నయనతారకు పోటీగా రష్మిక!
మరో ఏడాది రెండేళ్ల పాటు నయనతారకు ఎలాంటి పోటీ ఉండదు. కానీ రెండేళ్ల తర్వాత సన్నివేశం మారే అవకాశం ఉంది.;
దక్షిణాది చిత్ర పరిశ్రమలో నెంబవర్ హీరోయిన్ ఎవరు? అంటే లేడీ సూపర్ స్టార్ నయనతార పేరే వినిపిస్తోంది.ప్రఖ్యాత తమిళ, తెలుగు పరిశ్రమల్లో నయన్ ఇమేజ్ ఎంతో ప్రత్యేకం. ఎంత మంది హీరోయిన్లు ఉన్నా? మరెంత మంది కొత్త భామలు నిత్యం దిగుతమతి అవుతున్నా నయనతారను ఇంచు కూడా కదపలేకపోయారు. చిత్ర పరిశ్రమలో నయన్ తనని తాను అలా బిల్డ్ చేసుకుంది. తాను ప్రాధాన్యత ఇచ్చేది డబ్బుకు కాదు..అంతకు మించి అంటూ ఎన్నో సందర్భాల్లో ప్రూవ్ చేసుకుంది. ఇదే నయన్ క్రేజ్ కి ఓ స్పెషల్ రీజన్ గా చెప్పొచ్చు.
మరో ఏడాది రెండేళ్ల పాటు నయనతారకు ఎలాంటి పోటీ ఉండదు. కానీ రెండేళ్ల తర్వాత సన్నివేశం మారే అవకాశం ఉంది. లేడీ సూపర్ స్టార్ కు పోటీగా నేషనల్ క్రష్ రష్మికా మందన్నా తయారవుతుందనే గెస్సింగ్స్ తెరపైకి వస్తు న్నాయి. `పుష్ప` విజయంతో రష్మిక పాన్ ఇండియాలో ఎంతగా ఫేమస్ అయిందో తెలిసిందే. అదే క్రేజ్ తో బాలీవుడ్ లో నూ బిజీ నటిగా మారింది. నెటి జనరేష్ హీరోయిన్లలలో అత్యధిక పారితోషికం అందుకుంటోన్న నటిగా గుర్తింపు దక్కించుకుంది. ప్రత్యేకించి సౌత్ లో ఎనలేని క్రేజ్ ని సొంతం చేసుకుంది. సొంత పరిశ్రమ కన్నడలో వివాదాస్పదం అవ్వడానికి పరోక్షంగా ఈ క్రేజే కారణం అన్నది అంతే వాస్తవం.
ఇదే క్రేజ్ తో సౌత్ లో ఎన్నో కొత్త అవకాశాలు క్యూ కడుతున్నాయి. కానీ రష్మిక మాత్రం సౌత్ సినిమాల్ని లైట్ తీసుకుంటుంది. తమిళ, తెలుగులో గొప్ప అవకాశాలైతే తప్ప కమిట్ అవ్వడం లేదు. నయనతార కూడా కొంత కాలంగా ఇదే విధానంలో సినిమాలు చేస్తోంది. బాలీవుడ్ లో మాత్రం ఎలాంటి అంతరం లేకుండా పని చేస్తోంది. అలాగే రష్మిక లేడీ ఓరియేంటెడ్ చిత్రాలతోనూ సత్తా చాటే ప్రయత్నాలు సీరియస్ గానే చేస్తుంది. ఇప్పటికే `ది గర్ల్ ప్రెండ్` తో మంచి విజయాన్ని అందుకుంది. ఆ సినిమాకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి.
త్వరలో `మైసా` అనే హారర్ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. రిలీజ్ అయిన ప్రచార చిత్రాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇలాంటి హిట్ రష్మిక ఖాతాలో పడితే సౌత్ లో ఇమేజ్ రెట్టింపు అవుతుంది. నయనతార కూడా లేడీ ఓరియేంటెడ్ సినిమాలు చేస్తోంది. కానీ వాటితో మార్కెట్ లో ఇంపాక్ట్ చూపించలేకపోతుంది. ఈ రెండు జానర్లలో నయన తార-రష్మిక లను పొలిస్తే రష్మిక బెస్ట్ గా కనిపిస్తోంది. నేషనల్ క్రష్ ఇలాగే కొనసాగిస్తే నయనతార స్థానానికి ఎసరు పెట్టడం ఖాయమే.