అధికారికం: విజ‌య్- ర‌ష్మిక పెళ్లి టైటిల్ ప్ర‌క‌ట‌న

విజయ్ - రష్మిక తమ పెళ్లికి `ది వెడ్డింగ్ ఆఫ్ VIROSH` అని పేరు పెట్టడం వెనుక ఒక గొప్ప ఉద్దేశ్యం ఉంది.;

Update: 2026-02-23 03:36 GMT

విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న అభిమానులకు పెద్ద పండగ లాంటి వార్త! గత కొన్ని ఏళ్లుగా సోషల్ మీడియాలో వీరిద్దరి గురించి వస్తున్న ఊహాగానాలకు రూమర్లకు తెరదించుతూ.. ఈ జంట తమ వివాహ ప్రకటనను ఇంత హృద్యంగా చేయడం విశేషం.




 


ఈ ప్రకటనలోని ప్ర‌త్యేక‌త ఏమిటి? అంట‌.. ఈపెళ్లికి టైటిల్ డిసైడ్ చేసింది అభిమానులు అని చెప్పేసింది ర‌ష్మిక‌. దీనికి VIROSH అనే టైటిల్ కూడా పెట్టార‌ట‌.




 


విజయ్ - రష్మిక తమ పెళ్లికి `ది వెడ్డింగ్ ఆఫ్ VIROSH` అని పేరు పెట్టడం వెనుక ఒక గొప్ప ఉద్దేశ్యం ఉంది. ఈ పేరును ఏ వెడ్డింగ్ ప్లానరో లేదా ఫ్యామిలీ మెంబరో సూచించలేదు. ఏళ్ల తరబడి వీరిద్దరినీ కలిపి చూడాలనుకున్న అభిమానులు విజయ్ - రష్మిక పేర్లను కలిపి సృష్టించిన పేరే ఈ VIROSH. తమ ప్రేమికులు ఇచ్చిన పేరునే తమ జీవితకాల వేడుకకు పేరుగా మార్చుకోవడం ద్వారా అభిమానులను ఈ సెలబ్రేషన్‌లో భాగస్వాములను చేశారు.

తాజాగా షేర్ చేసిన శుభ‌లేఖలో ఉన్న ప్రతి పదం అభిమానులపై వారికి ఉన్న గౌరవాన్ని తెలియజేస్తోంది. మేము ఏ ప్లాన్ చేసుకోకముందే, మా గురించి మేము ఏదీ నిర్ణయించుకోకముందే.. మీరు అక్కడ ఉన్నారు. ఎంతో ప్రేమతో మీరు మాకు ఒక పేరు ఇచ్చారు.. అదే VIROSH. అందుకే ఈరోజు మా కలయికకు మీ గౌరవార్థం అదే పేరు పెడుతున్నాం.. అని తెలిపారు.

గీత గోవిందం నుండి విరోష్ వరకు..

గీత గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాలతో ఈ జంట వెండితెరపై సృష్టించిన మ్యాజిక్ అంతా ఇంతా కాదు. అప్పటి నుండే వీరిద్దరూ రియల్ లైఫ్ జోడీ అయితే బాగుంటుందని కోట్లాది మంది కోరుకున్నారు. నేడు వారి కల నిజమవుతుండటంతో సోషల్ మీడియా అంతా `విరోష్` నినాదాలతో హోరెత్తిపోతోంది.

తమ ప్రైవేట్ వేడుకను అందరి వేడుకగా మార్చడంలో విజయ్ స్టైల్ స్పష్టంగా కనిపిస్తోంది. తమ ఎదుగుదలలో తోడుగా నిలిచిన ప్రతి అభిమానికి ఇది ఒక కృతజ్ఞతా పూర్వక నివాళి. `ది వెడ్డింగ్ ఆఫ్ విరోష్` అనేది 2026లోనే అత్యంత చర్చనీయాంశమైన వేడుకగా నిలవబోతోంది. ఇది కేవలం ఇద్దరు స్టార్ల పెళ్లి మాత్రమే కాదు, అభిమానుల మొండి నమ్మకానికి దక్కిన విజయం!

Tags:    

Similar News