అనీల్ 10వ సినిమా కోసం 50 రోజులా!
డైరెక్టర్లలలో వేగంగా కథ రాసి సినిమా పూర్తి చేసే దర్శకుడు ఎవరు? అంటే మొన్నటి వరకూ అంతా డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ పేరు జపించేవారు.;
డైరెక్టర్లలలో వేగంగా కథ రాసి సినిమా పూర్తి చేసే దర్శకుడు ఎవరు? అంటే మొన్నటి వరకూ అంతా డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ పేరు జపించేవారు. కానీ పూరి ఫెయిల్యూర్స్ లో ఉండటంతో పాటు, స్పీడ్ కూడా తగ్గించడంతో? ఇప్పుడా స్థానాన్ని కోల్పోయారు. ఆ స్థానంలో హిట్ మెషిన్ అనీల్ రావిపూడి ఆక్రమించాడు. అనీల్ ఇప్పటి వరకూ తొమ్మిది సినిమాలు డైరెక్ట్ చేసాడు. అవన్నీ బ్లాక్ బస్టర్లే. కమర్శియల్ గా మంచి వసూళ్లను సాధించాయి. ఈ సినిమాల షూటింగ్ అంతా కూడా వేగంగా పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. దాదాపు అన్ని సినిమాలు నెలల వ్యవధిలోనే పూర్తి చేసి రిలీజ్ చేసాడు.
ఈ సినిమాల స్టోరీలు సిద్దం చేయడం కోసం అనీల్ తీసుకున్నది చాలా తక్కువ సమయమే. ఒకే ఒక్క సినిమా స్టోరీ సిద్దం చేయడం కోసం మూడు నెలలు సమయం కేటాయించిగా, మిగతా ఎనిమిది సినిమాలకు నెలలోపే కేటాయించాడు. ఇటీవలే రిలీజ్ అయిన `మన శంకరవరప్రసాద్ గారు` కథకు అనీల్ తీసుకున్న సమయం కేవలం 25 రోజులే. వైజాగ్ పార్క్ హోటల్ లో సిట్టింగ్ వేసి 25 రోజుల్లోనే స్టోరీ సిద్దం చేసి హైదరాబాద్ వచ్చాడు. ఇప్పుడా
సినిమా వందల కోట్ల వసూళ్లు దిశగా దూసుకుపోతుంది. 25 రోజుల్లోనే ఇంత గొప్ప కథ రాసిన అనీల్ ఇంకా ఎక్కువ సమయం కేటాయిస్తే ఇంకా మంచి కథ రాస్తాడు కదా? అన్న సందేహం చాలా మందిలో ఉంది.
కానీ అనీల్ అందుకు వ్యతిరేకం. తాను నమ్మిన ఫార్మెట్ ని మాత్రం ఎప్పటికీ వదలనంటున్నాడు. స్టోరీ విషయంలో రోజుల్లోనూ పూర్తి చేయాలన్నది అతడి ప్లాన్. ఈ నేపథ్యంలో అనీల్ 10వ సినిమా స్టోరీ అప్ డేట్ కూడా తెరపైకి వస్తోంది. ఈ సినిమా కోసం అనీల్ 50 రోజులు సమయం కేటాయించాలనుకుంటున్నాడుట. 45 నుంచి 50 రోజుల మధ్యలో పూర్తయ్యే అవకాశం ఉందంటున్నారు. అదే పార్క్ హోటల్ బీచ్ ముందు కూర్చుని స్టోరీ సిద్దం చేయనున్నాడు. మరో రెండు వారాల తర్వాత అనీల్ నేరుగా వైజాగ్ చేరుకుంటాడని సన్నిహితుల నుంచి తెలిసింది. ఈసారి కూడా కథ పరంగా చాలా సింపుల్ గానే ఉంటుందని..హీరో ఇమేజ్ ఆధారంగా స్టోరీ సిద్దం చేసే అవకాశాలున్నాయంటున్నారు.
హీరో ఎవరు? అన్నది అనీల్ కూడా ఫిక్సై అయ్యాడన్నది తాజా అప్ డేట్. అయితే ఆ హీరో పేరు మాత్రం రివీల్ చేయలేదు. స్టోరీ పూర్తయిన తర్వాత ఆ హీరోకి నేరేట్ చేసే వరకూ ఆ వివరాలు గోప్యంగా ఉంటాయంటున్నారు. ఈ కథలో కూడా హీరో ఇన్వాల్వ్ మెంట్ ఉండదని అనీల్ పూర్తి స్వేచ్ఛతో చేసే మరో ఎంటర్ టైనింగ్ స్క్రిప్ట్ గానే ఉంటుందని అంటున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం ఫిబ్రవరిలో బయటకు వచ్చే అవకాశం ఉంది. అయితే అనీల్ హీరోగా ఇప్పటికే కింగ్ నాగార్జునను ఫిక్సైనట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.