సుశాంత్ సింగ్ సూసైడ్ కేసుపై రియా నోరు విప్పనుందా..?

Update: 2021-01-01 12:30 GMT
బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ చనిపోయిన తర్వాత ఆ కేసులో ఎక్కువగా వినిపించిన పేరు రియా చక్రవర్తి. సుశాంత్ మరణించిన నెల రోజులకు తనని సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ గా పరిచయం చేసుకుని ఈ కేసులో సీబీఐ దర్యాప్తు చేయమని హోమ్ మినిస్టర్ అమిత్ షా కి లేఖ రాసింది. అయితే అనూహ్యంగా సుశాంత్ సూసైడ్ కేసు రియా మెడకే చుట్టుకుంది. అతని తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో రియా పై బీహార్ పోలీసులు ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేశారు. ఆ తర్వాత డ్రగ్స్ కేసు వెలుగులోకి రావడం.. ఆమె చుట్టూ ఈ కేసు మరింత బిగుసుకోవడంతో సంచలన రీతిలో రియా అరెస్ట్ అయింది. దాదాపు నెల రోజులపాటు జైలు జీవితం గడిపిన రియా.. బెయిల్‌ పై విడుదల కావడంతో కాస్త ఉపశమనం లభించింది. జైలు నుంచి వచ్చాక మీడియాకు దూరంగా ఉంటూ వస్తున్న రియా త్వరలో ఈ కేసు గురించి నోరు విప్పే అవకాశం ఉందని అంటున్నారు.

ఇటీవల సుశాంత్ సింగ్ రాజ్‌ పుత్ స్నేహితుడు దర్శకుడు రూమీ జాఫరీ రియా చక్రవర్తి గురించి పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారని తెలుస్తోంది. రియాని కలిసి మాట్లాడానని.. ఆమె జైలు జీవితం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదని తెలిపాడు. ఆ బాధ భయం ఇంకా ఆమెలో కనిపిస్తున్నాయని.. వచ్చే ఏడాది రియా తన సినీ కెరీర్‌ పై ఫోకస్ పెట్టే అవకాశం ఉందని.. అలానే ఈ కేసులపై నోరు విప్పే అవకాశం కూడా లేకపోలేదని జాఫరీ చెప్పుకొచ్చారు. కాగా, సుశాంత్ సింగ్ మరణం కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. అలాగే ఈడీ మరియు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో కూడా విచారణ చేపడుతోంది. మరి త్వరలోనే ఈ దర్యాప్తు ఓ కొలిక్కి వస్తుందేమో చూడాలి.
Tags:    

Similar News