• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అఖిల్ విషయంలో ఏం...

అఖిల్ విషయంలో ఏం జరుగుతోందబ్బా..?

By - Tupaki Desk
Update: 2019-01-31 10:52 GMT
అక్కినేని అఖిల్ తన తాజా చిత్రం 'Mr. మజ్ను' హిట్ అవుతుందని.. తనకు బ్రేక్ ఇస్తుందని రిలీజ్ కు ముందు నమ్మకంగా ఉన్నా ఫలితం మాత్రం అందుకు తగ్గట్టుగా లేదు.  నిజానికి ఈ సినిమాకు ఉన్నంత అనుకూలమైన పరిస్థితి అఖిల్ నటించిన గత రెండు సినిమాలకు లేదు.  అయినా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మందకొడిగా వసూళ్లు నమోదు చేయడం ఒకింత ఆశ్చర్యానికి గురిచేసే అంశమే.

అఖిల్ మొదటి సినిమా నిజంగానే బాగాలేదు. దానికి తోడూ ఓవర్ హైప్.. స్టార్ హీరో అనే రేంజ్ లో ప్రొజెక్ట్ చేయడం సినిమాపై నెగెటివ్ గా ఇంపాక్ట్ చూపించింది. ఆ సినిమా ఎఫెక్ట్ రెండో సినిమా మీద కూడా పడిందనడం ఏమాత్రం అతిశయోక్తి కాదు.  'హలో' కు పాజిటివ్ టాక్ వచ్చినా జనాలు పెద్దగా ఆసక్తి చూపించలేదు.  సరే 'హలో' అంటే కాంపిటీషన్ లో రిలీజ్ అయింది కాబట్టి నిలబడలేదు అనుకున్నా అఖిల్ తాజా చిత్రం పరిస్థితి మరీ తీసికట్టులా ఉంది.   కాంపిటీషన్ లేదు.. సినిమాకు యావరేజ్ రివ్యూస్.. డీసెంట్ మౌత్ టాక్ వచ్చింది. అయినా సినిమాకు బిలో యావరేజ్ కలెక్షన్స్ రావడం ఎందుకనేది ఇప్పుడు అంతుచిక్కడం లేదు.  సినిమా బడ్జెట్ తక్కువే అయినా అందులో కూడా 60% రికవరీతో సరిపెట్టుకోవాల్సి రావడం నిజంగా ఆలోచించాల్సిన అంశమే.

అఖిల్ ను స్టార్ హీరోలా ప్రొజెక్ట్ చేయడం వల్లే నెగెటివిటీ ఏర్పడిందని కొందరు అభిప్రాయలు వ్యక్తం చేస్తున్నారు కానీ దానికి మించి కూడా కొన్ని వేరే అంశాలు ఉన్నాయని మరికొందరు అంటున్నారు.  నాగార్జునకు వయసు మీదపడడం తో అక్కినేని ఫ్యాన్ బేస్ తగ్గడం ఒక కారణం అయితే.. అక్కినేని ఫ్యామిలీలో నాగార్జున తర్వాత ఫ్యాన్ బేస్ నిలబెట్టే హీరోలు ఒక్కరు కూడా లేకపోవడం పెద్ద మైనస్ అయింది.  చైతు..సుమంత్.. సుశాంత్ ఇలా ఎంతమంది ఉన్నప్పటికీ వీరు ప్రేక్షకుల సహనానికి పరిక్షలు పెడుతున్నారు గానీ ఈ జెనరేషన్ యూత్ ను ఫ్యాన్స్ గా ఏర్పరుచుకునే సినిమాలు చేయడం లేదు.  ఈ ముగ్గురిలో కొద్దో గొప్పో సక్సెస్ అయిన చైతు కూడా తనకంటూ ఒక ప్రత్యేకత చూపలేకుండా ఉన్నాడు. నాగార్జున తనయుడిగా.. ఎఎన్నార్ మనవడిగా కాకుండా నాగ చైతన్య కు ప్రత్యేకంగా ఫ్యాన్ ఒక్కరైనా ఉన్నారా అనే కఠినమైన ప్రశ్న వేసుకుంటే మనకు సమాధానం ఇట్టే దొరుకుతుంది.

ఇదిలా ఉంటే అఖిల్ ఎంచుకున్న సినిమాలు కూడా అంతంత మాత్రంగానే ఉండడంతో ఆ సినిమాలు ఆడియన్స్ ను థియేటర్ల వరకూ రప్పించలేకపోతున్నాయి.  అఖిల్ ఎందుకు సక్సెస్ కాలేకుండా ఉన్నాడు అంటే.. అఖిల్ చేస్తున్నవి ఫార్మాట్ సినిమాలు.  వాటి రిజల్ట్ కూడా దానికి తగ్గట్టే ఉంటుంది.. అలా కాకుండా విజయ్ దేవరకొండ.. నిఖిల్.. వరుణ్ తేజ్ తరహాలో కొత్తదనం కోసం ప్రయత్నిస్తేనే ఒక్కసినిమాతో కాకపోయినా రెండు మూడు సినిమాలు చేసే సమయానికి సక్సెస్ఫుల్ హీరోగా నిలబడతాడనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.  అఖిల్ ఈ ఫెయిల్యూర్ల నుండి ఎలాంటి పాఠాలు నేర్చుకుంటాడో వేచి చూడాలి. ఏదేమైనా అఖిల్ 'స్టార్ మెటీరియల్' అనే విషయంలో మాత్రం ఎవరికీ సందేహాలు లేవు.
Tags:    
  • Akhil Akkineni 
  • Mr Majnu 
  • telugu News 

Similar News

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

మాతృశిశు మంగళ ఆశీర్వాదం పద్ధతిలో సమంత సీమంతం.. శీతల్ క్లారిటీ!

2026-11-19 08:08 GMT

శ్రీలీల ఈసారి తెలుగు సినిమాల‌కు ఒకే చెబుతుందా?

2026-11-19 08:07 GMT

నితిన్ వర్సెస్ చైతూ.. అసలు ఫైట్ దర్శకులదే!

2026-11-19 08:07 GMT

రాధిక ఆప్టే వివాదంలో చిక్కుకున్న కీర్తి సురేష్.. ఆ మాత్రం తెలియదా అంటూ ఫైర్!

2026-11-19 08:04 GMT

టార్గెట్ రీచ్ అయితే న‌య‌న్ రిటైర్మెంట్ ఇచ్చేస్తుందా?

2026-11-19 07:58 GMT

బీనా త్రిపాఠి గతం వెనుక విషాద ప్రేమకథ!

2026-11-19 07:56 GMT

తమన్నా టాలెంట్ కి ఆడియన్స్ ఫిదా.. భలే కలిసొస్తోందే?

2026-11-19 07:55 GMT

టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్.. హిట్ల వెనుక సీక్రెట్ ఫార్ముల?

2026-11-19 07:55 GMT

రామ్ పోతినేని 'RAPO23' ప్రీ లుక్ రిలీజ్.. చేతిలో గన్, మరో చేతిలో టెడ్డీ బేర్!

2026-11-19 07:53 GMT

హృతిక్ ముందు డ్యాన్స్ ముచ్చట్లు బయటపెట్టిన అనన్య!

2026-11-19 07:53 GMT

సౌందర్య నాకు గట్టి పోటీ ఇచ్చింది.. రమ్యకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-19 06:00 GMT

Copyright @2026

Powered by Blink CMS