థియేటర్లు తెరిచినా ఆ పెద్ద సినిమాలను ఓటీటీలోనే రిలీజ్ చేస్తారా..?
కరోనా సెకండ్ వేవ్ పరిస్థితుల్లో సమ్మర్ లో విడుదల కావాల్సిన సినిమాలన్నీ వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలో కొన్ని సినిమాలను డైరెక్ట్ ఓటీటీ విధానంలో రిలీజ్ చేయగా.. పెద్ద సినిమాలు మాత్రం థియేట్రికల్ రిలీజ్ కోసం వెయిట్ చేశాయి. అయితే కొన్ని పెద్ద సినిమాలు కూడా ఓటీటీ బాట పడుతున్నట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి కానీ.. థియేటర్ల ద్వారానే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని మేకర్స్ ప్రకటించారు.
ఇప్పుడు కరోనా తగ్గుముఖం పట్టడంతో ఇండస్ట్రీలో సాదారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. త్వరలోనే థియేటర్లు కూడా తెరుస్తారని అంటున్నారు కానీ.. అది ఎప్పుడనే దానిపై క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలో కొన్ని పెద్ద సినిమాలు డైరెక్ట్ ఓటీటీ రిలీజులకు సిద్ధం అయిపోతున్నాయని టాక్ వినిపిస్తోంది. విక్టరీ వెంకటేష్ హీరోగా దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ''నారప్ప'' ను ఓటీటీలో విడుదల చేయడానికి చర్చలు జరుపుతున్నారట.
సురేష్ ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ వారు ఫ్యాన్సీ రేటుకి దక్కించుకున్నారని.. జూలై నెలాఖరన విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లుగా ఫిలిం సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. అలానే నితిన్ హోమ్ బ్యానర్ శ్రేష్టా మూవీస్ లో రూపొందుతున్న 'మాస్ట్రో' మూవీని కూడా అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించిన ఎగ్రీమెంట్స్ కూడా పూర్తి అయిపోయాయని.. 30-35 కోట్ల మధ్య ఈ డీల్ క్లోజ్ అయిందని చెప్పుకుంటున్నారు.
'నారప్ప' 'మాస్ట్రో' సినిమాలు ఓటీటీలో విడుదల అవుతున్నాయనే దానిలో నిజమెంతో తెలియదు కానీ.. ఫిలిం సర్కిల్స్ న్యూస్ గట్టిగానే వినిపిస్తోంది. ఇదే కనుక నిజమైతే థియేటర్ రంగంలో, డిస్ట్రీబ్యూషన్ రంగంలో అగ్రగామిగా ఉండే నిర్మాతలు కూడా థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేయడం విచిత్రమనే అనుకోవాలి.