బ్యాక్ టూ బ్యాక్ ఆ ద్వయం ప్లానింగ్ వేరయా?
`ప్రేమలు` విజయంతో సౌత్ లో ఫేమస్ అయిన బ్యూటీ మమితాబైజు ఒక్క సారిగా తమిళ, తెలుగు సినిమాలో బిజీ అయింది. వరుసగా ఛాన్సు లు అందుకుంటూ క్షణం తీరిక లేకుంగా గడుపుతోంది.;
`ప్రేమలు` విజయంతో సౌత్ లో ఫేమస్ అయిన బ్యూటీ మమితాబైజు ఒక్క సారిగా తమిళ, తెలుగు సినిమాలో బిజీ అయింది. వరుసగా ఛాన్సు లు అందుకుంటూ క్షణం తీరిక లేకుంగా గడుపుతోంది. `జననాయగన్` లో దళపతి విజయ్ కి జోడీగా నటించింది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అవుతున్న చిత్రమిది. ఈ సినిమా విజయం సాధిస్తే మమిత మమితా బైజు కోలీవుడ్లో మరింత బిజీ అవుతుంది. సూర్య 46వ చిత్రంలోనే ఈ భామే హీరోయిన్. సూర్య హీరోగా వెంకీ అట్లూరి తెరకెక్కిస్తోన్న చిత్రమిది.
దీంతో పాటు `ఇరాండు వనం`లోనూ నటిస్తోంది. మమితా బైజు నటిస్తున్న మరో తెలుగు చిత్రం `డియర్ కృష్ణ`. ఇది ఒక యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్. ఇందులో అక్షయ్ కృష్ణన్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా ద్వారానే మమిత తెలుగులో లాంచ్ అవుతుంది. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పటికే విడుదలైంది. అలాగే `ప్రేమలు`కు సీక్వెల్ గా `ప్రేమలు 2` కూడా ప్రకటించారు. పాన్ ఇండియాలో భారీ ఎత్తున ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇదే `ప్రేమలు 2` కంటే ముందే అదే జోడీ మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నారు.
దర్శకుడు ప్రేమ్ గిరీష్ తో మమితా బైజు మరో సినిమాకు చేయడానికి రెడీ అవుతోంది. ఇందులో సంగీత్ ప్రతాప్ హీరోగా నటిస్తున్నాడు. ప్రేమకథా నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రమిది. ఇందులో హీరోయిన్ గా పలువురు కన్నడ భామల్ని పరిశీలించి చివరిగా మమితనే ఫైనల్ చేసారు. `ప్రేమలు` సక్సెస్ అనంతరం అదే దర్శకుడితో మమితా బైజు పని చేయడం విశేషం. ఈసినిమా షూటింగ్ ఏప్రిల్ నుంచి ప్రారంభించాలని సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా అనంతరం `ప్రేమలు 2` పట్టాలెక్కించే అవకాశం ఉంది. ప్రస్తుతం మమితా బైజు వివిధ సినిమా షూటింగ్ లతో బిజీ గా ఉంది.
వాటి అనంతరం గిరీష్ ప్రాజెక్ట్ ల్లో భాగమవుతుంది. అలాగే తమిళ్ లో బిజీ అవ్వడంతో మలయాళ సినిమాలకు దూరమవుతోంది? అన్న విమర్శల నేపథ్యంలో మళ్లీ అక్కడా సినిమాలు చేసే ప్రయత్నాల్లో ఉంది. `బెతాలం` కుటుంబ యూనిట్` అనే చిత్రానికి సైన్ చేసింది. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభమవుతుంది. ఇవి గాక తెలుగులో కొత్త అవకాశాలు వస్తున్నాయి. కానీ పాత్రల పరంగా సెలక్టివ్ గా ఉంది. పారితోషికం కోసం కాకుండా కథా బలమున్న చిత్రాలు మాత్రమే ఒకే చేస్తుంది. అలాగే గ్లామర్ పాత్రలకు కూడా అమ్మడు తొలి నుంచి దూరమే. ఇప్పటికీ అలాగే కొనసాగుతోంది.