక్ట్  లు క‌మిట్ అయింది.
Tags:    

Similar News