• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సాహో - సైరా లలో ఇలాంటి...

సాహో - సైరా లలో ఇలాంటి సీన్లు ఎవరికి లాభం!

By - Tupaki Desk
Update: 2019-10-04 14:30 GMT
ఈ మధ్య మన తెలుగు దర్శకులు చాలామంది ఆరు పాటలు, ఆరు ఫైట్స్ ఫార్ములాని పక్కన పెట్టి కొత్తగా సినిమాలు తీస్తున్నారు. తెలుగు ప్రేక్షకులు కూడా దీనిని బాగానే రిసీవ్ చేసుకుంటున్నారు. దీంతో మన దర్శకులకి, హీరోలకి, ప్రొడ్యూసర్స్ కి ధైర్యం పెరిగింది. భారీ బడ్జెట్ సినిమాలకు ప్రాముఖ్యత ఇస్తూ బాలీవుడ్ ని తలదన్నే సినిమాలు చేస్తూ తెలుగు సినిమాని శిఖరం మీద కూర్చోపెడుతున్నారు. కానీ ఎంత ఖర్చు పెట్టిన వెనక్కి తెచుకోగలం అని కాన్ఫిడెంట్ ఉంటే పర్లేదు కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. ఈ మధ్య వస్తున్న మన తెలుగు సినిమాలు ఖర్చు పెట్టాల్సిన దానికంటే ఎక్కువ ఖర్చు పెడుతున్నట్టు అనిపిస్తుంది.

నెల రోజుల క్రితం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 'సాహో' చిత్రం విడుదలైంది. అందులో సినిమాకి అసలు ఏ మాత్రం సంబంధం లేని సీన్లు కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా ప్రభాస్ ఇంట్రడక్షన్ సీన్ ఫైట్ లో ఒక చీకటి గదిలో ఒక బ్లాక్ పాంథర్ కనిపిస్తుంది. అది అక్కడ ఎందుకు కనిపిస్తుందో డైరెక్టర్ సుజిత్ కే తెలియాలి. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన సైరా సినిమాలో కూడా ఈ బ్లాక్ పాంథర్ ఒక సీన్ లో కనిపిస్తుంది. బ్రిటిష్ వాళ్ళు ఇండియాకి షిప్ లో బ్లాక్ పాంథర్ ను పంపిస్తారు. నిజంగానే బ్రిటిష్ వాళ్ళు ఇలాంటి క్రూర మృగాలను ఇండియాకి పంపించారా, లేదా అనేది తెలీదు. ఇలాంటి సీన్లు ఈ మధ్య వస్తున్న సినిమాలలో చాలా ఉంటున్నాయి.

ఈ సీన్లు సినిమాలో రిచ్ నెస్ కోసం పెడుతున్నారా, నిజంగా కథకి అవసరం అనుకుని పెడుతున్నారా అనేది దర్శకులకే తెలియాలి. ఈ సీన్ల వల్ల వీప్ఎక్స్ కంపెనీలు లాభాలు పెంచుకుంటున్నాయి. కానీ ప్రొడ్యూసర్ పరిస్థితి చూస్తే జాలేస్తుంది. ఇలాంటి సీన్ల కోసం బడ్జెట్ పెంచేస్తే సినిమా హిట్ అయితే ఓకే. బట్ సినిమా ఏదైనా తేడా కొడితే మాత్రం ప్రొడ్యూసర్ దారుణంగా నష్టపోతాడు.
Tags:    
  • Saaho 
  • Prabhas 
  • Chiru 
  • sujeeth 
  • Sye Raa Narasimha Reddy 
  • Director Sujeeth 
  • Surendra Reddy 
  • Black Panther 
  • Budgets 

Similar News

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

మాతృశిశు మంగళ ఆశీర్వాదం పద్ధతిలో సమంత సీమంతం.. శీతల్ క్లారిటీ!

2026-11-19 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS