అడ్వాన్స్ ట్రెండ్ తో పవన్ ఫ్యాన్స్ మళ్లీ రికార్డ్ ఖాయమా?
పవన్ కళ్యాణ్ బర్త్ డే అంటే అభిమానులకు పండుగ. ఒకప్పుడు బర్త్ డే రోజున అభిమానులు సేవా కార్యక్రమాలు చేస్తూ ప్లెక్సీలు మరియు హోర్డింగ్స్ తో హోరెత్తించే వారు. కాని ఇప్పుడు అలా కాదు. సోషల్ మీడియాలో ట్రెండ్స్ చేయడం ఈతరం అభిమానుల స్టైల్. తమ అభిమాన హీరో పుట్టిన రోజున హ్యాష్ ట్యాగ్ ను వైరల్ చేయడం కామన్ గా మారింది. ముఖ్యంగా పెద్ద హీరోల బర్త్ డే హ్యాష్ ట్యాగ్స్ రికార్డుల మోత మ్రోగించిన ఘనత మన తెలుగు హీరోల అభిమానుల కు ఉంది. పవన్ కళ్యాణ్ అభిమానులు ఆయన బర్త్ డే కోసం వెయిట్ చేస్తున్నారు. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ బర్త్ డే ఉన్నా కూడా కౌంట్ డౌన్ ను మొదలు పెట్టబోతున్నారు.
సెప్టెంబర్ 2 న పెద్ద ఎత్తున పుట్టిన రోజు వేడుకలు జరగడం సాదారణమే. కాని పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు 50 రోజులు ఉండగానే పవనోత్సవం అనే హ్యాష్ ట్యాగ్ తో సందడి చేసేందుకు అభిమానులు సిద్దం అవుతున్నారు. అడ్వాన్స్ హ్యాపీ బర్త్ డే పవన్ కళ్యాణ్ హ్యాట్ ట్యాగ్ ను సరిగ్గా 50 రోజులు పుట్టిన రోజు ఉండగా అంటే ఈనెల 14న ప్రకటించబోతున్నారు. ఆ హ్యాష్ ట్యాగ్ తో ఈ 50 రోజుల పాటు రచ్చ రచ్చగా అభిమానులు ట్విట్టర్ లో ఇతర సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ పైనా సందడి చేయబోతున్నారు.
గతంలో అత్యధిక ట్వీట్స్ ను 24 గంటల్లో చేసిన ఘనత తెలుగు అభిమానులకు ఉంది. అందుకే ఈసారి మరోసారి మన వారి రికార్డును మన వాళ్లే బ్రేక్ చేస్తారేమో అంటూ అంతా ఆసక్తిగా చూస్తున్నారు. బాలీవుడ్ హీరోల అభిమానులు కూడా దక్కించుకోని అరుదైన సోషల్ మీడియా రికార్డులను దక్కించుకోవడమే కాకుండా అత్యధిక ట్వీట్స్ తో వరల్డ్ రికార్డ్ ను కూడా నమోదు చేసిన ఘనత మన వారికి ఉంది. అందుకే మరో సారి ఈనెల 14న పవనోత్సవం హ్యాష్ ట్యాగ్ రికార్డులను బద్దలు కొడుతుందేమో చూడాలి.