హీరోలేనా..మేం కాదా? అంటూ సీన్లోకి హీరోయిన్లు!

సాధార‌ణంగా స్టైలింగ్-మేకోవ‌ర్ అంటే? హీరోల చుట్టూనే చర్చ జ‌రుగుతుంటుంది. స్టార్ హీరో సినిమా కోసం జుట్టు పెంచినా, గడ్డం తీసినా అది పెద్ద వార్త అవుతుంది.;

Update: 2026-03-26 15:30 GMT

సాధార‌ణంగా స్టైలింగ్-మేకోవ‌ర్ అంటే? హీరోల చుట్టూనే చర్చ జ‌రుగుతుంటుంది. స్టార్ హీరో సినిమా కోసం జుట్టు పెంచినా, గడ్డం తీసినా అది పెద్ద వార్త అవుతుంది. ఒక సినిమా కోసం హీరో ఎలా త‌యారైనా అది నెట్టింట సంచ‌ల‌నం అవుతుంది. అదే సినిమా కోసం హీరోయిన్ ఎంత మేకోవ‌ర్ అయినా? అది పెద్ద‌గా వెలుగులోకి రాదు. దానిపై ఎక్క‌డా పెద్ద చ‌ర్చ కూడా జ‌ర‌గ‌దు. అయితే కొంత మంది భామ‌లు ఈ విష‌యంలో హీరోలేనా.. మేం కాదా` అంటూ మేకోవర్ విషయంలో సత్తా చాటుతున్నారు. కేవలం గ్లామర్ షోకే పరిమితం కాకుండా క్యారెక్టర్ డిమాండ్ మేరకు తమను తాము పూర్తిగా మార్చుకుంటూ పాన్ ఇండియా ట్రెండ్‌కు తగ్గట్టుగా సిద్ధమవుతున్నారు.

శ్రుతి హాసన్ తన లుక్స్ విషయంలో నిరంత‌రం చేస్తోన్న‌ ప్రయోగాలు ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంటాయి. కెరీర్ ఆరంభంలోనే అమ్మ‌డు తానో స్టైల్ కా బాప్ అని ప్రూవ్ చేసింది. ఇప్ప‌టికే పాత్ర‌కు త‌గ్గ‌ట్టు అమ్మ‌డి ట్రాన్స‌ప‌ర్మేష‌న్ షాకింగ్ గా అనిపిస్తుంది. అమ్మ‌డు ఎంపిక చేసుకునే కాస్ట్యూమ్స్,మేకప్ స్టైల్ ఓ కొత్త ట్రెండ్‌ను సెట్ చేస్తుంటాయి. గోతిక్ లుక్ నుండి ట్రెడిషనల్ లుక్ వరకు శ్రుతి చూపిస్తున్న వైవిధ్యం ఆక‌ట్టుకుంటుంది. అమ్మ‌డిని హీరోయిన్‌గానే కాకుండా ఒక స్టైల్ ఐకాన్‌గా నిలబెడుతోంది. పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందాలంటే లుక్ ఎంత ముఖ్యమో ఆమె నిరూపిస్తున్నారు.

ఈ మ‌ధ్య కాలంలో కీర్తి సురేష్ కూడా తన ఇమేజ్‌ను పూర్తిగా మార్చేసుకున్నారు. `మహానటి`లో పద్ధతైన అమ్మాయిగా కనిపించిన కీర్తి ఇప్పుడు ఫిట్‌నెస్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టి స్లిమ్‌గా మారిపోయారు. రీసెంట్ సినిమాల్లో ఆమె చూపిస్తోన్న‌ గ్లామర్ , వెస్ట్రన్ మేకోవర్ చూసి అభిమానులు షాక్ అవుతున్నారు. బాలీవుడ్ ఎంట్రీ , పాన్ ఇండియా ప్రాజెక్టుల నేపథ్యంలో, కీర్తి సురేష్ తన స్టైలింగ్‌ను అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా అప్‌గ్రేడ్ చేస్తున్నారు. లేడీ సూపర్ స్టార్ నయనతార స్టైలింగ్ లో మ‌రింత అడ్వాన్స్ గా ఉంటుంది. అమ్మ‌డి మేకోవర్ అనేది ఒక నిరంతర ప్రక్రియ. ప్రతి సినిమాలోనూ ఆమె హెయిర్ స్టైల్ నుండి డ్రెస్సింగ్ వరకు ప్రతిదీ ఒక ట్రెండ్ అవుతుంది.

అందాన్ని కాపాడుకుంటూనే పాత్రకు తగ్గ గాంభీర్యాన్ని తీసుకురావడంలో దిట్ట. సీనియర్ హీరోయిన్ అయినప్పటికీ నేటితరం నటీమణులకు గట్టి పోటీనిస్తూ మెయింటైన్ చేస్తున్న తీరు అమోఘం. రాశి ఖన్నా, భాగ్యశ్రీ బోర్సే, కృతి శెట్టి వంటి యంగ్ హీరోయిన్లు కూడా మేకోవర్ రేసులో దూసుకుపోతున్నారు. కేవలం పక్కింటి అమ్మాయిలా కనిపిస్తే సరిపోదని, గ్లోబల్ ఆడియన్స్‌ను ఆకట్టుకోవాలంటే విజువల్‌గా కూడా ఇంపాక్ట్ చూపించాలని భావిస్తున్నారు. అందుకే జిమ్ వర్కవుట్స్, స్పెషల్ డైట్స్ , టాప్ డిజైనర్లతో కలిసి తమ లుక్స్‌ను డిజైన్ చేయించుకుంటున్నారు.

స్క్రీన్ ప్రెజెన్స్ విషయంలో హీరోలకు ఏమాత్రం తగ్గకూడదనే పట్టుదలతో వీరంతా క‌నిపిస్తున్నారు. మేకోవర్ అంటే కేవలం అందంగా కనిపించడం మాత్రమే కాదు. అది ఒక బ్రాండ్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకోవడమని ఈ తరం నటీమణులు చాటి చెబుతున్నారు.

Tags:    

Similar News