డైరెక్ట్ గా 'ఓటిటి'లో రిలీజ్ అవుతున్న కొత్త సినిమా!

Update: 2020-05-02 09:30 GMT
టాలీవుడ్ లో వ‌చ్చిన బెస్ట్ థ్రిల్ల‌ర్ సినిమాల్లో ఒక‌టి క్షణం. ఈ మ‌ధ్య కాలంలో అని కాదు.. మొత్తం తెలుగు థ్రిల్ల‌ర్ల చ‌రిత్ర తీసుకున్నా ఇలాంటి సినిమాలు అరుదుగా క‌నిపిస్తాయి. ప‌క‌డ్బందీ స్క్రీన్ ప్లేతో రూపొందించాడు ఓ కొత్త ద‌ర్శ‌కుడు కావ‌డం విశేషం. ఆ సినిమా స్క్రిప్టులో అడివి శేష్ పాత్ర కీల‌కమే అయినా.. ద‌ర్శ‌కుడిగా ర‌వికాంత్ పేరెపు ప‌నిత‌నం బాగా ఉంది. అయితే ఈ సినిమా వ‌చ్చిన నాలుగేళ్ల‌కు కూడా ర‌వికాంత్ రెండో సినిమా విడుద‌ల కాక‌పోవ‌డ‌మే ఆశ్చ‌ర్యం. మూడేళ్లకు పైగా అత‌డి త‌ర్వాతి సినిమా గురించి అప్ డేట్ కూడా లేదు. ర‌వికాంత్ రెండో సినిమా గురించి ర‌క‌రకాల ప్ర‌చారాలు జ‌రిగాయి. చివ‌రికి అత‌ను సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ బేన‌ర్ల‌లో గుంటూరు టాకీస్ ఫేమ్ సిద్ధు హీరోగా కృష్ణ అండ్ హిస్ లీల అనే సినిమాను లైన్లో పెట్టాడు. త‌న తొలి సినిమాకు పూర్తి భిన్న‌మైన చిత్ర‌మే తీసిన‌ట్లున్నాడు ర‌వికాంత్.

పేరుకు త‌గ్గ‌ట్లే ఒక రొమాంటిక్ కుర్రాడి క‌థ‌ను చెప్ప‌బోతున్నాడు ర‌వికాంత్. అమ్మాయిని చూస్తే టెంప్ట్ అయిపోవ‌డం, ఫ్ల‌ర్ట్ చేయ‌డం.. రిలేష‌న్‌షిప్ మొద‌లుపెట్ట‌డం.. అది ముగిశాక ఇంకో అమ్మాయిని త‌గులుకోవ‌డం.. ఇదీ ఈ సినిమాలో హీరో గారి పని అని టీజర్ చూస్తే తెలుస్తుంది. త‌నకున్న ఈ బ‌ల‌హీన‌త గురించి హీరోనే న‌రేట్ చేసుకుంటూ సాగే టీజ‌ర్ ఆస‌క్తిక‌రంగానే అనిపిస్తోంది. సిద్ధుతో పాటు హీరోయిన్లు శ్ర‌ద్ధ శ్రీనాథ్, షాలిని వ‌డ్నిక‌ట్టి, సీర‌త్ క‌పూర్ నటిస్తున్నారు. సినిమాలో రొమాన్స్ ఓ రేంజిలో ఉంటుందని టీజ‌ర్‌ను బ‌ట్టి అర్థ‌మ‌వుతోంది. ఇక హీరో సిద్ధు ర‌వికాంత్‌తో క‌లిసి ఈ చిత్రానికి స్క్రిప్టు రాయ‌డం విశేషం. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌తో క‌లిసి బాలీవుడ్ నిర్మాణ సంస్థ వ‌యాకామ్ 18 ఈ చిత్రాన్ని నిర్మించింది. అయితే గతేడాది ఆగష్టులోనే షూటింగ్ ముగించుకున్న సినిమా ఇంతవరకు రిలీజ్ కి నోచుకోలేదు. అయితే తాజాగా ఈ సినిమాను ఓటిటి ప్లాట్ ఫామ్ లో విడుదల చేయనున్నారట. ఇక టాలీవుడ్ నుండి ఓటిటిలో రిలీజ్ అవుతున్న రెండో సినిమా ఇది.
Tags:    

Similar News