• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  యువ దర్శకుల కు ఛాలెంజ్

యువ దర్శకుల కు ఛాలెంజ్

By - Tupaki Desk
Update: 2018-12-19 07:32 GMT
టాలీవుడ్ లో ఇప్పుడు యంగ్ టాలెంట్ కి కొదవ లేదు. హీరో ఎవరైనా కొత్తా పాత అనే తేడా లేకుండా తమ ఆలోచనలను వెండితెర పై ఆవిష్కరిస్తున్న తీరు ప్రశంశల తో పాటు వసూళ్లు కూడా తెచ్చి పెడుతున్నాయి. అయితే సినిమా పరిశ్రమ సక్సెస్ తో ముడిపడింది. ఇక్కడ విజయం ఉన్నన్ని రోజుల బ్రహ్మరధం దక్కుతుంది. అది పోయిన రోజు కాశీ తీర్థం అందుతుంది. అందుకే  ట్రాక్ రికార్డు తో సంబంధం లేకుండా ఎప్పటికప్పుడు కొత్త సవాళ్ళను స్వీకరించాల్సిందే. ఇప్పుడు ఈ విషయంలో  2018 తమ డెబ్యూలతో సూపర్ సక్సెస్ అందుకున్న ముగ్గురు దర్శకులు ఒకేరకమైన సవాల్ ను ఎదురుకుంటున్నారు.

వరుణ్ తేజ్ తొలిప్రేమ తో ఇండస్ట్రీ దృష్టిని ఆకట్టుకున్న వెంకీ అట్లూరి అక్కినేని వారసుడు అఖిల్ తో మిస్టర్ మజ్ను చేస్తున్న సంగతి తెలిసిందే. మూడేళ్ళలో కేవలం రెండే సినిమాలు చేసి వాటినీ డిజాస్టర్లు చేసుకున్న అఖిల్ కు ఒక పెద్ద హిట్ చాలా అవసరం. అది వెంకీ తీరుస్తాడనే నమ్మకంతోనే లేట్ అయినా మిస్టర్ మజ్ను పట్టాలు ఎక్కే దాకా అఖిల్ వెయిట్ చేసి మరీ దీనికి రెడీ అయ్యాడు. మరో పక్క లిమిటెడ్ బడ్జెట్ లో అన్ లిమిటెడ్ ఫన్ అందించి నాగ శౌర్యకు ఒక మార్కెట్ ని ఇచ్చి రష్మిక మందన్న లాంటి బ్యూటీని టాలీవుడ్ కు పరిచయం చేసిన వెంకీ కుడుముల ఇప్పుడు నితిన్ తో చేస్తున్న సంగతి తెలిసిందే. లై-చల్ మోహనరంగ-శ్రీనివాస కళ్యాణం వరస దెబ్బలకు డౌన్ లో నితిన్ కు సాలిడ్ హిట్ పడాల్సిన తరుణంలో ఆ బాధ్యత వెంకీ కుడుములు మీద పడింది. షూటింగ్ త్వరలో ప్రారంభం కానున్న ఈ మూవీ లో రష్మికనే హీరోయిన్.

ఇక నాని నిర్మించిన అ! లాంటి టిపికల్ స్టోరీ తో పరిచయమైన ప్రశాంత్ వర్మ రాజశేఖర్ తో కల్కి చేస్తున్నాడు. ఒకప్పుడు గ్యారెంటీ హీరో గా ఉన్న సీనియర్ హీరో గా రాజశేఖర్ కు మంచి మార్కెట్ ఉండేది. చాలా ఏళ్ళ తర్వాత గరుడవేగా సక్సెస్ అనిపించుకున్నా కమర్షియల్ లెక్కల్లో నష్టాలు తప్పలేదు. అయినా అది ఆయన రేంజ్ హిట్ అయితే కాదు. సో ప్రశాంత్ వర్మ కు ఇది చిన్న భారం కాదు. సో ఈ ముగ్గురు యువ దర్శకులు తమ రెండో సినిమాల్లో హీరోలకు అర్జెంటుగా హిట్ కావలసిన టార్గెట్ ను ఎలా ఛేదిస్తారో ద్వితీయ విఘ్నాన్ని ఎలా దాటుకుంటారో వచ్చే ఏడాది తేలిపోతుంది
    

Tags:    
  • venky kudumula 
  • venky atluri 
  • prashant varma 

Similar News

కిరణ్ అబ్బవరం.. ఈ జనరేషన్‌తో కొత్త భయం!

2026-11-04 04:56 GMT

కిరణ్ అబ్బవరం.. నిర్మాతకు కనిపించిన మరో యాంగిల్!

2026-11-04 04:34 GMT

బుడ్డోడు ప్రజ్వల్.. మొన్న AK 47.. ఇప్పుడు సమ్మర్ హాలీడేస్

2026-11-04 04:20 GMT

తరుణ్ భాస్కర్.. హిట్ ఇచ్చిన షాక్ అలాంటిది!

2026-11-04 04:20 GMT

రెబల్ లుక్ లో హుమా ఖురేషి.. కుర్రాళ్లు ఏమైపోవాలి?

2026-11-04 04:19 GMT

షారూక్ కోసం కరణ్ జోహార్.. ఎంత ప్రేమంటే..

2026-11-04 04:02 GMT

కింగ్ 100 గ్లింప్స్‌.. నాగ్‌కు టబుతోనే అసలు పోటీ!

2026-11-04 04:01 GMT

విజయేంద్ర ప్రసాద్.. ఏం చేస్తున్నారు?

2026-11-04 01:30 GMT

ఆప‌రేష‌న్ సింధూర్‌పై పాన్ ఇండియ‌న్ సినిమా.. యువ‌హీరో జాక్‌పాట్!

2026-11-04 00:30 GMT

డిసెంబర్‌లో తెలుగు సినిమాలకు హాలీవుడ్ టెన్షన్!

2026-11-03 23:30 GMT

హాలీవుడ్‌లో ఆర్నాల్డ్- కోలీవుడ్‌లో మ్యాడీ ఇద్ద‌రిదీ ఒకటే బాట‌!

2026-11-03 22:30 GMT

పాన్ ఇండియా సినిమాలకు.. ప్రస్తుత కాలం పనికిరాదా?

2026-11-03 19:30 GMT

Copyright @2026

Powered by Blink CMS