టిక్కెట్టు రేట్లు.. పారితోషికాలు ఎలా ఉండాలో సీఎం డిసైడ్ చేస్తారా?

Update: 2021-09-04 04:30 GMT
తెలుగు సినీప‌రిశ్ర‌మను రెండు  స‌మ‌స్య‌లు తీవ్రంగా వెంటాడుతున్న సంగ‌తి తెలిసిందే. క‌రోనా క్రైసిస్ ఓవైపు .. టిక్కెట్టు రేటు ఇంకోవైపు తెలుగు సినీప‌రిశ్ర‌మ‌ను సంక్షోభంలోకి నెట్టేస్తున్నాయి. మ‌హ‌మ్మారీ త‌గ్గుముఖం ప‌ట్టి థియేట‌ర్లు తెరుస్తున్నా.. మ‌రోవైపు ఏపీలో టిక్కెట్టు ధ‌ర‌ల‌పై సీఎం జ‌గ‌న్ నుంచి ఎలాంటి సానుకూల స్పంద‌నా లేక‌పోవ‌డంపై మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతున్నారు.

అయితే టిక్కెట్టు రేటు స‌హా ప‌రిశ్ర‌మ స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించేందుకు మంత్రి పేర్ని నాని సినీపెద్ద‌ల‌ను ఆహ్వానించిన సంగ‌తి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి - కింగ్ నాగార్జున స‌హా ప‌లువురు సినీ ఇండ‌స్ట్రీ దిగ్గ‌జాలు త్వ‌ర‌లో ఏపీ సీఎం జ‌గ‌న్ ని క‌ల‌వ‌నున్నార‌ని ప్ర‌చార‌మైంది. సెప్టెంబ‌ర్ 4న ముహూర్తం ఫిక్స్ చేశార‌ని కూడా ఇటీవ‌ల క‌థ‌నాలొచ్చాయి. కానీ ఇప్ప‌టివ‌ర‌కూ దీనికి సంబంధించిన అధికారిక స‌మాచారం ఏదీ లేదు. దీంతో ఈ మీటింగ్ కూడా క్యాన్సిల్ అయిన‌ట్టేన‌ని గుస‌గుస‌ల వినిపిస్తున్నాయి.

సీఎం జ‌గ‌న్ కి ఇప్ప‌ట్లో తీరిక ఉండేట్టు లేదు. ఊపిరిస‌ల‌ప‌ని షెడ్యూళ్ల‌తో ఆయ‌న స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. పైగా ఆయ‌న కాబోయే ఎగ్జిక్యూటివ్ క్యాపిట‌ల్ విశాఖ పై పూర్తిగా దృష్టి సారించార‌ని తెలిసింది. విశాఖ నుంచి భోగాపురం మ‌ధ్య జ‌ర‌గాల్సిన వంద‌ల వేల కోట్ల అభివృద్ధికి సంబంధించి పూర్తి క్లారిటీతో ముందుకు వెళుతున్నారు. అందుకు గ్రేట‌ర్ విశాఖ మున్సిపాలిటీ (జీవీఎంసీ) డీపీఆర్ ల‌తో సిద్ధంగా ఉండ‌డంతో ఈ ప‌నుల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్నారు. అలాగే ప్ర‌జా సంక్షేమ కార్య‌క్ర‌మాల‌పైనా పూర్తిగా దృష్టి సారించారు.

కార‌ణం ఏదైనా సినీపెద్ద‌ల‌ను క‌లిసే ముందే సీఎం పేచీ నుంచి ఒక యాక్ష‌న్ ప్లాన్ రెడీ కానుంద‌ట‌. ఏపీలో సినిమా టిక్కెట్టు ధ‌ర‌లు ఎలా ఉండాలి?   ప‌రిశ్ర‌మ‌లో పారితోషికాలు స‌హా ఇత‌ర అంశాలు ఎలా ఉండాలి? అన్న‌దానిపై ఇండ‌స్ట్రీ నిపుణుల నుంచే స‌ల‌హాలు కోరి ఇప్ప‌టికే ఒక యాక్ష‌న్ ప్లాన్ ని సిద్ధం చేసుకున్నార‌ని కూడా తెలుస్తోంది. అంటే చిరంజీవి సార‌థ్యంలో సినీపెద్ద‌లు వెళ్లి సీఎం జ‌గ‌న్ ని క‌లిసినా అట్నుంచి కొన్ని షాక్ లు ఉండ‌బోతున్నాయ‌న్న గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. టిక్కెట్టు ధ‌ర‌ల త‌గ్గింపు అస‌లు మోటో భారీ పారితోషికాలు హంగామా త‌గ్గింపు అని కూడా ఇప్ప‌టికే గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. దీనిని బ‌ట్టి చూస్తే ఇప్ప‌ట్లో తెలుగు ఇండ‌స్ట్రీ కి టిక్కెట్టు స‌మ‌స్య తీరేనా? అన్న సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. టిక్కెట్టు మాత్ర‌మే కాదు.. ఇంకా గ్రౌండ్ లెవ‌ల్ లో ఆ న‌లుగురు లేదా ఆ ప‌ది మంది గుప్పిట్లో ఉన్న ఒక వ్య‌వ‌స్థ‌ను ప్ర‌క్షాళ‌న చేసే దిశ‌గానే ఏపీ సీఎం నిర్ణ‌యం ఉంద‌న్న గుస‌గుస వైర‌ల్ గా స్ప్రెడ్ అవుతోంది. అందుకే మెగాస్టార్ సైతం తొలుత ఇంటిని శుద్ధి చేయాల‌ని ఆ న‌లుగురికి హెచ్చ‌రిక‌లు జారీ చేసార‌ని క‌థ‌నాలొచ్చాయి.

వ‌కీల్ సాబ్ మొద‌లు క్రైసిస్ లోనే రిలీజ్ లు..

వ‌కీల్ సాబ్ రిలీజ్ స‌మ‌యంలో టిక్కెట్టు ధ‌ర‌ల స‌వ‌ర‌ణ‌తో ఏపీలో జారీ అయిన జీవో పెనుముప్పుగా మారిన సంగ‌తి తెలిసిందే. ఆ సినిమా కొంత‌వ‌ర‌కూ న‌ష్టాలు చ‌వి చూడ‌టానికి ఈ జీవో ప్రధాన కార‌ణంగా నిలిచింది. అలాగే క‌రోనా క్రైసిస్ వ‌ల్లా జ‌నం భ‌య‌ప‌డి థియేట‌ర్ల‌కు వెళ్ల‌లేదు. ఆ త‌ర్వాత వ‌రుస‌గా అర‌డ‌జ‌ను పైగానే తెలుగు సినిమాలు థియేట‌ర్ల‌లో రిలీజైనా వ‌సూళ్లు లేక వెల‌వెల‌బోయాయి. థియేట‌ర్ల‌కు జ‌నం వ‌చ్చినా ఏపీలో టిక్కెట్టు ధ‌ర‌ల వ‌ల్ల ప్ర‌యోజ‌నం శూన్యంగా మారిందని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు వాపోతున్నాయి. ఇలాంటి ప‌రిస్థితిలో క్రేజు ఉన్న సినిమాని కూడా థియేట‌ర్ల‌లో రిలీజ్ చేసేందుకు నిర్మాత‌లు వెన‌కాడే ప‌రిస్థితి క‌నిపిస్తోంది.
Tags:    

Similar News