'ఏకే' రీమేక్ లో పవన్ కళ్యాణ్ - రానా భీభత్సం చేయనున్నారా..??

Update: 2021-06-30 10:30 GMT
ఈ మధ్యకాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీ మేకర్స్ మలయాళం సినిమాలను రీమేక్ చేసేందుకు ఎక్కువగా ఇంటరెస్ట్ చూపిస్తున్నట్లు అనిపిస్తుంది. ఎందుకంటే ఒకటి రెండు సినిమాలంటే సరే చేస్తున్నారు అనుకోవచ్చు. కానీ మలయాళంలో తమిళంలో ఏ సినిమా బ్లాక్ బస్టర్ అయినా టాలీవుడ్ మేకర్స్ వెంటనే రీమేక్ హక్కులు దక్కించుకున్నాం అనేసి ప్రకటిస్తున్నారు. అంటే రీమేక్స్ తప్ప ఆ రేంజి మూవీస్ తెలుగులో నేరుగా రావా అంటూ సోషల్ మీడియాలో సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మలయాళం నుండి చిన్న పెద్ద కలిపి చాలా సినిమాలే తెరకేక్కుతున్నాయి.

ప్రస్తుతం మేకింగ్ దశలోనే పది వరకు సినిమాలున్నాయని సమాచారం. అందులోను స్టార్ హీరోలు కూడా రీమేక్స్ బాటే పట్టడం ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే ఓ మెగాస్టార్.. ఓ వెంకీ.. ఇలా ఎందరో హీరోలు రీమేక్స్ బాటపడుతున్నారు. అందులో ఒకరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. పవన్ - దగ్గుబాటి రానా కాంబినేషన్ లో ప్రస్తుతం 'అయ్యప్పనుమ్ కోషియం' రీమేక్ అవుతోంది. గతేడాది రిలీజ్ అయినటువంటి ఈ చిత్రం మలయాళంలో బాక్సఫీస్ రికార్డు క్రియేట్ చేసింది. అయితే ఒరిజినల్ లో పృథ్వీరాజ్ సుకుమారన్.. బిజు మీనన్ ప్రధానపాత్రల్లో నటించారు. ప్రస్తుతం తెలుగులో పవన్ కళ్యాణ్ - రానా కలిసి తెరకెక్కుతోంది.

అయితే మలయాళంలో ఈ సినిమాలో మంచి ఫైట్స్ కూడా ఉంటాయి. మన తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మేకర్స్ ఈ స్క్రిప్ట్ రెడీ చేశారు. సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం గురించి తాజాగా సోషల్ మీడియాలో మరో పుకారు వైరల్ అవుతోంది. అదేంటంటే.. ఈ చిత్రంలో దాదాపు నాలుగు ఫైట్స్ ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఇద్దరూ వ్యక్తుల పర్సనల్ ఇగోస్ ద్వారా వారి కుటుంబాలు ఎలాంటి బాధలను ఎదుర్కొంటాయి అనేది చాలా ఎమోషనల్ గా ఉండబోతుందని సమాచారం. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి అగ్రదర్శకుడు త్రివిక్రమ్ మాటలు అందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా పై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి.
Tags:    

Similar News