వింక్ గాళ్ మ‌దిలో ఏదో క‌ల‌త ఇంకేదో గుబులు!

Update: 2021-08-21 07:30 GMT
వింక్ గాళ్ ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్ గుబులు గుబులుగా క‌నిపిస్తోంది. ఆ మోములో ఏదో తెలీని క‌ల‌త ఇంకేదో తీయ‌ని వింత బాధ .. ఇంత‌కీ ప్రియా మ‌దిలో ఆ ఆందోళ‌న ఏమిటో కానీ.. అది ఆ ముఖంలో ప్ర‌తిఫ‌లిస్తోంది. అయితే ఇది ఎంపిక చేసిన‌ థీమ్.. ప్ర‌త్యేకించి డిజైన్ చేసిన ఫోటోషూట్ అని అర్థ‌మ‌వుతోంది.

ఎంతో క‌ళాత్మ‌కంగా `పట్టు పావ‌డాయ్` లో ఎంతో ముచ్చ‌ట‌గా ట్రెడిష‌న‌ల్ గా క‌నిపిస్తున్న ప్రియాలో ఆ క‌ల‌త‌కు కార‌ణ‌మేంటో తెలుసుకుని తీర్చాల‌ని త‌హ‌త‌హ‌లాడుతున్నారు. కెరీర్ లో స‌రైన హిట్టు ప‌డ‌లేద‌నా? ఆశించిన‌ట్టుగా ఇంకా స్టార్ హీరోయిన్ కాలేక‌పోయాన‌నా? అస‌లు ఆ బాధ‌కు కార‌ణ‌మేమిటో తనే చెబుతుందేమో చూడాలి.

ప్రియా ఎత్తుకు త‌గ్గ‌ట్టే డిజైన‌ర్ డ్రెస్ కుదిరింది. ఆ పొడుగు ప‌రికిణీ - కాంబినేష‌న్ డిజైన‌ర్ బ్లౌజ్ తో బాపు బొమ్మ‌నే త‌లపిస్తోంది. ప్రియా ముగ్ధ మ‌నోహ‌ర రూపంతో యూత్ గుండెల్ని గిల్లేస్తోంది. ప్ర‌స్తుతం ఈ ఫోటోగ్రాఫ్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది.

ఓవ‌ర్ నైట్ సెన్సేష‌న్ అయినా కానీ..!

ప్రియా ప్రకాష్ వారియ‌ర్ ఓవ‌ర్ నైట్ సెన్సేష‌న్ గా ప్ర‌పంచానికి సుప‌రిచితం. మ‌ల‌యాళ మూవీ ఒరు ఆధార్ ల‌వ్ ఈ బ్యూటీని వింక్ గాళ్ గా ప‌రిచ‌యం చేసింది. న‌టించిన తొలి సినిమాతోనే ప్రియా పేరు మార్మోగింది. ఆ త‌ర్వాత బాలీవుడ్ స‌హా తెలుగు చిత్ర‌సీమ‌లోనూ ఈ వింక్ బ్యూటీకి అవ‌కాశాలు క్యూ క‌ట్టాయి.

ఒకే ఒక్క క‌న్నుగీటుతో ప్రియా గొప్ప స్టార్ అయ్యింది. ఇటీవ‌లే నితిన్ స‌ర‌స‌న `చెక్` అనే చిత్రంలో న‌టించింది. ఈ సినిమా ఫ‌లితం నిరాశ‌ప‌రిచినా ప్రియా అంద‌చందాలు మురిపించాయి. ఇక మ‌రో న‌వ‌త‌రం హీరో తేజ స‌జ్జా స‌ర‌స‌న ఇష్క్ అనే చిత్రంలో ప్రియా వారియ‌ర్ క‌థానాయిక‌గా న‌టించింది. కానీ ఈ సినిమా ఆశించినంత విజ‌యం సాధించ‌లేదు. తదుప‌రి ఇస్మార్ట్ బోయ్ రామ్ స‌ర‌స‌న ఓ చిత్రానికి సంత‌కం చేసింద‌ని తెలిసింది. మారుతి ఆ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించే అవ‌కాశం ఉంద‌ని క‌థ‌నాలొచ్చాయి.

ప్రియా ప్ర‌కాష్ సోష‌ల్ మీడియాల్లోనూ బిగ్ స్టార్ గా వెలిగిపోతోంది. ఇప్ప‌టికే ఇత‌ర నాయిక‌ల‌తో పోలిస్తే.. అసాధార‌ణ ఫాలోయింగ్ ఏర్ప‌డిన‌ సంగ‌తి తెలిసిందే. ఒక కోణంలో ట్రెడిష‌న‌ల్ గా క‌నిపిస్తూనే హాట్ గా క‌నిపించ‌డం వింక్ గాళ్ ప్ర‌త్యేక‌త‌. ఇక ప్రియాకు కాటుక క‌ళ్లు రింగుల కురులు మ‌రో ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌. అందుకే నేటిత‌రానికి ఇట్టే క‌నెక్ట‌యిపోయింది. జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా మ‌న ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ప్రియాకి అవ‌కాశాలు ఇస్తున్నారంటే అది త‌న‌లో ఉన్న ప్ర‌త్యేక‌త‌గా భావించాలి. ప్రియ ప్ర‌స్తుతం విష్ణు ప్రియ అనే క‌న్న‌డ చిత్రంలో న‌టిస్తోంది. అలాగే లాంగ్ అవైటెడ శ్రీ‌దేవి బంగ్లా వివాదాల‌ను ప‌రిష్క‌రించుకుని రిలీజ్ కి రావాల్సి ఉంది.




Tags:    

Similar News