• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అక్కినేని బ్రదర్స్...

అక్కినేని బ్రదర్స్ ఈసారైనా అనుకున్నది సాధిస్తారా..?

By - Tupaki Desk
Update: 2022-11-24 12:30 GMT
ఏ హీరోకైనా కెరీర్ ఎక్కువకాలం కొనసాగాలంటే మాస్ ఇమేజ్ ముఖ్యమని భావిస్తుంటారు. క్లాస్ సినిమాలతో విజయాలు అందుకున్నా.. దీర్ఘకాలం ఇండస్ట్రీలో రాణించాలంటే మాత్రం మాస్ బాట పట్టాల్సి ఉంటుంది. మాస్ హీరో అనిపించుకుంటే క్రేజ్ తో పాటు మార్కెట్ కూడా విస్తరిస్తుంది. అందుకే ప్రతీ హీరో కూడా మాస్ ఇమేజ్ కోసం ట్రై చేస్తుంటారు. అక్కినేని బ్రదర్స్ కూడా అలాంటి మాస్ ప్రయత్నాలు చేస్తున్నారు.

కింగ్ అక్కినేని నాగార్జున వారసులుగా ఇండస్ట్రీలో హీరోలుగా ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య మరియు అఖిల్.. తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోడానికి బాగా కష్టపడుతున్నారు. అయితే కెరీర్ ప్రారంభం నుంచీ మాస్ ఇమేజ్ కోసం ట్రై చేస్తున్నారు కానీ.. వర్కౌట్ అవడం లేదు. క్లాస్ లవ్ స్టోరీలే అన్నదమ్ములిద్దరికీ విజయాలు తెచ్చిపెడుతున్నాయి.

'జోష్' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన యువసామ్రాట్ నాగచైతన్య..  'ఏమాయ చేసావే' వంటి క్లాస్ సినిమాతో హిట్టు కొట్టాడు. అయితే మాస్ ఇమేజ్ కోసం చేసిన 'దడ' 'ఆటోనగర్ సూర్య' 'బెజవాడ రౌడీలు' వంటి మాస్ మరియు యాక్షన్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాలు సాధించలేదు.

అదే సమయంలో '100% లవ్'  'మనం'  'ప్రేమమ్'  'మజిలీ'  'లవ్ స్టోరీ' వంటి ఫ్యామిలీ అండ్ క్లాస్ చిత్రాలు మంచి సక్సెస్ అందించాయి. అయితే ఇటీవల 'థాంక్యూ' సినిమా ప్లాప్ అవడంతో.. చైతూ మళ్ళీ ఇప్పుడు మాస్ ప్రయత్నం చేస్తున్నారు. "కస్టడీ" వంటి మాస్ యాక్షన్ చిత్రంతో వస్తున్నారు.

వెంకట్ ప్రభు దర్శకత్వంలో నాగచైతన్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ "కస్టడీ". నిన్న చైతూ పుట్టిన రోజు సందర్భంగా 'మీరు ప్రపంచంలో చూడాలనుకునే మార్పు మీరే అయ్యుండాలి' అంటూ విడుదల చేసిన ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

విలక్షణ దర్శకుడు వెంకట్ ప్రభు మార్క్ కథతో పాటుగా.. చైతన్య మాస్ ఇమేజ్ ని ఆవిష్కరించనున్నారని తెలుస్తోంది. ఫ్యాన్స్ కోరుకునే మాస్ అండ్ యాక్షన్ అంశాలతో పక్కా కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా "కస్టడీ" చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

అలానే యూత్ కింగ్ అఖిల్ అక్కినేని సైతం డెబ్యూ మూవీ "అఖిల్" తోనే మాస్ ప్రయత్నం చేశారు. ఈ సినిమా ఫ్లాప్ అవడంతో క్లాస్ బాట పట్టాడు. 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' చిత్రంతో హిట్టు కొట్టిన అఖిల్.. మళ్ళీ ఇప్పుడు "ఏజెంట్" వంటి మాస్ అండ్ యాక్షన్ మూవీతో రాబోతున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.

నిజానికి ఏఎన్నార్ దగ్గర నుంచి కూడా అక్కినేని హీరోలు క్లాస్ చిత్రాలతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అక్కినేని బ్రదర్స్ కూడా అలాంటి చిత్రాలతోనే హిట్లు కొట్టారు. అయితే ఇప్పుడు ఇద్దరూ మాస్ ప్రయత్నాలు మొదలుపెట్టారు. మరి ఈసారైనా వర్కౌట్ అవుతుందేమో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    
  • Akkineni 
  • KingNagarjuna 
  • NagaChaitanya 
  • Akhil 
  • Tollywood 
  • LoveStorys 
  • MassImage 
  • LatestNews 
  • MovieNews 
  • TupakiNews 

Similar News

ఛాన్సిచ్చారు క‌దా అని అంత మాటనేస్తావా త‌మ్మూ?

2026-11-19 16:30 GMT

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

Copyright @2026

Powered by Blink CMS