నువ్వో వేశ్య‌వు.. రేప్ చేస్తామ‌ని బెదిరించారు!

Update: 2021-02-21 02:30 GMT
సోష‌ల్ మీడియాల్లో ఫాలోయింగ్ పెంచుకునేందుకు స్టార్ కిడ్స్ ర‌క‌ర‌కాల ఎత్తుగ‌డ‌ల్ని అనుస‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. చిట్టి పొట్టి నిక్క‌ర్లు బికినీలు టూపీస్ ల‌తో చెల‌రేగ‌డం ఇక్క‌డ కామన్ గా మారింది. అయితే అలా ఇష్టానుసారం రెచ్చిపోతే ఆ త‌ర్వాత దాని ఫ‌లితం కూడా అలానే ఉంటోంది. అలాంటి విచ్చ‌లవిడి ఫోటోల్ని షేర్ చేస్తే ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా ట్రోలింగ్ ను ఎదుర్కోవాల్సి వ‌స్తోంది. ఇక్క‌డ బూతుపురాణం చాలా కామ‌న్. ముఖ్యంగా యూత్ నోటికి అడ్డూ ఆపూ ఉండ‌దు. ఏది నోటికొస్తే అది తిట్టేస్తున్నారు.

ఇప్పుడు అలాంటి సెగనే ఎదుర్కొంది ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు అనురాగ్ క‌శ్య‌ప్ గారాల‌ట్టీ.. ఆలియా క‌శ్య‌ప్. ఆలియా ఇంత‌కుముందు ఆల్మోస్ట్ అర్థ‌న‌గ్నంగా ఉన్న ఫోటోని షేర్ చేయ‌గా దానికి తిట్లు బూతులు ఎదుర‌య్యాయి. ఇదే విష‌యంపై ఆలియా ఓ ఇంట‌ర్వ్యూలో ప్ర‌స్థావిస్తూ ఇలాంటివి అస్స‌లు త‌ట్టుకోలేన‌ని వ్యాఖ్యానించారు. త‌న‌ను త‌న కుటుంబాన్ని తీవ్రంగా దూషించార‌ని.. త‌న‌ను వేశ్య అని తిట్టార‌ని కూడా వెల్ల‌డించింది. అంతేనా.. కొంద‌రైతే రేప్ చేస్తామ‌ని బెదిరించార‌ట‌.

సోషల్ మీడియా ప్రతికూలత ను త‌ట్టుకోలేక‌పోతున్నా. నేను సున్నితమైన వ్యక్తిని. అతి చిన్న ద్వేషం కూడా నన్ను ప్రభావితం చేస్తుంది.. అంటూ ఆలియా వాపోయింది. లోదుస్తులలో ఉన్న తన ఫోటోపై ద్వేషం గురించి కూడా ఆమె తన ఇన్ స్టాగ్రామ్ ‌లో పోస్ట్ చేసింది. ``ఇటీవల ఒక లోదుస్తుల ఫోటోషూట్ నుంచి ఓ ఫోటోని పోస్ట్ చేసాను. దానిపై తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర‌య్యాయి. ఎదురుదెబ్బలు తిన్నాను. నేను భారతీయురాలిని కావడం.. ఇలాంటివి చేయాలంటే సిగ్గుపడాలని ప్రజలు సూచించారు`` అని తెలిపారు.

`నేను నిరంతరం ఏడుస్తున్నాను. చాలా కలత చెందాను``అని వ్యాఖ్యానించారు. ఇలాంటి వారిని ఇన్ స్టాలో ద‌రి చేర‌నీయ‌కూడ‌ద‌ని కూడా అంది ఆలియా. అయితే ఈ అనుభ‌వ పాఠాల నుంచి ఏం నేర్చుకుందో మాత్రం తాను వెల్ల‌డించ‌లేదు.
Tags:    

Similar News