సాయి పల్లవితో శర్వా మరోసారి రొమాన్స్!
శర్వానంద్.. సాయి పల్లవి మొదటిసారి 'పడి పడి లేచే మనసు' సినిమాకోసం జోడీ కట్టారు. ఇద్దరి మధ్య కెమిస్ట్రీకి... నటనకు ప్రేక్షకులు ఫుల్లు మార్క్స్ వేసినా సినిమాలో ఉండే కంటెంట్ కు క్వార్టర్ మార్క్స్ మాత్రమే వెయ్యడంతో సినిమా కాస్తా బోల్తా పడింది. అయితే ప్రేక్షకులు శర్వా-సాయి పల్లవి జోడీని మరోసారి వెండి తెరపై చూడబోతున్నారు. ఇందుకు ప్రస్తుతం రంగం సిద్ధమవుతోందని సమాచారం.
లవ్ ఎంటర్టైనర్లకు కేరాఫ్ అడ్రెస్ అయిన కిషోర్ తిరుమల ప్రస్తుతం ఎనర్జిటిక్ స్టార్ రామ్ తో 'రెడ్' అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత చెయ్యబోయే సినిమాకు ఇప్పటికే కథ రెడీ చేసుకున్నారట. శర్వానంద్- సాయి పల్లవిలకు వినిపించి వారి దగ్గర నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా తీసుకున్నారట. ఈ సినిమాను 'పడి పడి లేచే మనసు' నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మిస్తారని సమాచారం. 'రెడ్' సినిమా పూర్తి కాగానే ఈ కొత్త సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారట.
ఈ సినిమా కూడా కిషోర్ తిరుమల గతంలో రూపొందించిన సినిమాల తరహాలో సరదాగా సాగిపోయే ఒక లవ్ ఎంటర్టైనర్ అని అంటున్నారు. ఈ సినిమాను మే లో సెట్స్ మీదకు తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నారట. శర్వానంద్- సాయి పల్లవి ఇద్దరూ మంచి పెర్ఫార్మర్లు. మంచి కంటెంట్ కూడా కుదిరితే ప్రేక్షకులను మెప్పించడం ఖాయమే. మరి కిషోర్ తిరుమల ఈ పడి పడి లేచే జంటను నిలబెడతాడో లేదో వేచి చూడాలి.