• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పవన్‌ మూవీ లేట్‌ అవ్వడంతో...

పవన్‌ మూవీ లేట్‌ అవ్వడంతో ఈయన కూడా..!

By - Tupaki Desk
Update: 2021-06-13 23:30 GMT
పవన్ కళ్యాణ్‌ వరుసగా పలు సినిమాలకు కమిట్‌ అయ్యాడు. దాంతో ఆయన తో సినిమాలు చేసేందుకు సిద్దం అయిన దర్శకులు నెలలకు నెలలు వెయిట్‌ చేయాల్సి వస్తుంది. దర్శకుడు హరీష్‌ శంకర్ ఏకంగా సంవత్సరంకు మించి వెయిట్‌ చేస్తున్నాడు. ఇక క్రిష్‌ కూడా హరి హర వీరమల్లు సినిమా కోసం చాలా నెలలు వెయిట్‌ చేయాల్సి వచ్చింది. పవన్ తో క్రిష్‌ హరి హర వీరమల్లు సినిమాను మొదలు పెట్టడానికి ముందు వైష్ణవ్‌ తేజ్ తో ఒక సినిమా ను ఆయన చేశాడు. పవన్‌ మూవీ ఆలస్యం అయిన నేపథ్యంలో వైష్ణవ్‌ తేజ్‌ తో సినిమాను ముగించేశాడు. ఇప్పుడు అదే తరహాలో హరీష్ శంకర్ కూడా పవన్‌ మూవీ ఆలస్యం అవుతున్న నేపథ్యంలో కొత్త ప్రాజెక్ట్‌ ను మొదలు పెట్టబోతున్నాడు.

క్రిష్‌ స్వీయ దర్శకత్వంలో సినిమాను తెరకెక్కిస్తే హరీష్‌ శంకర్ మాత్రం నిర్మాతగా ప్రాజెక్ట్‌ ను షురూ చేయబోతున్నాడు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం పవన్‌ కళ్యాణ్‌ మరియు హరీష్‌ శంకర్‌ ల కాంబో మూవీ మరో రెండు మూడు నెలల వరకు ప్రారంభం అయ్యే అవకాశం లేదు. అందుకే హరీష్‌ శంకర్‌ నిర్మాతగా ఒక వెబ్‌ సిరీస్ పట్టాలెక్కబోతుందట. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం దశరథ్ స్క్రిప్ట్‌ అందజేస్తున్న ఈ వెబ్‌ సిరీస్ ను ప్రముఖ ఓటీటీ తో కలిసి హరీష్‌ శంకర్‌ నిర్మిస్తున్నాడని తెలుస్తోంది.

హరీష్‌ శంకర్‌ మూవీ అంటే పక్కా కమర్షియల్‌ ఎంటర్‌ టైనర్‌ గా ఉంటుంది. కాని ఈ వెబ్ సిరీస్ మాత్రం ఒక ప్రయోగాత్మక నేపథ్యంతో రూపొందబోతున్నట్లుగా చెబుతున్నారు. మొత్తానికి పవన్‌ కళ్యాణ్‌ తో సినిమా కంటే ముందే తన నిర్మాణంలో హరీష్‌ శంకర్‌ ఒక వెబ్‌ సిరీస్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నాడు. ఏళ్లకు ఏళ్లు వెయిట్‌ చేసి సమయం వృదా చేయడం కంటే ఇలా గ్యాప్ లో ఏదో ఒక ప్రాజెజ్ట్‌ ను మొదలు పెట్టడం మంచిదనే ఉద్దేశ్యంతో దర్శకులు ఈ నిర్ణయాన్ని తీసుకుంటున్నారు. ఇది మంచి ఆలోచనే అంటూ అభిమానులు కూడా ప్రోత్సహిస్తున్నారు.
Tags:    
  • harish shankar 
  • harish shankar movies 
  • harish shankar ott 
  • harish shankar web series 
  • pawan kalyan 
  • pspk28 

Similar News

ఇద్ద‌రు జాతీయ ఉత్త‌మ న‌టుల ప్ర‌ద‌ర్శ‌న‌తో పూన‌కాలే!

2026-11-05 04:16 GMT

హీరోలు, దర్శకులు, హీరోయిన్లు లేకుండానే సినిమాలు..!

2026-11-05 04:15 GMT

స్టార్ట్ నటుడు తమ్ముడితో దేవిశ్రీప్రసాద్ పోరాటం..!

2026-11-05 04:14 GMT

పెద్ద సినిమాల వల్ల ఎన్నో కష్టాలు.. అసలు సమస్య అదే?

2026-11-05 04:13 GMT

ఆ హీరో పాపం.. అనిరుధ్‌కి ఏం అన్యాయం చేశాడు?

2026-11-05 03:30 GMT

నిజంగా దెబ్బలు తిన్న హీరోయిన్.. కానీ అమ్మా నాన్నకి ఆ సినిమానే ఇష్టమంట..!

2026-11-05 02:31 GMT

ఇద్దరు తమిళ హీరోలు.. ఒక తెలుగు హీరో.. జరగబోనుంది ఏమిటి..?

2026-11-05 02:30 GMT

టాలీవుడ్ రెండు లెజెండరీ ఫ్యామిలీలతో మెగాస్టార్..!

2026-11-05 01:30 GMT

'జైలర్ 2' విజువల్స్ కొత్తగా కనిపించడానికి వాడిన టెక్నిక్ ఏంటంటే?

2026-11-05 00:30 GMT

సుకుమార్ రామ్ చరణ్ ను రంగస్థలం లో చెవిటి వాడిగా చూపించాడు. ఇప్పుడెలా చూపిస్తున్నాడో తెలుసా?

2026-11-04 23:30 GMT

Tollywood: చిన్న తప్పు కూడా పెద్ద ముప్పే!

2026-11-04 22:30 GMT

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

Copyright @2026

Powered by Blink CMS