ఇండియ‌న్ టాప్ డైరెక్ట‌ర్స్ వీళ్లే!

ఒకప్పుడు కేవలం హీరోల ఇమేజ్‌పైనే సినిమాలు ఆడేవి. కానీ ఇప్పుడు బ్రాండ్ డైరెక్టర్ల హవా నడుస్తోంది.;

Update: 2026-03-26 12:30 GMT

ఒకప్పుడు కేవలం హీరోల ఇమేజ్‌పైనే సినిమాలు ఆడేవి. కానీ ఇప్పుడు బ్రాండ్ డైరెక్టర్ల హవా నడుస్తోంది. బాక్సాఫీస్ వద్ద అపజయం అంటే ఎరుగని కొందరు ధీర దర్శకులు తమదైన ముద్రతో ఇండియన్ సినిమా రికార్డులను తిరగరా స్తున్నారు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వ‌ర‌కూ కొంత మంది ద‌ర్శ‌కులు తీసిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ కావడం ఓ అరుదైన రికార్డుగా చెప్పొచ్చు..ఈ జాబితాలో అగ్రస్థానంలో ఎస్.ఎస్. రాజమౌళి ఉన్నారు. స్టూడెంట్ నంబర్ 1 నుండి మొన్న‌టి ` ఆర్ ఆర్ ఆర్ ` వరకు కెరీర్‌లో అపజయమే లేదు. తెలుగు సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన ఘనత ఆయనది.

అదే విధంగా బాలీవుడ్‌లో రాజ్ కుమార్ హిరాణీ సోషల్ మెసేజ్‌ను కామెడీతో కలిపి అందిస్తూ వంద‌శాతం సక్సెస్ రేట్‌తో దూసుకుపోతున్నారు. వీరిద్దరూ భారతీయ సినిమాకు రెండు కళ్ళ వంటి వారు. సౌత్ ఇండియా నుండి సంచలనాలు సృష్టిస్తోన్న‌ దర్శకుల్లో ప్రశాంత్ నీల్, లోకేష్ కనగరాజ్, సందీప్ రెడ్డి వంగా ప్రధానంగా కనిపిస్తారు. కేజీఎప్ ` తో కన్నడ సినిమా సత్తా చాటిన ప్రశాంత్ నీల్, `ఖైదీ విక్రమ్, లియో`తో తనకంటూ ఒక సినిమాటిక్ యూనివర్స్‌ను సృష్టించుకున్న లోకేష్, `అర్జున్ రెడ్డి , `యానిమల్`అనే రా-రస్టిక్ సినిమాలతో ట్రెండ్ సెట్ చేసిన సందీప్ రెడ్డి వంగా. వీరంతా బాక్సాఫీస్ వద్ద పరాజయమే లేని ధురంధరులు.

టెక్నికల్ వండర్స్ , విజువల్ గ్రాండియర్ విషయానికి వస్తే నాగ్ అశ్విన్ కల్కి 2898 ఏడీ, అయాన్ ముఖర్జీ బ్రహ్మాస్త్ర, ఆదిత్య ధర్ ఉరి, ధురందర్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తాయి. భారీ బడ్జెట్ సినిమాలను హ్యాండిల్ చేయ‌డంలో వీరంతా స్పెష‌లిస్టులే. ప్రేక్షకులను మెప్పించడంలో వీరంతా వంద శాతం సక్సెస్ అయ్యారు. అలాగే మాస్ పల్స్ తెలిసిన అట్లీ - నెల్సన్ దిలీప్ కుమార్ వంటి దర్శకులు కమర్షియల్ సినిమాలతో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నారు. కథా బలంతో పాటు సామాజిక అంశాలను ఎంచుకుంటూనే హిట్లు కొడుతున్న మారీ సెల్వరాజ్ వంటి వారు ఒక వర్గం అయితే? పక్కా కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లతో వరుసగా ఏడు హిట్లు కొట్టిన అనిల్ రావిపూడి మరొక వర్గం.

అనిల్ రావిపూడి ఫ్లాప్ లేని డైరెక్టర్ అనే ట్యాగ్‌ను ప్రతి సినిమాతో నిలబెట్టుకుం టున్నారు. ఇండస్ట్రీ ఏదైనా? వీరంతా కేవలం హిట్లే కాదు. ఇండస్ట్రీ హిట్లు ఇస్తూ బాక్సాఫీస్ చక్రవర్తులుగా వెలిగిపోతున్నారు. ఈ దర్శకులతా తమ ప్రతిభతో హీరోల కంటే మిన్నగా ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకుంటున్నారు. కథనంపై పట్టు, ప్రేక్షకు ల నాడిని పట్టుకోవడంలో వీరు నైపుణ్యం అసామాన్య‌మైంది. భవిష్యత్తులో భారతీయ సినిమా మరిన్ని అంతర్జాతీయ శిఖరాలను అధిరో హించడం ఖాయం. పరాజయం లేని ఈ ప్రయాణం ఇలాగే కొనసాగాలని సినీ ప్రియులు కోరుకుంటున్నారు.

Tags:    

Similar News